వాలంటీర్ల విషయంలో జనసేనాని పవన్‌కల్యాణ్‌ను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పిచ్చోడిని చేసింది. వాలంటీర్లపై పవన్ అవాకులు చెవాకులు పేలడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. పవన్‌తో తప్పులు చేయించి, ఇప్పుడు తీరిగ్గా వాలంటీర్, సచివాలయ వ్యవస్థపై టీడీపీ తన వైఖరిని స్పష్టం చేయడం విశేషం. అది కూడా పవన్ అభిప్రాయాలకు పూర్తి భిన్నంగా, వైసీపీ సర్కార్ విధానాలను మద్దతుగా టీడీపీ వంత పాడడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
పంచాయతీరాజ్ వ్యవస్థ వుండగా అసలు వాలంటీర్లు ఎందుకంటూ పవన్‌కల్యాణ్ ఆవేశంతో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వాలంటీర్లను బ్రోకర్లుగా, ఆ వ్యవస్థే దండుగగా పవన్ చేసిన కామెంట్స్‌పై ఇంకా రచ్చ సాగుతుండగానే, టీడీపీ కీలక ప్రకటన చేసింది.
టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్, సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తామనే ప్రచారం కేవలం అపోహ మాత్రమే అని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొనడం ద్వారా జగన్ తీసుకొచ్చిన వ్యవస్థ ఎంత బలీయమైందో చెప్పకనే చెప్పారు. అలాగే వేధింపులకు తావు లేకుండా, జవాబుదారీగా ఉండేలా చూస్తామని టీడీపీ స్పష్టం చేసింది. వాలంటీర్ వ్యవస్థలో లోపాలను సరిదిద్దుతామని ఆ పార్టీ పేర్కొనడం ద్వారా పవన్‌కల్యాణ్‌ను ఎర్రిపప్పను చేసినట్టైందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా వాలంటీర్, సచివాలయ వ్యవస్థపై టీడీపీ సానుకూల ప్రకటనతో పవన్ విమర్శల్లోని డొల్లతనం బయటపడింది. వైఎస్ జగన్‌పై వ్యక్తిగత ద్వేషంతోనే పవన్ వాలంటీర్లను దుర్మార్గులుగా చిత్రీకరించారనే చర్చకు తెరలేచింది. వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు ఇబ్బందికరంగా మారి వుంటే, దాన్ని రద్దు చేస్తామని టీడీపీ ఎందుకు చెప్పలేకపోయిందో దత్త పుత్రుడైన పవన్ చెప్పాలనే డిమాండ్లు వస్తున్నాయి. కనీసం టీడీపీ ప్రకటనతోనైనా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని పవన్‌కు హితవు చెబుతున్నారు.