బాబుకు లోలోప‌ల భ‌య‌మే!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తెలుగు రాజ‌కీయాల్లో సుదీర్ఘ రాజ‌కీయ‌, ప‌రిపాల‌న అనుభ‌వం ఉన్న నాయ‌కుడు. బాబుపై ఎన్ని ర‌కాల విమ‌ర్శ‌లున్నా, రాజ‌కీయాల్లో ఎత్తుప‌ల్లాలు తెలిసిన లీడ‌ర్‌. కాలం ఎప్పుడూ ఒకేలా వుండ‌ద‌ని ఆయ‌న‌కు తెలిసినంత‌గా, మ‌రే…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తెలుగు రాజ‌కీయాల్లో సుదీర్ఘ రాజ‌కీయ‌, ప‌రిపాల‌న అనుభ‌వం ఉన్న నాయ‌కుడు. బాబుపై ఎన్ని ర‌కాల విమ‌ర్శ‌లున్నా, రాజ‌కీయాల్లో ఎత్తుప‌ల్లాలు తెలిసిన లీడ‌ర్‌. కాలం ఎప్పుడూ ఒకేలా వుండ‌ద‌ని ఆయ‌న‌కు తెలిసినంత‌గా, మ‌రే నాయ‌కుడికి తెలియ‌దు. అందుకే అధికారంలో ఉన్న‌ప్పుడు ఎగిరెగిరి ప‌డితే, ఆ త‌ర్వాత అది పోతే తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌నే భ‌యంతో జాగ్ర‌త్త‌గా న‌డుచుకుంటుంటారు.

గ‌త ప‌దేళ్ల‌లో ఏపీలో రాజ‌కీయ స్వ‌భావం మారుతూ వ‌చ్చింది. సామాన్య ప్ర‌జానీకం అస‌హ్యించుకునే రాజ‌కీయ ప‌రిస్థితులు నెల‌కున్నాయి. దీనికి ఒక పార్టీనే కార‌ణం అని చెప్ప‌డం స‌రైంది కాదు. తిలా పాపం త‌లా పిడికెడు అనే సామెత చందానా… ఏపీలోని రాజ‌కీయ పార్టీల‌న్నీ భ్ర‌ష్ట రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో భాగ‌స్వాములే. ఈ నేప‌థ్యంలో వైసీపీ 11 సీట్ల‌కే ప‌డిపోవ‌డం, కూట‌మి అప‌రిమిత అధికారాన్ని దక్కించుకోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే ఇవే రాజ‌కీయ ప‌రిస్థితులు ఉండ‌వ‌ని చంద్ర‌బాబుకు బాగా తెలుసు. వైసీపీ దారుణంగా ఓడిపోయిన‌ప్ప‌టికీ, మ‌ళ్లీ పైకి లేస్తోందేమో అని ఆయ‌న‌కు లోలోప‌ల భ‌యం వుంది. అదే ఆయ‌న్ను వెంటాడుతుందేమో అనే అనుమానం. జ‌గ‌న్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త త‌ప్ప‌, త‌మ‌పై అభిమానంతో జ‌నం ఓట్లు వేయ‌లేద‌ని చంద్ర‌బాబుకు తెలియంది కాదు. అలాగే చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు కూడా కూట‌మికి క‌లిసొచ్చాయి.

హామీలు అమ‌లు చేయ‌డం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు స‌వాల్‌గా మారింది. హామీలు అమ‌లు చేయ‌క‌పోతే, న‌ష్టం టీడీపీ, చంద్ర‌బాబుకే. అధికారం పోతే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బీజేపీకి న‌ష్ట‌మేమీ లేదు. ఇదే విష‌యాన్ని ప‌వ‌న్ ఇటీవ‌ల కూడా అన‌డం గ‌మ‌నార్హం. రాజ‌కీయ నాయ‌కుల‌కు అధికారంపై త‌ప్ప‌, ప్ర‌జ‌ల‌పై ప్రేమ ఉండ‌దు. అలాగే ప్ర‌జ‌ల‌కు కూడా రాజ‌కీయ నాయ‌కుల‌పై ప్రేమ ఉండ‌దు. త‌మ‌కు అత్య‌ధిక ప్ర‌యోజ‌నాలు ఎవ‌రైతే క‌లిగిస్తార‌ని న‌మ్ముతారో వారికే మ‌ద్ద‌తు ఇస్తారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాట‌పై నిల‌బ‌డ‌క‌పోతే మాత్రం ఎన్నిక‌ల్లో బుద్ధి చెబుతారు.

ఎన్నిక‌ల్లో అనేక‌సార్లు గెలుపోట‌ముల రుచి చూసిన చంద్ర‌బాబుకు భ‌విష్య‌త్ అంతా స‌వాలే. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా వుండ‌డం, అప్పులు పుట్టే ప‌రిస్థితి కూడా అంతంత మాత్రంగానే వుండ‌డంతో హామీలు అమ‌లుపై ఆయ‌న‌కు గుబులు ప‌ట్టుకుంది. హామీల‌ను అమ‌లు చేసిన జ‌గ‌న్‌నే ఓడించిన జ‌నానికి, ఇక మాట‌పై నిల‌బ‌డ‌క‌పోతే… అనే ఆలోచ‌న ఆయ‌న వెన్నులో త‌ప్ప‌క వ‌ణుకు పుట్టిస్తూ వుంటుంది.

అందుకే ప్ర‌తి క్ష‌ణం హామీల అమలుపైనే ఆయ‌న ఆలోచ‌న‌ల‌న్నీ. వాట‌ని నెర‌వేర్చే దారి కోసం అన్వేష‌ణ‌. మ‌రోవైపు నెర‌వేర్చ‌క‌పోతే ఎన్నిక‌ల ఫ‌లితాలపై స్ప‌ష్ట‌త ఆయ‌నకు నిద్ర‌లేని రాత్రుల్ని మిగుల్చుతోంద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. కేంద్ర‌, రాష్ట్ర బ‌డ్జెట్‌లు ఎన్నిక‌ల హామీల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్నాయి. ఇదే సంద‌ర్భంలో కూట‌మి భ‌విష్య‌త్ కూడా తేల‌నుంది.

13 Replies to “బాబుకు లోలోప‌ల భ‌య‌మే!”

  1. “ఎన్నిక‌ల్లో అనేక‌సార్లు గెలుపోట‌ముల రుచి చూసిన చంద్ర‌బాబుకు భ‌విష్య‌త్ అంతా స‌వాలే”

    now 75 years and by 2029 he reaches 79-80 years. Yet you are saying he worries about the future. Jagan is above all, he doesn’t age, he doesn’t accept responsibilities. Not even a single article written in favor of

    jagan in this site never contained the words such as future or discipline, why?

  2. అవును అవును ఇదే కావాలి .. ఆంధ్ర లో ఫీల్ గుడ్ ఎన్విరాన్మెంట్ ఉండ కూడదు .. జనాలు పధకాల మీదే బతకాలి ..

  3. అలగా జనాల నాడి చ్బ్న్ కి తెలిసినట్టు మరే రాజకీయపోడికి తెలియదు…… ఒక్క మొదటినెల పెన్షన్ అది కూడ జగన్ ప్రభుత్వం చూపిన దారిలో జాగ్రత్తగా దాటేసినా,మిగిలిన కాలం కాస్త కష్టమే.. అలాగె డిఎస్పి అదెలా మారతాదో..ఇక ఆడ బిడ్డలకి ఇస్తామన్నది,బస్సు ఫ్రీ కొరివితో గోఖ్ఖోడమే.. లెట్ అజ్ ఎంజాయి థె డ్రామా..ఎపిసోడ్స్..

  4. Great andhra psychologist service … enjoy…inkaa 59 months undhi…..CBI vallavi… special court ki. CBN ki….Avinash jagananna veyani roads Paine nadavalaaaa

  5. కేంద్రం బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయిస్తే హామీలు నెరవేరుస్తారు లేకుంటే కేంద్రం లో బీజేపీ కి 2029 లో 2 సీట్స్ కూడా రావు , ప్రత్యేక హోదా విషయం లో ఆంధ్ర జనాలకి బాగా తెలుసు బీజేపీ ఎలా మోసం చేస్తుందో సో బీజేపీ నిజాయతి ఇప్పుడు నిర్దారణ అవుతాది

  6. మళ్ళీ జగన్ రుణమాపీ అంటారు అందరు అటుపోతారు ప్రభుత్వం మీద వెతిరేకం అన్ని కలిసి జగన్ కీ అధికారం ఇస్తాయి

  7. వై సీపీ ఎమ్మెల్యే 151 మందిని చంద్రబాబు ఒక్కడే ఫేస్ చేశాడు ఇప్పుడున్న టిడిపి 136 మందిని ఫేస్ చేయలేక పారిపోయిన జగన్ ఎవరికి ఎవరంటే భయం ఈపాటికి నీకు అర్థం అయిపోయి ఉండాలి ఎందుకురా ఈ మేకపోతు గాంభిర్యాలు

Comments are closed.