ఎమ్మెల్సీ ఎంపికకు కులమే కీలక అర్హత!

తెలుగుదేశం పార్టీ రకరకాల కసరత్తులు చేస్తున్నది గానీ.. నిర్ణయం ప్రకటించడానికి మాత్రం వారికి ధైర్యం చాలడం లేదు. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో ఎన్డీయే కూటమికి చాలా ఆశలున్నాయి. ఆ…

తెలుగుదేశం పార్టీ రకరకాల కసరత్తులు చేస్తున్నది గానీ.. నిర్ణయం ప్రకటించడానికి మాత్రం వారికి ధైర్యం చాలడం లేదు. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో ఎన్డీయే కూటమికి చాలా ఆశలున్నాయి. ఆ స్థానాన్ని తాము దక్కించుకోవాలనే కోరిక ఉంది. ఆశలావు పీక సన్నం అన్నట్టుగా.. వారికి తగిన బలం మాత్రం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో సాహసించి అభ్యర్థిని ప్రకటించడానికి వారికి ఇంకా ధైర్యం చాలడం లేదు. అదే క్రమంలో.. పోటీకి దిగాల్సి వస్తే.. అభ్యర్థికి కులమే ప్రధాన అర్హత అని కూడా కూటమి నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

841 ఓట్లున్న ఎమ్మెల్సీ ఎన్నిక అది. 600పైగా ఓట్లు వైసీపీవే. అయితే అటువైపు నుంచి ఫిరాయింపుల మీద తెలుగుదేశం కూటమి ఆశలు పెట్టుకుంటోంది. విశాఖ కార్పొరేటర్ల వరకు కొందరు ఆల్రెడీ ఫిరాయించారు. కానీ ఈ బలం చాలదు. దాదాపుగా రెండొందల మంది స్థానిక సంస్థల ప్రతినిధులు వైసీపీనుంచి తెలుగుదేశంలో చేరితే తప్ప.. ఆ ఎమ్మెల్సీ సీటు దక్కదు. ఒకవైపు తెదేపా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రలోభాల పర్వం కొనసాగిస్తూనే ఉన్నప్పటికీ.. స్పందనలు అంత ఆశావహంగా లేవని సమాచారం అందుతోంది.

ఇలాంటి నేపథ్యంలో తొందరపడి పోటీకి దిగితే పరువు పోతుందని ఎన్డీయే కూటమి భయపడుతోంది. ఇప్పుడే ఎన్నికల్లో గెలిచి జోరు మీదుండగా.. ఒక్కఓటమి ఎదురైనా సరే.. దానిని విపక్షం ఎడ్వాంటేజీగా మార్చుకుంటుందని వారు ఆలోచిస్తున్నారు. అలాగని పోటీకి దిగకుండా మిన్నకుంటే కూడా పరువు నష్టమే అని సంకోచిస్తున్నారు. అభ్యర్థి ఎంపికకు పలు కసరత్తులు చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంతనాలు సాగుతున్నాయి.

ఉత్తరాంధ్రలో ఎంతో బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణను వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయనను దీటుగా ఎదుర్కొనే నాయకుడి కోసం కూటమి అన్వేషణ సాగిస్తోంది. అంతే బలమైన సామాజిక వర్గం నేతనే ఎంపిక చేయాలనే అనుకుంటున్నారు. లేదా, తాము కూడా తూర్పు కాపు నేతనే బరిలోకి దింపి ఎడ్వాంటేజీ తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు.

ఏ కులానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేస్తే.. వైసీపీ నుంచి ప్రజా ప్రతినిధులను ఫిరాయింపులకు ఆకర్షించడం సులభం అవుతుందనే లెక్కలు వేస్తున్నారు. ఒకవైపు నామినేషన్ల పర్వం దగ్గర పడుతుండడంతో.. కూటమి అభ్యర్థి ఎంపిక రెండు మూడురోజుల్లో తేలుతుందని అనుకుంటున్నారు. తెలుగుదేశం నాయకుడినే మోహరిస్తారని కూడా అనుకుంటున్నారు.

5 Replies to “ఎమ్మెల్సీ ఎంపికకు కులమే కీలక అర్హత!”

  1. నువ్వు కులం గురించి మాటలాడుతునువ్ వైసీపీ అధికారం లో ఉన్నప్పుడ్డు కులం కులం అన్లేదే. ఎప్పుడు చానా బెటర్. నీ వారతాళ్లు ఏంట్రా బాబు, వైసీపీ న్యూ పూర్తిగా ముంచే వరకు నువ్వు అప్పుకు న్యూ భజన.

  2. నువ్వు కులం గురించి మాటలాడుతునువ్ వైసీపీ అధికారం లో ఉన్నప్పుడ్డు కులం కులం అన్లేదే. ఎప్పుడు చానా బెటర్. నీ వారతాళ్లు ఏంట్రా బాబు, వైసీపీ న్యూ పూర్తిగా ముంచే వరకు నువ్వు అప్పుకు న్యూ భజన.

Comments are closed.