Thangalaan Review: మూవీ రివ్యూ: తంగలాన్

అయితే ప్రధమార్ధం చాలా గ్రిప్పింగ్ గా సాగితే, ద్వితీయార్థం సాగతీసినట్టు అనిపిస్తుంది.

చిత్రం: తంగలాన్
రేటింగ్: 2.75/5
తారాగణం: విక్రం, పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పసుపతి, డేనియల్ కాల్టగిరోన్, హరికృష్ణ అంబిదురై, వేట్టై ముత్తుకుమార్ తదితరులు
ఎడిటింగ్: సెల్వ ఆర్కె
కెమెరా: కిషోర్ కుమార్
సంగీతం: జీవీ ప్రకాష్
నిర్మాత: జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం: పా రంజిత్
విడుదల: 15 ఆగష్ట్ 2024

గుర్తుపట్టడానికే వీలు లేనంత అనూహ్యమైన గెటప్పులో దర్శనమిస్తూ “తంగలాన్” గా విక్రం పోస్టర్ వచ్చినప్పటి నుంచి ఈ చిత్రంపై ఆసక్తి మొదలయింది. అందులోనూ పా రంజిత్ దర్శకత్వం అనే సరికి చెప్పదలచుకున్నది ఇంటెన్సిటీతో చెప్తాడు కనుక అంచనాలు కూడా బయలుదేరాయి. ఇంతకీ ఎలా ఉందో చూద్దాం.

1850లో నేటి చిత్తూరు ప్రాంతంలోని ఒక మారుమూల పల్లెటూరు. తంగలాన్ (విక్రం) ఒక శ్రామికుడు. అతనికి భార్య (పార్వతి), పిలల్లు. ఆ ఊరిలోని ఒక ఏరియాలో పాకల్లో నివాసముంటూ ఉంటారు మిగిలిన కుటుంబాలతో.

పిల్లలకి తన ముత్తాతకి జరిగిన సంఘటన అంటూ …ఏనుగుకొండ వెనకాల బంగారం కొండ ఉందని, అక్కడ ఒక రక్షకురాలు ఉందని ఏవో కథలు చెప్తుంటాడు తంగలాన్.

బంగారు నిథుల గురించి తెలుసుకున్న బ్రిటీష్ దొరలు ఆ ఊరి జనాన్ని కూలిలుగా తీసుకెళ్తారు ఆ ప్రాంతానికి. కానీ ఇన్నాళ్లు తాను పిల్లలకి చెప్పింది కథ కాదని, అదంతా వాస్తవమని అర్ధమవుతుంది. అయితే ఆ వాస్తవం తనకి ఊహగా ఎలా తెలిసింది అని ఆశ్చర్యపడతాడు.

నిధి అన్వేషణలో భాగంగా బయలుదేరిన వారందరికీ ఎటువంటి ప్రమాదాలు, కష్టాలు ఎదురయ్యాయి, చివరికి ఏమౌతుంది అనేది ప్రధానమైన కథ.

కథ సింపులే అయినా, కఠినతరమైన కథనాన్ని రాసుకున్నాడు దర్శకుడు. అలా రాసుకోవడంలో కొత్తగా ఏదొ చెప్పాలన్న తపన, కృషి కనిపించాయి. ఇలాంటి కథనంతో మెప్పించాలంటే ఆర్టిష్టుల నుంచి, సాంకేతిక నిపుణుల వరకు ప్రతి విభాగం సహకరించాలి.

ప్రధమార్ధంలో చాలా సేపటి వరకు ఆ యాంబియన్స్ కి అలవాటు పడడానికే సరిపోతుంది. కథ గాడిలో పడిన తర్వాత చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. “ఇండియానా జోన్స్” సిరీస్ చిత్రంలాగ, ట్రెజర్ హంట్ కాన్సెప్టుతో నడిచిన కథనం.

విక్రం ఈ సినిమాకి పర్ధామైన హైలైట్. అవార్డులు తెచ్చిపెట్టే విధంగా నటించాడు. గెటప్, బాడీ, బాడీ లాంగ్వేజ్, నటన అన్నింటిలోనూ వైవిధ్యం చూపించాడు. మెథడ్ యాక్టింగ్ చేసాడు. నేటి వరకు అపరిచితమైన పాత్రని సమర్ధవంతంగా పోషించాడు ఈ “అపరిచితుడు”. అతని కష్టానికి తగిన ఫలితం ప్రేక్షకులకి అనుభూతి రూపంలో కలిగింది.

ఆరతి పాత్రలో మాళవిక మోహనన్ గగుర్పాటు కలిగించేలా నటించింది. పార్వతి తిరువోతు డీగ్లామరస్ పాత్రలో కనిపించి మెప్పించింది. మిగిలిన నటీనటులంతా 18 వ శతాబ్దం నుంచి ఊడి పడ్డారా అన్నట్టున్నారు.

బ్రిటీష్ దొరగా డేనియల్ చాలా సహజంగా ఉన్నాడు. డ్యుయల్ షేడ్స్ ఉన్న పాత్ర అతనిది.

సినిమాలు చాలా రకాలుంటాయి. అయితే కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కిన సినిమా అన్నప్పుడు కొన్ని జానర్స్ ని ఊహించలేం. మరీ ముఖ్యంగా పెద్ద హీరోలు నటిస్తున్నప్పుడు వారి స్టార్డం ని చాలెంజ్ చేసే పాత్రలు వేస్తారని కూడా అనుకోలేం. వేషభాషలు, వస్త్రధారణ లాంటి విషయాల్లో ఏ మాత్రం తగ్గకుండా, బట్ట నలగకుండా ఫైట్లు చేస్తూ, హీరోయిన్స్ తో డ్యాన్సులు చేస్తూ అలరించే మాస్ హీరోలనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఒక్కోసారి పెద్ద హీరోలు కొన్ని సాహసాలు చేస్తారు. గోచీ పెట్టుకుని నటిస్తారు. అరగుండు చేయించుకుని దర్శనమిస్తారు. సిక్స్ ప్యాక్ లేదని కంగారుపడకుండా, గ్రాఫిక్సులో కండలు పెంచమని కోరకుండా ఉన్న శరీరంతోనే చొక్కా విప్పి నటిస్తారు. అలాంటి సాహసం చేసిన నటుడు చియాన్ విక్రం.

1850 నేపథ్యంలో సినిమా మొదలవుతుంది. కానీ కథనం పరంగా కాసేపు అక్కడి నుంచి ఒక శతాబ్దం వెనక్కి, ఒక సందర్భంలో క్రీస్తు పూర్వం 5 వ శతాబ్దానికి కూడా వెళ్తుంది. ఇక్కడ తంగలాన్ గా కనిపించే విక్రం వివిధ కాలాల్లో వివిధ రూపాల్లో వేరు వేరు పేర్లతో కనిపిస్తాడు. ఆ పాత్రల నిడివి పెద్దగా లేకపోయినా పేర్ల ప్రస్తావన, రూపదర్శనం మాత్రం జరుగుతాయి.

అదలా ఉంచితే దర్శకుడు పా రంజిత్ ఎప్పటిలాగానే తన దళితవాదాన్ని తెర మీద పరిచాడు. అయితే ఈ సారి పూర్తిగా ఏకపక్షంగా కాకుండా చరిత్రలో చోటు చేసుకున్న పలు అంశాలని స్పృశించాడు. అంటరానితనాన్ని ఆచరించే ఆనాటి బ్రాహ్మణుల ప్రస్తావనతో పాటు, అదే అంటరానితనన్ని వ్యతిరేకించి ఏ కులం వాడైనా కావాలనుకుంటే బ్రాహ్మణ మార్గంలో నడవచ్చని చెప్పిన శ్రీమద్ రామానుజాచార్యుల ప్రస్తావన కూడా తెచ్చాడు. ఆ బ్యాలెన్సింగ్ బాగుంది. అలాగే అగ్రకులాల క్రింద నలిగిన బతుకుల గురించి, తెల్లదొరల నమ్మకద్రోహానికి బలైన జీవితాల గురించి కూడా చెప్పాడు.

ఇక అసలైంది ఈ కథ అరటిపండు ఒలిచినంత తేలిగ్గా అర్ధం కాదు. మొత్తం సింబాలిజంతో నడుస్తుంది. ఇందులో హిస్టరీ, మిస్టరీ, వాస్తవం, కల్పితం, అతీంద్రియం, అధివాస్తవికత వంటి అంశాలన్నీ మేళవించి మూలవాసుల హక్కుల గురించి, బాధ్యత గురించి చెప్పినట్టు అనిపించింది.

ఆరతి అనే పాత్ర ప్రకృతికి ప్రతీక అనుకోవచ్చు. అరణ్య అనేవాడు మూలవాసుల నాయకుడు. 1500 సంవత్సరాలుగా ఆ నేలపై హక్కు, బాధ్యత ఉన్నవాడు. కానీ జన్మజన్మలుగా (తరతరాలుగా) ఆక్రమణదారుల కిందో, అగ్రకులాల కిందో, తెల్లదొరల కిందో నలుగుతూ ఆ నేల సంపదలో భాగం పొందకుండా తవ్వి సంపదని (పంటలైనా, బంగారమైనా) తీసి ఇచ్చే శ్రామిక కూలీలుగా మాత్రమే మిగిలిపోయిన వైనాన్ని ఇలా ఒక కాల్పనిక కథగా చెప్పుకొచ్చినట్టున్నాడు. తన ఉద్దేశ్యం ఇదేనా లేక వేరే ఏదైననా అనేది దర్సకుడే చెప్పాలి. అప్పటి వరకు ప్రేక్షకులు ఎలాగైనా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు.

తెర మీద అతీంద్రియశక్తులు, అధివాస్తవికత అర్ధమయ్యీ అవ్వనుట్టుగా ఉంటుంది. అదే ప్లస్సు, అదే మైనస్సు కూడా. ఎందుకంటే అర్ధమైనా, అర్ధమైనట్టు అనిపించినా వేరే ప్రపంచంలో విహరించిన అనుభూతి కలుగుతుంది. అర్ధం కాకపోతే అయోమయంగా ఉంటుంది. అదే ఈ చిత్రంలోని ప్రత్యేకత.

ఇలాంటి సినిమాలు తరచూ రావు. ఇంటెర్నెట్లో కంటే థియేటర్లో చూస్తే అనుభూతి వేరు. పోరాట సన్నివేశాల్లో కొన్ని గ్రాఫిక్స్ గగుర్పొడిచే విధంగా ఉన్నాయి.

ఈ చిత్రానికి టెక్నికల్ టీం సమర్ధవంతంగా పని చేసి స్థాయిని మరింత పెంచింది. ముఖ్యంగా జీవీ ప్రకాష్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు మాత్రం ఆకట్టుకోవు. చంద్రబోస్, భాస్కరభట్ల వంటి వారు రాసినా పాటల్లోని సాహిత్యం చాలా పేలవంగా ఉంది. బహుశా అరవ మాతృకలోని సాహిత్యాన్ని యథాతథంగా అనువదించాల్సి వచ్చిందేమో.

కెమెరా వర్క్ చాలా బాగుంది. అన్నిటికంటే మెచ్చుకోవాల్సిన విభాగం మాత్రం మేకప్. ఆ పాత్రలన్నీ నిజంగా 18 వ శతాబ్దం వాళ్లా అనే అనుమానమొస్తుంది. అంత నేచురల్ గా ఉన్నారు. సినిమా మొదలైన మొదటి పావుగంట వాళ్ల ఆహార్యం, వాచకం చూసి వీళ్లని రెండున్నర గంటలు భరించాలా అని అనిపించినా.. కథలో డ్రామా, ఎమోషన్ ఊపందుకున్న దగ్గరనుంచీ అన్నీ మరిచిపోయి పాత్రలతో ప్రయాణించే పరిస్థితి వస్తుంది.

అయితే ప్రధమార్ధం చాలా గ్రిప్పింగ్ గా సాగితే, ద్వితీయార్థం సాగతీసినట్టు అనిపిస్తుంది. కారణం కథ మొత్తం ట్రెజర్ హంట్ టైపులో అక్కడే ఉండడం, అవే తరహా బాధలు కొనసాగడం. అలాగే చివరికొచ్చేసరికి మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులు, సర్రియలిజం అన్నీ కలిసి మిస్టీరియస్ గా ముగుస్తుంది చిత్రం. రొటీన్ కమర్షియల్ సినిమాలను కాకుండా వెరైటీ చిత్రాల్ని చూడలనుకునే వారికే ఈ “తంగలాన్”. అంతే తప్ప సినిమా అంటే కలర్ఫుల్ గా ఉండాలి, హీరో హీరోయిన్లు అందంగా కనిపించాలి..అనుకునే వారు తట్టుకోలేరు.

బాటం లైన్: అరుదైన అనుభూతి

23 Replies to “Thangalaan Review: మూవీ రివ్యూ: తంగలాన్”

  1. జనాలకి కమ్యూనిజం బాగా నచ్చిద్ధి, కానీ ప్రాక్టికల్ గ తన కన్నా చదువులో గాని, డబ్బు లో కానీ, అందం, టాలెంట్, బలం ఎక్కువ ఉన్న వారితోనే రేలషన్ పెట్టుకుంటాడు.. ఒక బడుగు జాతి వాడైనా వాడికన్నా తక్కువలో ఉన్నఅగ్ర కుల వారిని దూరంగానే ఉంచుతాడు.. ఒక అగ్ర కుల వాడైనా డబ్బుంటే బడుగు వాణ్ణి విపరీత ప్రేమ చూపిస్తాడు, పేద వాడు అయినా తన చుట్టం తో కూడా పెద్దగా రేలషన్ పెట్టుకోడు.. కులనిర్ములన కావాలంటారు కుల గణన కి మద్దతు తెలుపుతారు.. కొంచెం బుర్ర పెట్టి సొంతంగా తీవ్రంగా ఆలోచించాలి, గొర్రెలాగా ఎమోషన్ తో కులాగానా కి, ఉచితాలకి, బియాండ్ థింక్ చెయ్యండి

      1. money unnavadu takkuva money vadini pattinchukodu kada brother.

        yippudu adhe kadha jaruguthundhi, vaadi paniki vastadu valla sampada penchutadi ante daggariki teestaru, ledhu ante gate kuda muttokonivvaru. meeki enka anibhavam loki raledemo!

  2. ఆహా ఏమి పరిఙానం నీది జియే భయ్యా? కథ 1850లో జరుగుతుందట.. కానీ పాత్రలన్నీ నిజంగా 18వ శతాబ్దం వారా అనేలా ఉంటాయట. 1850 అంటే అది 19వ శతాబ్దం సామీ

  3. ఈ డైరెక్టర్ కి ఉన్న రోగం ఏమిటంటే ఏ కధాంశం అయినా పట్టుకెళ్లి కుల వివక్ష తో ముడి పెట్టడం, భారీ బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని అందరికీ చేరాలి అని అనుకోడు.

  4. చియాన్ విక్రమ్ అంటే అది పేరేనా, బిరుదు ఏమైనానా? తమిళ్, మలయాళం హీరో లకి గెటప్ ల పిచ్చి, గెటప్ మారుతుంది అంటే చాలు సినిమా కి సిద్ధం అయిపోతారు, కొన్ని సినిమాలు పేలవంగా ఉంటాయి.

  5. వీడి ఈగో ని హరీష్ శంకర్ హర్ట్ చేశాడు కాబట్టి.. అతని సినిమా ఫట్ అవ్వాలి..

    అంటే ఏ రోత సినిమా ని అయినా లేపాలి..

    ప్రేక్షకులు ఏమైపోయినా పర్లేదు..

    అంతేగా జీ ఏ

  6. కేవలం అరుదైన అనుభూతి ఉంటె 2.75 ఇచ్ఛేయాలా? కథా కాకరకాయ ఏమీ లేకుండా కేవలం అవార్డుల కోసమే సినిమా తీసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్నట్టు పరోక్షంగా నువ్వే ఒప్పుకున్నావు.

    సమీక్ష చదువుతుంటేనే అర్ధం అయిపోతోంది, ఎంత తలనొప్పి సినిమానో అని…

    1. ఈ పా రంజిత్ సినిమా కబాలి ఒకటే చూసి హడలెత్తిపోయి ఇప్పటి వరకు మళ్ళీ రజనీకాంత్ సినిమాలు చూడలేదు (జైలర్ కొంచెం బాగుందని విన్నాను).

      పా రంజిత్ సినిమాల గురించి ఇప్పుడే మళ్ళీ వినడం

Comments are closed.