వైసీపీలో మార్పు ఓకే.. జ‌గ‌న్‌లో కూడా రావాలి!

జ‌గ‌న్ మారితే అన్ని స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం ల‌భిస్తుంద‌ని వైసీపీ నాయ‌కుల భావ‌న‌

ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త్వ‌ర‌గానే కోలుకున్నారు. కేవ‌లం 11 ఎమ్మెల్యే సీట్ల‌కే వైసీపీ ప‌డిపోయిన ప‌రిస్థితిలో, షాక్ నుంచి జ‌గ‌న్ కోలుకోడానికి ఎంత కాలం ప‌డుతుందో అని అంతా అనుకున్నారు. కానీ అలా ఏమీ జ‌ర‌గ‌లేదు. కూట‌మి ప్ర‌భుత్వ విధానాల పుణ్య‌మా అని జ‌గ‌న్‌ను జ‌నం బాట ప‌ట్టించాయి.

ఇదే సంద‌ర్భంలో పార్టీలో సంస్థాగ‌త మార్పులు చేప‌ట్టి, చంద్ర‌బాబు స‌ర్కార్‌పై పోరాటం చేసేందుకు జ‌గ‌న్‌ను ఉసిగొల్పాయి. ఇందులో భాగంగా వైసీపీలోని అన్ని విభాగాల‌కు అధ్య‌క్షుల్ని నియ‌మించారు. అధికారం కోల్పోయిన 70 రోజుల్లోనే ఇలాంటి మార్పులు చేస్తాన‌ని బ‌హుశా జ‌గ‌న్ కూడా ఊహించి ఉండ‌రేమో! పార్టీలో మార్పులు మంచి ప‌రిణామ‌మే.

ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్‌లో కూడా మార్పు రావాల్సిన అవ‌స‌రం వుంది. తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే లెక్క‌న జ‌గ‌న్ ఆలోచించే తీరులో మార్పు రావాలి. ఓట‌మిపై లోతుగా అధ్య‌య‌నం జ‌ర‌గాలి. పార్టీ నిర్మాణాన్ని గ్రామ‌స్థాయి నుంచి చేప‌ట్టాలి. అలాగే వైసీపీ సోష‌ల్ మీడియాను బ‌లోపేతం చేసుకోవాలి. కాస్త రాయ‌గ‌లిగే తెలివితేట‌లు, వ్య‌వ‌స్థ‌ను న‌డిపించే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు క‌లిగిన వారికి బాధ్య‌త‌లు అప్ప‌గించాలి.

నీతి, నిజాయ‌తీ, నైతిక విలువ‌లంటూ జ‌గ‌న్ కాల‌యాప‌న చేస్తే స‌రిపోదు. కాలానికి అనుగుణంగా, ప్ర‌త్య‌ర్థుల ఎత్తుగ‌డ‌ల‌ను చిత్తు చేసేలా వ్యూహాలు ర‌చించాలి. ప్ర‌త్య‌ర్థుల్ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేలా రాజ‌కీయ వ్యూహాలుండాలి. ప్ర‌స్తుతానికి ప్ర‌త్య‌ర్థులు అవినీతి ఆరోప‌ణ‌లతో వైసీపీని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌పై ఆ పాత్ర వైసీపీ పోషిస్తేనే రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం.

పార్టీలో మార్పులు చేయ‌గానే అంతా అయిపోతుంద‌ని జ‌గ‌న్ అనుకుంటే, మ‌ళ్లీ వ్య‌వ‌హారం మొద‌టికొస్తుంది. ముందుగా మారాల్సింది జ‌గ‌నే అని సొంత పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ గ‌మ‌నంలో పెట్టుకోవాలి.

జ‌గ‌న్ మారితే అన్ని స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం ల‌భిస్తుంద‌ని వైసీపీ నాయ‌కుల భావ‌న‌. చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న ఎలా వుండ‌నుందో ఇప్ప‌టికే అంద‌రికీ ఒక క్లారిటీ వ‌చ్చింది. అంద‌రినీ క‌లుపుకెళ్లేలా జ‌గ‌న్ మారితే, మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం పెద్ద విష‌యం కాద‌ని అంద‌రూ అంటున్న మాట‌. కావున త‌న‌ను తాను సంస్క‌రించుకునేలా జ‌గ‌న్ ఆలోచించాలి. ఎందుకంటే, అది త‌న కోసమే కాబ‌ట్టి.

11 Replies to “వైసీపీలో మార్పు ఓకే.. జ‌గ‌న్‌లో కూడా రావాలి!”

  1. నీతి, నిజాయితీ, నైతిక విలువలు – ఇవేవి మన డిక్షనరీ లో లేవుగా. ఇంక పట్టించుకునేది ఏముంది

  2. ఈ బోకు గాడికి అధికారం కావాలనుకుంటే .. అందరికి కలుపుకుపోతాడు ..

    అధికారం దక్కగానే అందరినీ వదిలించుకొంటాడు ..

    సింగల్ సింహం అంటూ ఎచ్చులు పోతాడు ..

    పనికిమాలిన నా బట్ట ..

  3. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి ..

    జగన్ రెడ్డి కి పండగే పండగ ..

    కొత్త బాయ్ ఫ్రెండ్.. టాయ్ ఫ్రెండ్ దొరికేసాడు ..

    ఇక యెలహంక పాలస్ గేట్ పాస్ దిరికేసినట్టే ..

  4. కొంచెం GA ఉచిత సలహాలు ఎక్కువ అవుతున్నాయి.

    మీ అతి తగ్గించండి. ఎవరి మీదో ఉన్న దొబ్బుతెగులు జగన్ మీద చూపించకండి

  5. Vaadu chinnappatinundi Gali vedave, vaditho parichayam unnollu chala mandi chepparu. Vadu maredi ledu chachedi ledu. Ippatiki kudaa US lo vadevado brothal case lo pattubadithe tdp ni blame chestunnadu. Inka rathi Devi putrikalanu mugguloki lagatame migilindi.

Comments are closed.