హీరో నాగార్జున‌కు రేవంత్ స‌ర్కార్ షాక్‌!

టాలీవుడ్ అగ్ర‌హీరో నాగార్జున‌కు రేవంత్‌రెడ్డి స‌ర్కార్ గ‌ట్టి షాక్ ఇచ్చింది. కేసీఆర్ స‌ర్కార్ దాదాపు ప‌దేళ్లు పాల‌న‌లో ఉన్న‌ప్ప‌టికీ నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను కూల్చ‌లేక‌పోయింది. కానీ రేవంత్ స‌ర్కార్ మాత్రం ఏడు…

టాలీవుడ్ అగ్ర‌హీరో నాగార్జున‌కు రేవంత్‌రెడ్డి స‌ర్కార్ గ‌ట్టి షాక్ ఇచ్చింది. కేసీఆర్ స‌ర్కార్ దాదాపు ప‌దేళ్లు పాల‌న‌లో ఉన్న‌ప్ప‌టికీ నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను కూల్చ‌లేక‌పోయింది. కానీ రేవంత్ స‌ర్కార్ మాత్రం ఏడు నెల‌ల్లోనే ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను కూల్చేయ‌డం విశేషం.

హైద‌రాబాద్‌లో చెరువుల్ని ప‌రిర‌క్షించే క్ర‌మంలో వాటిలో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను హైడ్రా కూల్చేస్తోంది. ఎంతో ప‌లుకుబ‌డి క‌లిగిన వాళ్ల నిర్మాణాల్ని సైతం విడిచి పెట్ట‌డం లేదు. ఈ క్ర‌మంలో మాదాపూర్‌లోని త‌మ్మిడికుంట చెరువులో దాదాపు మూడున్న‌ర ఎక‌రాల్ని ఆక్ర‌మించి నాగార్జున నిర్మించిన ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌పై హైడ్రాకు భారీగా ఫిర్యాదులు వెళ్లాయి.

ఈ నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను భారీ పోలీస్ బందోబ‌స్తు మ‌ధ్య బుల్జోడ‌జ‌ర్ల‌తో కూల్చివేత ప్రారంభించారు. నాగార్జున సినీ సెల‌బ్రిటీ కావ‌డం, ప‌లుకుబ‌డిన క‌లిగిన వ్య‌క్తిగా గుర్తింపు పొందిన నేప‌థ్యంలో కూల్చివేత తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నాగార్జున లాంటి సెల‌బ్రిటీ క‌న్వెన్ష‌న్‌ను కూల్చి వేయ‌డంతో ఇత‌రుల‌కు ఒక హెచ్చ‌రిక పంపిన‌ట్టైంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

చెరువుల్లో అక్ర‌మ నిర్మాణాలు ఎవ‌రు చేప‌ట్టినా విడిచి పెట్టేదే లేద‌ని హైడ్రా అధికారులు తేల్చి చెబుతున్నారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్‌ను చూపుతున్నారు. త‌న క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను కాపాడుకునేందుకు నాగార్జున ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

36 Replies to “హీరో నాగార్జున‌కు రేవంత్ స‌ర్కార్ షాక్‌!”

    1. Why were the encroachments made by congress leaders not demolished in this drive? KTR gave a list of congress leaders that encroached the water body and why weren’t notices issued to Congress leaders?

  1. మరి ఇదే దారి లో తెరాస, కాంగ్రెస్, టీడీపీ వారికి చెందిన కట్టడాల ను చేస్తారా? లేక ఆఫర్ కేవలం వైసీపీ కి దగ్గర గా ఉన్న వాళ్ళకేనా?

      1. వైసీపీ పాలన లో టీడీపీ వాళ్ళ మీద చర్య తీసుకున్నపుడు కూడా అడిగాను.

        1. వాళ్ళు వచ్చి వీళ్ళవి కూలిస్తే వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళవి కూలుస్తారు. లెక్క సరిపోతుంది. కానీ కషాయం పార్టీ వస్తే అందరినీ నిర్మా తో ధర్మాత్ములను చేసేస్తోంది

  2. మళ్ళీ చెరువు as it is గా ఉంటుందా? అసలు అప్రూవ్ చేసిన అధికారుల్ని ఏం చేశారు? వాళ్ళు కదా తప్పు చేసింది ఫస్ట్?

  3. నాగార్జున రాజకీయ నాయకులు కాదు అందులోనూ జగన్ కి అనుకూలం కాబట్టే కూల్చారు. ఇలాగే మిగతా నాయకుల ఫాం హౌస్ లను అక్రమం అని చెప్పే వాటిని కూల్చే దమ్ముందా..? కోర్టు తుది తీర్పు ఇవ్వలేదు అయినా కూల్చారు. మొదటగా నాగార్జునదే ఎందుకు కూల్చాలి..? ఇదైతే పూర్తిగా ఏవో పాత కక్షలు మనసులో పెట్టుకొనే చేసారు.

  4. Government must release information of all people that encroached the water body. Looks like lot of congress leaders are also part of this encroachment but they were conveniently ignored. Bad days for Revanth!!

Comments are closed.