ఓజీ.. అనుమానాలన్నీ ఆల్ క్లియర్

పవన్ కల్యాణ్ సినిమా అంటేనే రోజుకో గాసిప్ పుట్టుకొస్తుంది. అలాంటిది ఆయనవి 3 సినిమాలున్నాయి. నిత్యం ఏదో ఒక పుకారు కనిపిస్తూనే ఉంటుంది. ఆ 3 సినిమాల్లో ఎక్కువగా చర్చల్లో నలుగుతున్న సినిమా ఓజీ.…

పవన్ కల్యాణ్ సినిమా అంటేనే రోజుకో గాసిప్ పుట్టుకొస్తుంది. అలాంటిది ఆయనవి 3 సినిమాలున్నాయి. నిత్యం ఏదో ఒక పుకారు కనిపిస్తూనే ఉంటుంది. ఆ 3 సినిమాల్లో ఎక్కువగా చర్చల్లో నలుగుతున్న సినిమా ఓజీ.

ఈ సినిమాపై కూడా చాలా ఊహాగానాలు, ప్రచారాలు, చర్చలు సాగుతున్నాయి. వీటిపై స్వయంగా డీవీవీ దానయ్య క్లారిటీ ఇచ్చారు.

పవన్ కోసం ఓజీ సినిమా షూటింగ్ ను విజయవాడలో ప్లాన్ చేస్తున్నారని, అక్కడే సెట్స్ వేస్తున్నారనే ప్రచారం నిజమేనంటున్నారు దానయ్య. పవన్ ఎప్పుడు కాల్షీట్లు ఇచ్చినా ఆయనకు దగ్గర్లోనే షూటింగ్ లొకేషన్ ఉంటుందని స్పష్టం చేశారు.

ఓజీ సినిమాకు సంబంధించి ఇంకా 20 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని ప్రకటించిన డీవీవీ.. ప్రస్తుతం పవన్ చేస్తున్న 3 సినిమాలకు దశలవారీగా కాల్షీట్లు ఇస్తారని, వరుస క్రమంలో తమ సినిమాకు కూడా కాల్షీట్లు వస్తాయని స్పష్టం చేశారు.

ఓజీ సినిమా కోసం త్రివిక్రమ్, సుజీత్ ను తెరపైకి తీసుకొచ్చాడనే ప్రచారంలో కొంత మాత్రమే నిజముందని అంటున్నారు దానయ్య. పవన్ తో సినిమా చేయాలని ముందుగా వీళ్లిద్దరూ మాట్లాడుకొని, ఆ తర్వాత దర్శకుడ్ని ఫిక్స్ చేశారట.

“పవన్ తో సినిమా చేస్తే ఓ కొత్త సినిమా, స్టయిలిష్ సినిమా చేయాలనే ఉద్దేశంతో సుజీత్ ను కాంటాక్ట్ చేశాం. త్రివిక్రమ్, నేను దర్శకుడి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇద్దరం మాట్లాడుకొని సుజీత్ ను తీసుకున్నాం.”

త్రివిక్రమ్ కు దాదాపు 8 ఏళ్ల కిందటే అడ్వాన్స్ ఇచ్చారు దానయ్య. ఆ అడ్వాన్స్ కు మాఫీగా ఓజీ సినిమాను దానయ్యకు త్రివిక్రమ్ సెట్ చేశారనే ప్రచారం ఉంది. దీన్ని దానయ్య ఖండిస్తున్నారు.

త్రివిక్రమ్ కు ఇచ్చిన అడ్వాన్స్ అలానే ఉందంట. ఎప్పటికైనా త్రివిక్రమ్ తో సినిమా చేస్తానంటున్నారు. అదే టైమ్ లో మరో బ్యానర్ తో జాయింట్ అవ్వనని, సోలోగానే సినిమా చేస్తానని ప్రకటించడం విశేషం.

2 Replies to “ఓజీ.. అనుమానాలన్నీ ఆల్ క్లియర్”

Comments are closed.