ఎన్టీఆర్ కు ఎందుకంత టెన్షన్

దేవర సినిమా ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీలో కేవలం ఒక సినిమా కాదు. అతడి మార్కెట్ స్టామినాకు ఓ కొలమానంగా మారబోతోంది.

పైకి నవ్వుతూ, కూల్ గా కనిపిస్తున్నాడు. కానీ మనసులో మాత్రం భూమి బద్దలయ్యేంత టెన్షన్ పడుతున్నాడు ఎన్టీఆర్. ఇంతకీ అతడికి ఎందుకంత టెన్షన్? దేవర సినిమా సక్సెస్ పై అతడు ఒత్తిడికి గురవుతున్నాడా? లేక హిందీ బెల్ట్ లో సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో అని టెన్షన్ పడుతున్నాడా?

ఇవేవీ తారక్ టెన్షన్ కు కారణాలు కావు. దాదాపు ఆరేళ్ల తర్వాత తన నుంచి వస్తున్న సోలో రిలీజ్ ఇది. అందుకే ఇంత టెన్షన్.

ఎన్టీఆర్ చివరి సోలో రిలీజ్ అరవింద సమేత వీరరాఘవ. అప్పుడెప్పుడో 2018లో వచ్చింది ఈ సినిమా. ఆ సినిమా తర్వాత తారక్ నుంచి వస్తున్న సోలో రిలీజ్ దేవర-1 మాత్రమే.

మధ్యలో ఆర్ఆర్ఆర్ వచ్చింది. అయితే ఆ సక్సెస్ ను అతనొక్కడే తన క్రెడిట్ లో వేసుకోలేదు. అందులో రామ్ చరణ్ కూడా నటించాడు. పైగా రాజమౌళి సినిమా అది. కాబట్టి ఎన్టీఆర్ కు సక్సెస్ లో షేర్ మాత్రమే దక్కింది తప్ప, సోలో సక్సెస్ కింద లెక్కేసుకోడానికి లేదు. ఈ విషయాన్ని తాజాగా తారక్ కూడా చెప్పుకొచ్చాడు.

సో.. సరిగ్గా ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలో సినిమా వస్తోంది. ఈ ఆరేళ్లలో టాలీవుడ్ సినిమా ఎంతో మారింది. ఎన్నో రికార్డులు పుట్టుకొచ్చాయి. అందుకే ఎన్టీఆర్ లో చిన్న టెన్షన్.

ఎన్టీఆర్ మార్కెట్ ను రివైజ్ చేసే సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ కు ముందు ఎన్టీఆర్ మార్కెట్ వేరు, అతడి క్రేజ్ వేరు. ఆర్ఆర్ఆర్ తర్వాత మార్కెట్ వేరు, అతడి క్రేజ్ వేరు. ఇప్పుడు సోలో హీరోగా తనకంటూ ఓ పెద్ద మార్కెట్ సృష్టించుకోవాల్సిన స్టేజ్ లో ఉన్నాడు. మరీ ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఈసారి సోలోగా నిలబడాలి. ఎన్టీఆర్ టెన్షన్ పడ్డానికి ఇది కూడా ఓ కారణం.

దేవర సినిమా ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీలో కేవలం ఒక సినిమా కాదు. అతడి మార్కెట్ స్టామినాకు ఓ కొలమానంగా మారబోతోంది.

11 Replies to “ఎన్టీఆర్ కు ఎందుకంత టెన్షన్”

  1. Pan India marketki Set aye Hero kadhu thanu ani NTR ki kuda telusu, Devara lanti outdated Subjects,Dirs films asalu workout avavu ani telusu,aa Buzz Ledu ani Telusu anduke aayana Tension anthaaaa…EveryBody Knows.

  2. త్వరలో రాజకీయాలకి వస్తాడు. ఈయన సినిమా ఊపు అయిపొయింది. RRR కేవలం రాజమౌళి హిట్. ఇంకా ఎదో కొత్తగా చూపించటానికి ఏమి లేదు.

Comments are closed.