నటి హేమ బెయిల్ రద్దవుతుందా?

తను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదంటూ హేమ వాదించారు. దానికి సంబంధించి కొన్ని రిపోర్టుల్ని కూడా ఆమె చూపెట్టారు. వాటి ఆధారంగా హేమపై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎత్తేసింది. మరి బెంగళూరు…

తను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదంటూ హేమ వాదించారు. దానికి సంబంధించి కొన్ని రిపోర్టుల్ని కూడా ఆమె చూపెట్టారు. వాటి ఆధారంగా హేమపై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎత్తేసింది. మరి బెంగళూరు రేవ్ పార్టీ సంగతేంటి?

ఇప్పుడీ కేసు కొత్త మలుపు తిరిగింది. రేవ్ పార్టీ కేసుకు సంబంధించి బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 1086 పేజీలతో పూర్తిస్థాయిలో జరిగిన విషయాలు, సాక్ష్యాలు అన్నింటినీ పొందుపర్చి ఛార్జ్ షీట్ తయారుచేశారు.

ఈ ఛార్జ్ షీట్ లో నటి హేమ అలియాస్ కృష్ణవేణి డ్రగ్స్ తీసుకున్నట్టు స్పష్టంగా పేర్కొన్నారు పోలీసులు. రేవ్ పార్టీపై రైడ్ చేసిన వెంటనే హేమను అదుపులోకి తీసుకున్నామని, ఆమె నుంచి శాంపిల్స్ సేకరించిన తర్వాత పరీక్షలు నిర్వహించామని, అందులో ఆమెకు పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ఆమె ఎమ్డీఎమ్ఏ అనే మాదకద్రవ్యాన్ని సేవించినట్టు కూడా తెలిపారు. దానికి సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ ఛార్జ్ షీట్ లో పెట్టారు.

ప్రస్తుతం ఈ ఛార్జ్ షీట్ కోర్టు పరిధిలో ఉంది. ఈ కేసుకు సంబంధించి హేమ ప్రారంభంలో బుకాయించే ప్రయత్నం చేశారు. తను అసలు బెంగళూరులోనే లేనని, హైదరాబాద్ లోనే ఉన్నానని వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చెబుతూ మరో వీడియో రిలీజ్ చేశారు. అదే క్రమంలో బెంగళూరు పోలీసులిచ్చిన నోటీసులకు కూడా ఆమె స్పందించలేదు.

దీంతో హైదరాబాద్ వచ్చి హేమను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. ఈ కేసులో ఆమె కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా పెట్టిన ఛార్జ్ షీట్ ను కోర్టు ఆమోదించి, తదుపరి చర్యలకు ఆదేశిస్తే, హేమ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది.

ఇక ఛార్జ్ షీట్ విషయానికొస్తే… మొత్తం 88 మందిని ఇందులో నిందితులుగా పేర్కొన్నారు. వీళ్లలో 9 మందిపై మాదకద్రవ్యాల సరఫరా కేసు పెట్టారు. పార్టీని ఆర్గనైజ్ చేయడంతో పాటు, డ్రగ్స్ సరఫరా చేశారని పేర్కొన్నారు. మిగతా 79 మందిని మాదకద్రవ్యాలు సేవించిన వాళ్లుగా పేర్కొన్నారు. ఈ 79 మందిలో హేమ పేరు ఉంది.

మాదకద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం.. డ్రగ్స్ సేవించిన వాళ్లు కూడా శిక్షార్హులే. వీళ్లకు 6 నెలల జైలుశిక్ష లేదా 10వేల రూపాయల జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండూ అమలుచేయొచ్చు.

10 Replies to “నటి హేమ బెయిల్ రద్దవుతుందా?”

  1. 6 నెలలు + 10,000 రూపాయల జరిమానా రెండు అమలు చేయాలి , ఇంకా అవసరమైతే సుప్పిని సుద్దపూస గాడు మంచు విష్ణు గాడికి కూడా అమలు చేయాలి

  2. ఈ drugs casex మొదలయిన నాటి నుండి మంచు విష్ణు తెగ హైరానా పడిపోతున్నాడు. Suspended అంటాడు…తూచ్ అంటాడు. ఏమిటో కథ?

Comments are closed.