బాబు స‌ర్కార్ మంచి ప్ర‌య‌త్నం

హైడ్రా త‌ర‌హాలో ఏపీలోనూ ఒక వ్య‌వ‌స్థ‌ను తీసుకురావాల‌ని ఏపీ ప్ర‌భుత్వం ఆలోచించ‌డంపై అభినంద‌న‌లు వ‌స్తున్నాయి. చెరువులు, కాలువ‌లు ఆక్ర‌మించి ఇళ్లు, వ్యాపార స‌ముదాయాలు ఇష్టానుసారం నిర్మించారు. అయితే వ్య‌వ‌స్థ‌లో అవినీతి కూరుకుపోవ‌డంతో అధికారులు ఇష్టానుసారం…

హైడ్రా త‌ర‌హాలో ఏపీలోనూ ఒక వ్య‌వ‌స్థ‌ను తీసుకురావాల‌ని ఏపీ ప్ర‌భుత్వం ఆలోచించ‌డంపై అభినంద‌న‌లు వ‌స్తున్నాయి. చెరువులు, కాలువ‌లు ఆక్ర‌మించి ఇళ్లు, వ్యాపార స‌ముదాయాలు ఇష్టానుసారం నిర్మించారు. అయితే వ్య‌వ‌స్థ‌లో అవినీతి కూరుకుపోవ‌డంతో అధికారులు ఇష్టానుసారం అనుమ‌తులు ఇచ్చారు. వ‌ర‌ద‌లు వ‌స్తే, అవ‌న్నీ మున‌కకు గురి కావ‌డం, ఒక్కోసారి పెద్ద సంఖ్య‌లో ప్రాణ న‌ష్టం సంభ‌విస్తోంది.

ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి స‌ర్కార్ చెరువులు, కాలువ‌ల‌ను ప‌రిర‌క్షించడానికి హైడ్రాను తీసుకొచ్చింది. అక్ర‌మ‌ణ‌ల భ‌ర‌తం ప‌డుతోంది హైడ్రా. ఈ నేప‌థ్యంలో ఏపీలో కూడా వ‌ర‌ద‌లు ముంచెత్త‌డంతో పాల‌కులు ఎందుకు హైడ్రా లాంటి వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చి, ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌కూడ‌ద‌నే ప్ర‌శ్న పౌర స‌మాజం నుంచి వ‌స్తోంది. ప్ర‌జ‌ల మ‌న‌సెరిగిన బాబు స‌ర్కార్ ఆ ప‌ని చేయ‌డానికి ఆలోచిస్తుండ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

ఏపీలో కూడా హైడ్రా లాంటి వ్య‌వ‌స్థ‌ను తీసుకొస్తామ‌ని మంత్రి నారాయ‌ణ చెప్పారు. రాష్ట్రంలో కాలువ‌లు, చెరువులు ఆక్ర‌మించి చేప‌ట్టిన నిర్మాణాల‌ను తొల‌గించ‌డానికి చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. అయితే ముందుగా ప్ర‌భుత్వ పెద్ద‌లు చెరువులు, న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో చేప‌ట్టిన నిర్మాణాలు చేప‌డితే ప్ర‌జ‌ల్లో విశ్వాసం, న‌మ్మ‌కం పెరుగుతాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ముందుగా విజ‌య‌వాడ నుంచి ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు ప్రారంభం కావాలి.

విజయవాడ నగరంలోని 32 డివిజన్లు ముంపునకు గురయ్యాయని, సుమారు 7 లక్షల మంది ప్రజలు ప్రభావితులయ్యారని మంత్రి నారాయ‌ణ‌ తెలిపారు. ఇంత పెద్ద సంఖ్య‌లో వ‌ర‌ద‌ల‌కు గురి అయ్యారంటే, నిర్మాణాలు ఏ రీతిలో ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే జాగ్ర‌త్త‌గా ప్ర‌భుత్వం అడుగులు వేయాల్సి వుంది. ఎందుకంటే ఆలోచ‌న ఒక్క‌టే స‌రైంది అయితే చాల‌దు. ఆచ‌ర‌ణ కూడా బాగుండాలి. అప్పుడే ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుంది.

16 Replies to “బాబు స‌ర్కార్ మంచి ప్ర‌య‌త్నం”

  1. ఇలాఅన్నా జనాలలొ వ్యతిరెకత వస్తుంది అని మనొడి ప్లాన్! తీరా Hydra లంటిది తెసె.. వీడె ముందు జనాన్ని రెచగొడుతూ రాస్తాడు.

  2. కృష్ణా తీరంలో నిర్మాణాలు ఆపాల్సి వస్తుంది మరి..ఇందుకు సిద్ధమా దేశభక్తులారా?

  3. Lot of influential people that are vote bank for TDP have enchroached Budameru and built their properties. Can TDP dare touch these people and destroy their vote bank? Thus is nothing but a publicity stunt to divert the negligence that happened during floods.

  4. Another drama. Lot of enchroachments on Budameru were done by TDP vote bank and touching them will doom party prospects in Vijayawada and surrounding constituencies.

  5. అంటే lingamaneni estate కు కూడా narayana స్పాట్ పెట్టడానేగా అర్ధం.. If action is on all encroachments in buffer, ftl zone then most welcoming program

Comments are closed.