జాని మాస్టర్‌పై లైంగిక వేదింపుల కేసు!

జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు న‌మోదు అయ్యింది. గత కొంతకాలంగా జాని మాస్ట‌ర్ తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు ఓ మహిళా కొరియోగ్రాఫర్ రాయ‌దుర్గం…

జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు న‌మోదు అయ్యింది. గత కొంతకాలంగా జాని మాస్ట‌ర్ తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు ఓ మహిళా కొరియోగ్రాఫర్ రాయ‌దుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ చేస్తున్నప్పుడు మరియు నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. జాని మాస్ట‌ర్‌పై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) మరియు స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గ‌త ఎన్నిక‌ల ముందు జ‌న‌సేనలో చేరి ఆ పార్టీ త‌ర‌పున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. మైక్ దొరికితే చాలు సినిమా పంక్ష‌న్ అయినా.. ఏదైనా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌జ‌నా చేస్తు ఉండే జాని మాస్ట‌ర్ ఇటీవ‌ల కాలంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ సీఎం అవుతార‌ని.. ఆ త‌ర్వాత ప్ర‌ధాని కూడా అవుతార‌ని జోస్యం చెప్పారు. అమ్మాయిల‌పై జ‌రిగే దారుణాల‌పై మాట్లాడే ప‌వ‌న్ క‌ళ్యాణ్ జాని మాస్ట‌ర్ కేసుపై కూడా మాట్లాడి బాధితురాలికి న్యాయం చేయ‌లాని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

కాగా జాని మాస్టర్‌కు గతంలో సైతం నేర చరిత్ర కలిగి ఉంది.. 2015లో ఓ కాలేజిలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్‌లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల కాలంలోనే కొరియోగ్రాఫ‌ర్ సంఘం స‌భ్యులు కూడా జానీ మాస్ట‌ర్‌పై పెద్ద ఎత్తున్న ఆరోప‌ణ‌లు చేయ‌గా వాటిని ఆయ‌న ఖండించారు.

28 Replies to “జాని మాస్టర్‌పై లైంగిక వేదింపుల కేసు!”

  1. ఇక్కడ పవన్ తో వున్న ఫోటో వేశావు. మరి మన పత్తిత్తుల విషయాలలో జగన్ తో వున్న ఫోటోలు ఎందుకు వెయ్యవు?

    1. ఇది మన పచ్చ మీడియా పునాది వేసిన పనికి మాలిన సాంప్రదాయమే.

    1. nuvvu cheppina valla meeda ye ammaei complain cheyyaledu except vidya sagar . it is moral vs legal . recorded the audio and video , TDP bought the content at high price . if we talk morality yes it is wrong .

  2. Compared to Jethwani’s case this seems more severe and will have to see how stringent action will government take on this case and will Jani be arrested a d suspended from party?

  3. ఇపుడే ఈ విషయం మాట్లడున్నారంటే ఇదేదో జెట్వాని కే సు డైవర్ట్ చెయ్యడానికి అయ్యుంటుంది. Y cp డైవర్షన్ పాలిటిక్స్ లో expert కదా.

  4. Court directed law and order not to paint the accused as a victim and not to return evidences gathered to the accused and instead submit them to court which is a blow to state government in a petition filed by Vidya Sagar.

  5. ఏపీ సీఎంవో కేంద్రంగా జెత్వానీపై కుట్ర! డీజీపీ సంచలన రిపోర్ట్-ఐపీఎస్ ల అరెస్ట్?

    ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగనన్ కు సన్నిహితుడైన ఓ ముంబై పారిశ్రామికవేత్తను కాపాడే క్రమంలో నటి కాదంబరీ జెత్వానీని అరెస్టు చేసి ఆమెను కుటుంబంతో సహా వేధించిన కేసులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి.

    జెత్వానీనీ వేధించిన వ్యవహారంలో తాజాగా అరెస్టు అయిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు అప్పట్లో ఏం చేశారో డీజీపీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక బయటపెట్టింది. ఈ నివేదికలో అప్పటి సీఎంవో కేంద్రంగా సాగిన కుట్ర బట్టబయలైంది.

    ఈ ఏడాది జనవరి 31న ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతారామాంజనేయులు విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీని సీఎంవోకు పిలిపించడంతో ఈ కుట్ర మొదలైంది. ముంబై నటి కాదంబరి జెత్వానీని ఎట్టి పరిస్ధితుల్లోనూ అరెస్టు చేయాలంటూ కాంతి రాణా టాటాకు పీఎస్సార్ ఇచ్చిన మౌఖిక ఆదేశం ఇందులో కీలకమైనది. ఆ తర్వాత ఫిబ్రవరి 2న ఆమెపై కేసు నమోదు చేశారు. అంటే కేసు నమోదు కూడా కాకుండానే జెత్వానీ అరెస్టుకు ఆదేశాలు వెళ్లాయి. పీఎస్సార్ చెప్పిన నోటిమాట ఆధారంగానే కాంతిరాణా టాటా జెత్వానీ అరెస్టుకు ముందే ముంబైకి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేయించేశారు. జనవరి 31న జెత్వానీని అరెస్టు చేయాలని కాంతిరాణా టాటా డీసీపీ విశాల్ గున్నీని ఆదేశిస్తే ఆయన ఫిబ్రవరి 1నే అంటే అరెస్టుకు ముందే పోలీసులు ముంబైకి వెళ్లేందుకు టికెట్లు కూడా తీశారు. మొత్తం మీద పీఎస్సార్ నోటిమాటతోనే ముంబైలో ఉన్న జెత్వానీని అరెస్టు చేసేందుకు విజయవాడ కమిషనరేట్ పోలీసుల టీమ్ ముంబైకి వెళ్లడం, ఆమెను అక్రమ కేసులో అరెస్టు చేయడం, విజయవాడ తీసుకొచ్చి వేధించడం, కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపడం జరిగిపోయాయి.

    దీనిపై డీజీపీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పీఎస్సార్ తో పాటు ఈ వ్యవహారాన్ని నడిపించిన కాంతి రాణా టాటా, విశాల్ గున్నీని ప్రభుత్వం నిన్న సస్పెండ్ చేసింది. ఇప్పుడు వీరిని అరెస్టు కూడా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జెత్వానీ నేరుగా చేసిన ఫిర్యాదు ఆధారంగా పలువురు పోలీసు అధికారులపై వేటు పడుతోంది. త్వరలో మరింత మందిని సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అదే జరిగితే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాబోతోంది.

  6. ఏపీ సీఎంవో కేంద్రంగా జెత్వానీపై కుట్ర! డీజీపీ సంచలన రిపోర్ట్-ఐపీఎస్ ల అరెస్ట్?

    ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగనన్ కు సన్నిహితుడైన ఓ ముంబై పారిశ్రామికవేత్తను కాపాడే క్రమంలో నటి కాదంబరీ జెత్వానీని అరెస్టు చేసి ఆమెను కుటుంబంతో సహా వేధించిన కే.-.సులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి.

    జెత్వానీనీ వేధించిన వ్యవహారంలో తాజాగా అరెస్టు అయిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు అప్పట్లో ఏం చేశారో డీజీపీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక బయటపెట్టింది. ఈ నివేదికలో అప్పటి సీఎంవో కేంద్రంగా సాగిన కుట్ర బట్టబయలైంది.

    ఈ ఏడాది జనవరి 31న ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతారామాంజనేయులు విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీని సీఎంవోకు పిలిపించడంతో ఈ కుట్ర మొదలైంది. ముంబై నటి కాదంబరి జెత్వానీని ఎట్టి పరిస్ధితుల్లోనూ అరెస్టు చేయాలంటూ కాంతి రాణా టాటాకు పీఎస్సార్ ఇచ్చిన మౌఖిక ఆదేశం ఇందులో కీలకమైనది. ఆ తర్వాత ఫిబ్రవరి 2న ఆమెపై కే.-.సు నమోదు చేశారు. అంటే కే.-.సు నమోదు కూడా కాకుండానే జెత్వానీ అరెస్టుకు ఆదేశాలు వెళ్లాయి. పీఎస్సార్ చెప్పిన నోటిమాట ఆధారంగానే కాంతిరాణా టాటా జెత్వానీ అరెస్టుకు ముందే ముంబైకి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేయించేశారు. జనవరి 31న జెత్వానీని అరెస్టు చేయాలని కాంతిరాణా టాటా డీసీపీ విశాల్ గున్నీని ఆదేశిస్తే ఆయన ఫిబ్రవరి 1నే అంటే అరెస్టుకు ముందే పోలీసులు ముంబైకి వెళ్లేందుకు టికెట్లు కూడా తీశారు. మొత్తం మీద పీఎస్సార్ నోటిమాటతోనే ముంబైలో ఉన్న జెత్వానీని అరెస్టు చేసేందుకు విజయవాడ కమిషనరేట్ పోలీసుల టీమ్ ముంబైకి వెళ్లడం, ఆమెను అక్రమ కేసులో అరెస్టు చేయడం, విజయవాడ తీసుకొచ్చి వేధించడం, కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపడం జరిగిపోయాయి.

    దీనిపై డీజీపీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పీఎస్సార్ తో పాటు ఈ వ్యవహారాన్ని నడిపించిన కాంతి రాణా టాటా, విశాల్ గున్నీని ప్రభుత్వం నిన్న సస్పెండ్ చేసింది. ఇప్పుడు వీరిని అరెస్టు కూడా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జెత్వానీ నేరుగా చేసిన ఫిర్యాదు ఆధారంగా పలువురు పోలీసు అధికారులపై వేటు పడుతోంది. త్వరలో మరింత మందిని సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అదే జరిగితే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాబోతోంది.

Comments are closed.