రాజకీయాల్లో కూడా పవన్ రికార్డులు

పవన్ కల్యాణ్ రికార్డులు గురించి చెప్పమంటే, అతడి అభిమానులు బోలెడన్ని చెబుతారు. దశాబ్దాల కిందట వచ్చిన తొలిప్రేమ నుంచి అత్తారింటికి దారేది వరకు రికార్డుల చిట్టా విప్పుతారు. అయితే ఇకపై పవన్ సినిమా రికార్డులు…

పవన్ కల్యాణ్ రికార్డులు గురించి చెప్పమంటే, అతడి అభిమానులు బోలెడన్ని చెబుతారు. దశాబ్దాల కిందట వచ్చిన తొలిప్రేమ నుంచి అత్తారింటికి దారేది వరకు రికార్డుల చిట్టా విప్పుతారు. అయితే ఇకపై పవన్ సినిమా రికార్డులు మాత్రమే కాదు, ఆయన పొలిటికల్ రికార్డులు కూడా చెప్పుకునే పరిస్థితి వస్తుందేమో..

అవును.. రాజకీయాల్లో కూడా రికార్డులు సృష్టిస్తున్నారు పవన్ కల్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్, అదే టైమ్ లో పలుశాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. అందులో ఒకటి పంచాయతీరాజ్ శాఖ కూడా.

ఈ శాఖ ఆధ్వర్యంలో గత నెల 23న గ్రామ సభలు నిర్వహించారు. ఒకే రోజు ఏకంగా 13.326 చోట్ల ఈ సభలు నిర్వహించారు. దీంతో ఇదో రికార్డ్ గా మారింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్, ఈ ఘనతను ధృవీకరించింది.

ఈ మేరకు రికార్డ్ ధృవపత్రాన్ని మంత్రి పవన్ కల్యాణ్ కు అందజేసింది. మంత్రి పదవి చేపట్టిన కొద్దిరోజుల్లోనే పవన్ ఈ ఘనత సాధించడం విశేషం. ఇలా రాజకీయాల్లో కూడా తన రికార్డుల వేటను పవన్ కల్యాణ్ మొదలుపెట్టారని, ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. మరికొంతమంది అభిమానులు.. ఇదే రికార్డుల వేటను సినిమాల్లో కూడా కొనసాగించాలని కోరుతున్నారు.

11 Replies to “రాజకీయాల్లో కూడా పవన్ రికార్డులు”

  1. ఇలా అధికారులు చెప్పిన మాటలు నమ్మి నిజంగానే ఈ సభలు జరిగాయి వూళ్ళలో పనులు జరుగుతున్నాయి అనుకుంటే ఐదేళ్ల తరవాత జగన్ కు పట్టినగతే పడుతుంది … గ్రౌండ్ లో తిరిగి నిజాలు తెలుసుకుంటే అందరికీ మంచిది

Comments are closed.