స్టీల్ ప్లాంట్ బతికి బట్ట కడుతుందా?

విశాఖ స్టీల్ ప్లాంట్ బతికి బట్ట కడుతుందా అన్న చర్చకు తెర లేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అయితే ప్రైవేటీకరణకు పట్టుదలగానే ఉంది. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నేస్ 3ని మూసివేశారు.…

విశాఖ స్టీల్ ప్లాంట్ బతికి బట్ట కడుతుందా అన్న చర్చకు తెర లేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అయితే ప్రైవేటీకరణకు పట్టుదలగానే ఉంది. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నేస్ 3ని మూసివేశారు. దీని కంటే ముందు ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నేస్ ఒకటిని కూడా మూసివేశారు. దాంతో ఇక మిణుకు మిణుకుమంటూ మిగిలినది చివరి బ్లాస్ట్ ఫర్నేస్-2 అని అంటున్నారు. దీనిని కూడా తొందరలోనే మూసివేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు అని అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపించిన తర్వాత రెండు బ్లాస్ట్ ఫర్నేస్ లు ఇలా మూసి వేయడం ఇదే తొలిసారి అని అంటున్నారు. బ్లాక్ ఫర్నేస్ ల మూసి వేత అంటే ప్లాంట్ మూసివేతకు అది అసలైన కార్యక్రమం అని అంటున్నారు. మూడవ బ్లాక్ ఫర్నేస్ మూసివేతతో కార్మిక లోకానికి ఉద్యోగ వర్గానికి పూర్తిగా అర్ధం అయిపోయింది. అసలు ఏమి జరుగుతోంది అన్నది వారికి తెలిసి వచ్చింది.

అందుకే వారంతా ఆందోళన బాట పట్టారు. విషయం ఇంత సీరియస్ గా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తోంది అన్నది కూడా కార్మిక సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ని వెంటనే సెయిల్ లో విలీనం చేయాలని డిమాండ్ ఊపందుకుంటోంది. స్టీల్ ప్లాంట్ ఊపిరి కొడిగడుతున్న ఈ దశలో ఇక ప్రకటనలతో పని లేదని యాక్షన్ లోకి దిగాల్సిందే అని కార్మిక సంఘం నాయకులు కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నారు.

ఎన్నికల ముందు టీడీపీ కూటమి నేతలు కేంద్రం మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటామని చెప్పారని ఇపుడు ఆ మాట నిలబెట్టుకునే సమయం ఆసన్నం అయింది అని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికి వంద రోజులు అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోక పోవడం అంటే అది చిత్తశుద్ధి లోపంగానే చూడాలని అంటున్నారు

స్టీల్ ప్లాంట్ లో ఇప్పటికే ఉన్నతాధికారుల జీతభత్యాలలో ముప్పై శాతం కోత పడింది, కార్మికులకు ఎపుడు జీతాలు ఇస్తారో తెలియదు, ఉత్పత్తిని గణనీయంగా తగ్గించేసారు, ముడి సరుకుని కూడా సకాలంలో అందించడంలో నిర్లక్షయం వహిస్తున్నారు ఇలా అన్ని వైపుల నుంచి పీక నొక్కి మరీ ప్లాంట్ ని మూసివేయాలని చూస్తున్నారని కార్మిక లోకం మండిపడుతోంది.

ఈ విషమ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అలాగే అఖిల పక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకుని వెళ్లాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వడివడిగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్న వేళ కూటమి ప్రభుత్వం అత్యవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని అంటున్నారు.

5 Replies to “స్టీల్ ప్లాంట్ బతికి బట్ట కడుతుందా?”

  1. steel plant karmika nayakulu ani cheppuku tirige vallaki balisi PK sir meeda comments chestunnaru. tongue control lo pettukuni matladam nerchukondi ra sannasullara.

  2. స్టీల్ ప్లాంట్ పీక్కుపోయి వేరే చోటకు మారిస్తే ఏడవాలిగాని ప్రైవేటు పరం చేసి పని చేయిస్తే నష్టం ఏమిటీ ?

    ప్రభుత్వరంగ సంస్థలంటేనే దందగమారి సంస్థలు. పనికిమాలినవాళ్ళకూ సోమరిపోతులకూ అడ్డా. ఆ సన్నాసులను మన డబ్బులతో ఎన్నాళ్ళు మేపాలి ?

    ఒక నాలుగేళ్ళ క్రితమూ, ఈ సంవత్సరమూ BSNL కు వేలాదికోట్లు రివైవ్ చేయటానికి ఇచ్చాఅరు. BSNL బాగుపడిందా ? ఏయిర్ ఇండియా బాగుపడిందా ? BHVP బాగుపడిందా ?

    ప్రైవేట్ పరం చేస్తే నష్టం ఏమిటి ? పనికిమాలిన సోమరిపోతులు పని చేయాల్సివస్తుందనా ?

  3. ఓటేసి గెలిపించేరు…తరతరాల ప్రభుత్వ ఉద్యోగాలమాట దేవుడెరుగు..క్వార్టర్స్ కలిచెస్ళ్ళుఈ ఊళ్ళోకి పోయి ఇల్లు సిద్దామా..

    వాళ్ళు మాటిచ్చినట్టే తక్కువ ధరకు సారా..దమ్ముంనోడికి దొమ్మి చేసుకుని నిలబడితే 5 కె ఓ పూట తిండి..vrs డబ్బులు దాచుకుంటారో,ఇలా మళ్ళీ ఖర్చు పెట్టుకుంటారో…..

Comments are closed.