జ‌గ‌న్ మారారు.. మ‌రి ప‌వ‌న్‌?

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలో మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపించింది. ఇటీవ‌ల జ‌గ‌న్ పిఠాపురం వెళ్లినప్పుడు ప‌వ‌న్‌పై ఒక్క విమ‌ర్శ కూడా చేయ‌లేదు. గ‌తంలో ప‌వ‌న్‌ను ఎప్పుడూ…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలో మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపించింది. ఇటీవ‌ల జ‌గ‌న్ పిఠాపురం వెళ్లినప్పుడు ప‌వ‌న్‌పై ఒక్క విమ‌ర్శ కూడా చేయ‌లేదు. గ‌తంలో ప‌వ‌న్‌ను ఎప్పుడూ పేరు పెట్టి పిలిచేవారు కాదు. ద‌త్త‌పుత్రుడంటూ ఎద్దేవా చేసిన జ‌గ‌న్‌, ఈ ద‌ఫా పిఠాపురంలో పాపం ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినీ ఆర్టిస్ట్ అంటూ సానుభూతి కామెంట్స్ చేశారు.

గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ, అంత‌కు ముందు ప‌వ‌న్‌తో త‌మ వ్య‌వ‌హార శైలి రాజ‌కీయంగా న‌ష్టం తీసుకొచ్చింద‌ని జ‌గ‌న్ గ్ర‌హించారు. గ‌తంలో ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంపై జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ముగ్గురు, న‌లుగురు పెళ్లాలంటూ సీఎంగా త‌న స్థాయిని దిగ‌జార్చుకుని మ‌రీ ప‌వ‌న్‌పై అవాకులు చెవాకులు జ‌గ‌న్ పేలారు.

ద‌య చేసి త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడొద్ద‌ని ప‌లుమార్లు ప‌వ‌న్‌క‌ల్యాణ్ విజ్ఞ‌ప్తి చేశారు. అయినా జ‌గ‌న్ వినిపించుకోలేదు. చివ‌రికి ప‌వ‌న్‌కు విసుగొచ్చి, త‌న నాలుగో పెళ్లాం జ‌గ‌నే అని ఘాటు కామెంట్ చేశారు. ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం కొంద‌రు వైసీపీ నాయ‌కుల‌కు కూడా న‌చ్చ‌లేదు. అయితే జ‌గ‌న్‌కు ఆ విష‌యాన్ని ధైర్యం చెప్పేవాళ్లు లేక‌పోయారు. త‌మ నాయ‌కుడిపై జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని కాపు, బ‌లిజ సామాజిక వ‌ర్గం జీర్ణించుకోలేక‌పోయింది.

అందుకే వైసీపీకి వ్య‌తిరేకంగా ఆ సామాజిక వ‌ర్గం బ‌లంగా ప‌ని చేసింది. టీడీపీతో ప‌వ‌న్ పొత్తు పెట్టుకోడానికి జ‌గ‌న్ వైఖ‌రే కార‌ణం. ప‌వ‌న్ స్వ‌భావం ఏమంటే… త‌న‌ను విమ‌ర్శించ‌క‌పోతే, ఆయ‌న ఎవ‌రి జోలికి వెళ్ల‌రు. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తించ‌లేక‌పోయారు.

2019లో వైసీపీకి 151 సీట్లు రావ‌డానికి త‌న చ‌రిష్మానే కార‌ణ‌మ‌ని జ‌గ‌న్ భ్ర‌మ‌ప‌డ్డారు. కానీ అది నిజం కాదు. టీడీపీ, జ‌న‌సేన వేర్వేరుగా పోటీ చేయ‌డం వ‌ల్ల జ‌గ‌న్ అత్య‌ధికంగా లాభ‌ప‌డ్డారు. లేదంటే ఆయ‌న‌కు 151 అసెంబ్లీ, 22 లోక్‌స‌భ స్థానాలు వ‌చ్చేవి కావు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ విడిగా పోటీ చేస్తే త‌న‌కే లాభ‌మ‌ని తెలిసి కూడా జ‌గ‌న్ ఊరికే ప‌వ‌న్‌తో గిల్లిక‌జ్జాలు పెట్టుకుంటూ వ‌చ్చారు.

2024 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో జ‌గ‌న్‌కు అహంకారం దిగింది. ప‌వ‌న్‌తో అన‌ధికారికంగా రాజీకి వ‌చ్చారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత ప‌వ‌న్ కీల‌క కామెంట్స్ చేశారు. వైసీపీ ఘోరంగా ఓడిపోయింద‌ని అవమానించొద్ద‌ని, వారు ప్ర‌త్య‌ర్థులే త‌ప్ప‌, శ‌త్రువులు కాద‌ని ఆయ‌న అన్నారు. ఒక‌వేళ వైసీపీ నేత‌లు త‌న‌ను శ‌త్రువుగా చూస్తూ వుండొచ్చ‌ని కూడా ఆయ‌న అన్నారు.

త‌న విష‌యంలో జ‌గ‌న్ వైఖ‌రిలో సానుకూల మార్పు వ‌చ్చిన నేప‌థ్యంలో ప‌వ‌న్ ఎలా స్పందిస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. జ‌గ‌న్‌తో వ్య‌క్తిగ‌తంగా గొడ‌వ‌లొద్ద‌ని ప‌వ‌న్ కూడా భావిస్తారా? లేక గ‌తంలో మాదిరిగానే వైసీపీ అధినేత‌తో ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డ‌తారా? అనేది కాలం తేల్చాల్సి వుంది.

45 Replies to “జ‌గ‌న్ మారారు.. మ‌రి ప‌వ‌న్‌?”

  1. ఇలాంటి ఎన్ని న్యూస్ లు రాసిన లాభం లేదు రా అబ్బాయి, అది వొట్టి పోయిన గొడ్డు నువ్వు ఎన్ని ఆర్టికల్స్ రాసి జగన్ ని lime light లో ఉంచాలన్నా no use ra అబ్బాయి !! YCP pack up!!

  2. ఇలాంటి ఎన్ని న్యూస్ లు రాసిన లాభం లేదు రా అబ్బాయి, అది వొ*ట్టి పోయిన గొ*డ్డు నువ్వు ఎన్ని ఆర్టికల్స్ రాసి జగన్ ని lime light లో ఉంచాలన్నా no use ra అబ్బాయి !! Y*C*P pack-up!!

  3. ఆహా ఈ జి ఏ గా డు పాపం వీడు వీడి ఎ ద వ ఆర్టికల్స్ అన్ని వీడే కింద ప్రదర్శించుకుంటున్నాడు వాటిలో 2022లో వదిలిన ఒక ఆర్టికల్ లింక్ చూస్తే ఇప్పుడు నువ్వు ఆగట్లేదు భయ్యా . మీరు కూడా నవ్వుకోండి

    https://telugu.greatandhra.com/politics/andhra-news/heart-be-careful-he-is-also-the-permanent-cm-128353.html?utm_source=vuukle&utm_medium=talk_of_town

  4. Arey Babu jagan pella gurinchi matldindi tappey anukundam…..veedu veediki package estunna vallu enka chaala chepparu, tittaru Amma mogudu Ani kooda koosaru vallu yela gelicharu???antey veellu yemaina cheppavacha???

      1. ఒరే, పిచ్చి పువ్వా! ఏమన్నా అర్థం వుందా పై ఆర్టికల్ లో? నీలాంటి గుడ్డీ కొడుకులని నమ్ముకునే మీ అన్న సంకనాకి పోయాడు ఇప్పటికైనా నిద్ర లెవండిరా పోరంబోకు నయల్లారా! ఇలాగే ఇంకో ఐదేళ్లు వర్థిల్లండిరా.

  5. Janasena goosebumps response: https://www.youtube.com/shorts/HlKRQVUvYA8

    .

    బలి చక్రవర్తి కూడా వామనుడుని చూసి ఇంతేనా… అన్నాడు.

    నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో.. అని.

    .

    ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై….

    నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ….

    .

    వామన అవతారాన్ని చూపిస్తుంది జనసెన.

    జగన్ గుర్తు పెట్తుకొ… అధపాతాళానికి తొక్కకపొతె..

    నా పెరు పవన్ కల్యణ్ నె కాదు… నా పార్టి జనసెనె కాదు!

  6. అప్పుడంటే 151 సీట్లు వున్నాయి సీఎం ని అని గువ్వబలిసి ఏదిపడితే అది అనేవాడు .. ఇపుడేమో 11 సీట్లు వచ్చి కనీసం ప్రతిపక్షనేత కూడా కాదాయే .. అందుకే కాస్త నోరు అదుపులో పెట్టుకుంటున్నాడు

  7.  ముగ్గురు, న‌లుగురు పెళ్లాలంటూ సీఎంగా త‌న స్థాయిని దిగ‌జార్చుకుని మ‌రీ ప‌వ‌న్‌పై అవాకులు చెవాకులు జ‌గ‌న్ పేలారు… ఈ విషయంపై ఎప్పుడైనా జగన్ ని విమర్శిస్తూ ఒక్క ఆర్టికల్ అయినా రాశారా మీరు. రాస్తే దయచేసి ఆ లింక్ ఇక్కడ కాపీ చేయగలరు.

  8. జగన్ గుర్తు పెట్తుకొ… నిన్ను అధపాతాళానికి తొక్కకపొతె………. నా పెరు పవన్ కల్యణ్ నె కాదు… నా పార్టి జనసెనె కాదు!

    .

    ఇప్పటికి అర్ధం అయ్యిందా? అయినా జగన్ కంటె పవన్ గెలిచిన సీట్లె ఎక్కువ!

  9. 2019లో వైసీపీకి 151 సీట్లు రావ‌డానికి త‌న చ‌రిష్మానే కార‌ణ‌మ‌ని జ‌గ‌న్ భ్ర‌మ‌ప‌డ్డారు. కానీ అది నిజం కాదు. టీడీపీ, జ‌న‌సేన వేర్వేరుగా పోటీ చేయ‌డం వ‌ల్ల జ‌గ‌న్ అత్య‌ధికంగా లాభ‌ప‌డ్డారు. లేదంటే ఆయ‌న‌కు 151 అసెంబ్లీ, 22 లోక్‌స‌భ స్థానాలు వ‌చ్చేవి కావు. ఈ విషయం కూడా మీరెప్పుడూ గత ఐదేళ్ళలో రాయలేదు. అంటే అప్పుడు తెలిసి కూడా కవర్ చేశారు. అన్న మునిగిపోయాక ఇప్పుడు చెప్తున్నారా మీరు.

  10. అధికారం లో ఉన్నప్పుడు అన్న ఇలా అంటే, నీ ఆర్టికల్స్….పవన్ ని చెడుగుడు ఆడిన అన్న, పవన్ ని కడిగిపారేసిన అన్న, తోలు తీసిన అన్న…అబ్బో

  11. 2019లో వైసీపీకి 151 సీట్లు రావ‌డానికి త‌న చ‌రిష్మానే కార‌ణ‌మ‌ని జ‌గ‌న్ భ్ర‌మ‌ప‌డ్డారు. కానీ అది నిజం కాదు, valla Nana చ‌రిష్మా and okka chance ani sympathy

  12. PK మచ్చిగా చేసుకొనెందుకు బాలినేని ని జనసేన లోకి పంపుతున్నారు. భవిష్యత్ లో వైసీపీ జనసేన పొత్తు పొత్తు పెట్టుకొనే ఆస్కారం ఉంది. కా పు రె.డ్డి తో కలిసిన లేక క మ్మ తో కలిసిన ప్రబంజనమే అని టీడీపీ, వైసీపీ పార్టీ లకు అర్థం అయింది.

  13. అరెయ్ మాలోకం .. ఆయన రిసల్ట్ వచ్చిన రోజే చెప్పాడు ycp మాకు శత్రువు కాదు , .. కక్షలు వద్దు ,మంచి పాలన చేస్తాం అని .. మరి నువ్వు మారాడు ,మారాడు మారాడ్డు అని ఎందుకు ఎక్కువ చేస్తున్నావ్

  14. “ముగ్గురు నలుగురు పెళ్లాలంటూ సిఎం గా తన స్థాయిని దిగజార్చుకుని మరీ…”

    సిఎం గా తన స్థాయి ని దిగజార్చుకోలేదు. సిఎం స్థాయి ని తన స్థాయి కి తెచ్చాడు.

Comments are closed.