ఆదిమూలంపై లైంగిక దాడి కేసు లేదిక‌!

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై న‌మోదైన లైంగిక దాడి కేసు ఇక లేదు. టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు త‌న‌పై ఆదిమూలం లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని తిరుప‌తి ఈస్ట్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన…

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై న‌మోదైన లైంగిక దాడి కేసు ఇక లేదు. టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు త‌న‌పై ఆదిమూలం లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని తిరుప‌తి ఈస్ట్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు ఈస్ట్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఎమ్మెల్యేని అరెస్ట్ చేయ‌డానికి కూడా ప్ర‌య‌త్నించారు.

ఈ నేప‌థ్యంలో టీడీపీ పెద్ద‌ల జోక్యంతో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. త‌న‌పై కోనేటి ఆదిమూలం లైంగిక దాడికి పాల్ప‌డ‌లేదని, త‌న ఫిర్యాదు అబ‌ద్ధ‌మ‌ని ఏపీ హైకోర్టుకు త‌న లాయ‌ర్ ద్వారా అఫ‌డ‌విట్ ద్వారా తెలిపింది. దీంతో బాధితురాలిపై న్యాయ‌మూర్తి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. త‌మ స‌మ‌యాన్ని వృథా చేస్తున్నార‌ని న్యాయ‌మూర్తి మండిప‌డిన‌ట్టు తెలిసింది.

ఈ క్ర‌మంలో ఈస్ట్ పోలీసులు బుధ‌వారం కోనేటి ఆదిమూలంపై కేసును ఎత్తివేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో కోనేటి ఆదిమూలం అనుచ‌రులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ నాయ‌కుడి స‌చ్ఛీల‌త బ‌య‌ట ప‌డింద‌ని వారు అంటున్నారు. త్వ‌ర‌లో కోనేటి ఆదిమూలంపై స‌స్పెన్ష‌న్‌ను ఎత్తివేయ‌నున్న‌ట్టు తెలిసింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కావ‌డంతో లైంగిక దాడి కేసు కూడా ఏమీ కాలేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

24 Replies to “ఆదిమూలంపై లైంగిక దాడి కేసు లేదిక‌!”

    1. Yes, thisbis definetely media management and using law and order for benefitting the accused and fooling both people and legal system with backdoor settlement with victim.

    1. ఆమె ఇష్ట పూర్వకంగా వేయించుకుంది. ఇలా చేస్తే ఇంకా సెటిల్ మెంట్ డబ్బు ఎక్కవ వస్తది అని ఆశ పడి ఉంటది.

Comments are closed.