వీరమల్లు Vs ఓజీ

ప్రస్తుతం సెట్స్ పై హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ నడుస్తుంటే, మరోవైపు సోషల్ మీడియాలో ఓజీ సినిమా రిలీజ్ పై జోరుగా చర్చ సాగుతోంది.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు సంబందించి 2 సినిమాలు ఒకేసారి ట్రెండింగ్ అవుతున్నాయి. వీటిలో ఒకటి హరిహర వీరమల్లు సినిమా కాగా.. రెండోది ఓజీ చిత్రం.

నిజానికి పవన్ సినిమాల్లో ముందుగా ఓజీనే థియేటర్లలోకి వస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే, షూటింగ్ పరంగా మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే అడ్వాన్స్ గా ఉంది. కానీ ఊహించని విధంగా హరిహర వీరమల్లు సినిమాను 2 భాగాలు చేశారు.

పవన్ కల్యాణ్ 20 రోజులు కాల్షీట్లు ఇస్తే, హరిహర వీరమల్లు పార్ట్-1 షూటింగ్ పూర్తవుతుంది. దీంతో పవన్ ఈ సినిమాకు వచ్చాడు. అదే ఊపు మీద సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

దీంతో ఓజీపై సరికొత్త చర్చ మొదలైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికి ఓజీ రిలీజై 2 రోజులు అయి ఉండేది. 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, కానీ పోస్ట్ పోన్ చేయడంతో ఆ తేదీకి దేవర వచ్చిపడింది.

సెప్టెంబర్ మిస్సయినా డిసెంబర్ లేదా జనవరిలో ఓజీ వస్తుందని భావిస్తే.. హరిహర వీరమల్లు సినిమా మార్చి 28కి షెడ్యూల్ అయింది. కాబట్టి వీరమల్లు కంటే ముందు ఓజీ వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఓజీ సినిమా షూటింగ్ తొందరగా పూర్తయినా, వెయిట్ చేయక తప్పని పరిస్థితి.

తాజా సమాచారం ప్రకారం.. వచ్చే ఏడాది జూన్ తర్వాత ఓజీ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సెట్స్ పై హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ నడుస్తుంటే, మరోవైపు సోషల్ మీడియాలో ఓజీ సినిమా రిలీజ్ పై జోరుగా చర్చ సాగుతోంది.

5 Replies to “వీరమల్లు Vs ఓజీ”

    1. బాగుంటే ఐ బొమ్మల చూద్దాం అద్భుతంగా ఉంటేనే థియేటర్లో చూద్దాం

Comments are closed.