రోజా పాత వీడియో….వైసీపీకి అంట‌క‌ట్టి!

తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలిగా ఆర్కే రోజా కామెంట్స్‌ను వైసీపీకి అంట‌క‌ట్టి, ఏకంగా డిబేట్‌లో విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం టీడీపీ అనుకూల మీడియాకే చెల్లింది. అస‌లు వైసీపీ ఆవిర్భ‌వించ‌కుండానే, ఆ పార్టీ నాయ‌కురాలు రోజా త‌మ ప్ర‌త్య‌ర్థి…

తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలిగా ఆర్కే రోజా కామెంట్స్‌ను వైసీపీకి అంట‌క‌ట్టి, ఏకంగా డిబేట్‌లో విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం టీడీపీ అనుకూల మీడియాకే చెల్లింది. అస‌లు వైసీపీ ఆవిర్భ‌వించ‌కుండానే, ఆ పార్టీ నాయ‌కురాలు రోజా త‌మ ప్ర‌త్య‌ర్థి ప‌వ‌న్‌క‌ల్యాణ్ భార్య రేణుదేశాయ్‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేశార‌ని, ఈ మాట‌ల‌పై నాడు సినీ ప‌రిశ్ర‌మ ఎందుకు స్పందించ‌లేద‌ని ప్ర‌శ్నించ‌డం విడ్డూరం.

మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ప్ర‌జారాజ్యం పార్టీ అవ‌త‌రించింది. ఆ స‌మ‌యంలో రోజా తెలుగు మ‌హిళా రాష్ట్ర అధ్య‌క్షురాలు. రోజాపై పీఆర్పీ మ‌హిళా అధ్య‌క్షురాలు శోభారాణి తీవ్ర అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశారు. వాటిని తిప్పి కొట్టే క్ర‌మంలో ప‌వ‌న్ , చిరంజీవిల‌పై విరుచుకుప‌డ్డారు. అలాగే రేణుదేశాయ్‌కి త‌న‌పై శోభారాణి విమ‌ర్శ‌లు చేసిన‌ట్టు అవ‌కాశాలు వ‌చ్చాయా? అని ఆవేశం, ఆవేద‌న‌తో క‌ల‌గ‌లిపిన స్వ‌రంతో రోజా నిల‌దేశారు.

మెగాస్టార్ కుటుంబ స‌భ్యుల‌పై రోజా నాడు అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేస్తే , సినీ ప‌రిశ్ర‌మ ఎందుకు స్పందించ‌లేద‌ని టీడీపీ అనుకూల డిబేట్‌లో ప్ర‌శ్నించ‌డం విశేషం. అంతా ప‌కప‌క్షంగా నిర్వ‌హించే డిబేట్ కావ‌డంతో, ఇది టీడీపీ నాయ‌కురాలిగా రోజా మాట్లాడార‌ని చెప్పే వాళ్లెవ‌రూ లేక‌పోయారు.

ఇదే డిబేట్‌లో పీఆర్పీ అధ్య‌క్షుడు చిరంజీవికి పీఆర్వో/పీఎస్‌గా ప‌ని చేసిన పోలా విక్ర‌మ్ ఉన్న‌ప్ప‌టికీ నోరు తెర‌వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ అనుకూల చాన‌ళ్ల‌లో డిబేట్లు ఎంత ఏక‌ప‌క్షంగా, క‌క్ష‌పూరితంగా జ‌రుగుతాయో రోజాపై చేసిన చర్చే నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌తిదీ వైసీపీకి ఎలా అంట‌క‌డ‌తారో ఇదే నిద‌ర్శ‌నం.

10 Replies to “రోజా పాత వీడియో….వైసీపీకి అంట‌క‌ట్టి!”

  1. దీన్నే నీలి జర్నలిజం అంటారు..

    ఒకప్పటి రోజా మాటలను .. అప్పటి చిత్ర పరిశ్రమ ఖండించలేదెందుకు అని మాత్రమే ప్రశ్నిస్తున్నారు..

    ఇక్కడ పార్టీలకు అతీతం గా చూడాలి.. వైసీపీ దే తప్పు అని ఎందుకు ఫీల్ అయిపోతున్నావో.. గుమ్మడికాయల దొంగ సామెత గుర్తుకొచ్చిందా..

    ఇప్పుడు కూడా.. మంత్రి సురేఖ.. సమంత తప్పు చేసిందని చెప్పలేదు.. నాగార్జున బ్రోకర్ పనులు చేసాడు అని మాత్రమే చెప్పింది.. నిజానికి సమంత ని మెచ్చుకుంది.. నాగార్జున చేసే బ్రోకర్ పనులకు సమంత ఒప్పుకోలేదు అని తన విలువ పెంచింది..

    తన ఆస్తులు కాపాడుకోవడం కోసం నాగార్జున బ్రోకర్ పనులు చేస్తాడని.. జగన్ రెడ్డి కోసం జైలుకి వెళ్లి పరామర్శించినప్పుడే జనాలకు అర్థమయింది..

    అందుకే.. మంత్రి సురేఖ మాటలకు ప్రజల నుండి వ్యతిరేకత లేదు.. సినీ పరిశ్రమ అనబడే ఊసరవెల్లులు నుండి మాత్రమే ట్వీట్ల నిరసన కనపడింది..

  2. దీన్నే నీలి జ ర్నలిజం అంటారు..

    ఒకప్పటి రోజా మాటలను .. అప్పటి చిత్ర పరిశ్రమ ఖండించలేదెందుకు అని మాత్రమే ప్రశ్నిస్తున్నారు..

    ఇక్కడ పార్టీలకు అతీతం గా చూడాలి.. వైసీపీ దే తప్పు అని ఎందుకు ఫీల్ అయిపోతున్నావో.. గుమ్మడికాయలదొంగ సామెత గుర్తుకొచ్చిందా..

    ఇప్పుడు కూడా.. మంత్రి సురేఖ.. సమంత తప్పు చేసిందని చెప్పలేదు.. నాగార్జున బ్రోకర్ పనులు చేసాడు అని మాత్రమే చెప్పింది.. నిజానికి సమంత ని మెచ్చుకుంది.. నాగార్జున చేసే బ్రోకర్ పనులకు సమంత ఒప్పుకోలేదు అని తన విలువ పెంచింది..

    తన ఆస్తులు కాపాడుకోవడం కోసం నాగార్జున బ్రోకర్ పనులు చేస్తాడని.. జగన్ రెడ్డి కోసం జైలుకి వెళ్లి పరామర్శించినప్పుడే జనాలకు అర్థమయింది..

    అందుకే.. మంత్రి సురేఖ మాటలకు ప్రజల నుండి వ్యతిరేకత లేదు.. సినీ పరిశ్రమ అనబడే ఊసరవెల్లులు నుండి మాత్రమే ట్వీట్ల నిరసన కనపడింది..

  3. ఇలా పాతవి తవ్వడం ఎందుకు? ఐదేళ్లు ఒక పార్టీ లో అధికారం అనుభవించి, ఆ పార్టీ ఓడిపోయి నెల కాకుండానే పార్టీ లు మారిపోతుంటే! ఉదాహరణ హైదరాబాద్ నగర ఎమ్మెల్యే లు!

Comments are closed.