ఈ సినిమాకు ప్రచారం అక్కర్లేదా?

ఈ రోజును మినహాయిస్తే.. వేట్టయన్ సినిమా విడుదలకు మిగిలింది కేవలం 2 రోజులు టైమ్ మాత్రమే. తెలుగులో ఇప్పటివరకు ఈ సినిమా ప్రచారం మొదలుకాలేదు. ఈ 2 రోజుల్లోనైనా ప్రచారం చేస్తారా చేయరా అనేది…

ఈ రోజును మినహాయిస్తే.. వేట్టయన్ సినిమా విడుదలకు మిగిలింది కేవలం 2 రోజులు టైమ్ మాత్రమే. తెలుగులో ఇప్పటివరకు ఈ సినిమా ప్రచారం మొదలుకాలేదు. ఈ 2 రోజుల్లోనైనా ప్రచారం చేస్తారా చేయరా అనేది అనుమానంగా ఉంది.

వేట్టయన్ అనేది మామూలు సినిమా కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా. ఈ సీనియర్ హీరో సినిమాలు ఏసీ-డీసీ టైపులో ఉన్నాయి. అయితే జైలర్ టైపులో సూపర్ హిట్, లేదంటే లాల్ సలామ్ టైపులో డిజాస్టర్. అలా అని ప్రచారం చేయకుండా వదిలేస్తే ఎలా?

రజనీకాంత్ మాత్రమే కాకుండా.. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ లాంటి నటులున్నారు. పైగా అనిరుధ్ కంపోజ్ చేసిన ఓ పాట ఇప్పటికే పెద్ద హిట్టు. ఇలాంటి టైమ్ లో తెలుగులో చిన్న ప్రచారం చేసినా, సినిమాకు బజ్ పెరుగుతుంది. అలాంటి ప్రయత్నం కనిపించలేదు.

ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ పోస్టర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. తెలుగులో ఈ సినిమాను ఏషియన్ సురేష్ సంస్థ రిలీజ్ చేస్తోంది.

3 Replies to “ఈ సినిమాకు ప్రచారం అక్కర్లేదా?”

Comments are closed.