జాప్యం చేస్తే ఇలాగే అవుతుంది జగన్!

అదను దాటినా విత్తితే మాత్రం ప్రయోజనం ఉంటుందా? ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే చేసేయాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే ‘రేపటి పనిని ఇవాళే చేసేయి’ అని మహాత్మాగాంధీ చెప్పిన నీతిని కూడా గుర్తు తెచ్చుకోవాలి.…

అదను దాటినా విత్తితే మాత్రం ప్రయోజనం ఉంటుందా? ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే చేసేయాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే ‘రేపటి పనిని ఇవాళే చేసేయి’ అని మహాత్మాగాంధీ చెప్పిన నీతిని కూడా గుర్తు తెచ్చుకోవాలి. అలా చేయకపోతే దక్కే ప్రయోజనం ఉండదు. కనీసం మన చిత్తశుద్ధికి కూడా విలువ దక్కదు. ఆ విషయం ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చాలా బాగా అర్థమవుతూ ఉండాలి.

పుంగనూరులో బాలిక హత్యకు గురైంది. 2వ తేదీన ఆ విషయం వెలుగులోకి వస్తే.. ఆ పట్టణానికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడానికి జగన్ కు ఏడు రోజుల సమయం ఎందుకు? 9వ తేదీన ఆయన పర్యటన ప్లాన్ చేసుకున్నారు. తీరా ఇప్పుడు ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. జాప్యం చేయడం వల్లనే ఇలా జరిగింది.

పుంగనూరులో బాలిక అస్పియా సెప్టెంబరు 29న కిడ్నాప్ కు గురైంది. ఆమెను హత్యకు గురైనట్టుగా అక్టోబరు 2వ గుర్తించారు. పుంగనూరులో ఈ హత్య పెద్ద సంచలనమే సృష్టించింది. పార్టీలు, కులాలు, మతాలతో సంబంధం లేకుండా పుంగనూరు పట్టణం మొత్తం ఒక్కటైపోయింది. బాలికను హత్య చేసిన వారెవ్వరో గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతూ నగరవాసులందరూ కలిసి పెద్ద ర్యాలీ నిర్వహించారు. నిజానికి ప్రతిపక్షం కూడా ఈ విషయంలో సకాలంలో స్పందించి ఉండాలి. వారు స్పందించారు. జగన్ స్వయంగా వెళ్తానని కూడా అన్నారు. కానీ అది సకాలంలో కాదు. జాప్యం జరిగింది.

నిజానికి ఇలాంటి పరామర్శల విషయంలో ఇతర కార్యక్రమాలను పక్కన పెట్టైనా సరే నాయకుడు వెళ్లి రావాలి. జగన్ తాడేపల్లి కార్యకలాపాలు అన్నీ చక్కబెట్టిన తర్వాత.. తాను బెంగుళూరు నివాసానికి వెళ్లిపోయారు. అక్కడ నాలుగురోజులు గడిపిన తర్వాత.. తిరుగు ప్రయాణంలో పుంగనూరుకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని టూరు షెడ్యూలు ప్రకటించారు.

కార్యకర్తలు భావిస్తున్నదేంటంటే.. తాడేపల్లిలో పార్టీ వారితో నిర్వహించే సమావేశాల మధ్యలో తరచూ బెంగుళూరు నివాసానికి వెళ్లిపోతూ ఉండే జగన్మోహన్ రెడ్డి.. తిరుగు ప్రయాణంలో కాకుండా.. వెళుతున్నప్పుడే పుంగనూరులో పరామర్శ పూర్తిచేసి ఆ తర్వాత బెంగుళూరు వెళ్లి ఉండొచ్చు కదా? అనేది! ఇప్పుడు ముగ్గురు మంత్రులు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని, హత్యకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారని చెబుతూ.. జగన్ అసలు తన పర్యటననే క్యాన్సిల్ చేసుకున్నారు.

ఇక్కడ మరో సంగతి కూడా గుర్తించాల్సి ఉంది. పుంగనూరు పర్యటన ద్వారా జగన్ లక్ష్యించినది ఏమిటి? బాధిత కుటుంబాన్ని పరామర్శించడం, బిడ్డను కోల్పోయిన వారికి ధైర్యం చెప్పడం మాత్రమే కదా! మరి ఆ పని చేయడానికి- మంత్రులు రావడంతో గానీ, నిందితుల అరెస్టుతో గాని సంబంధం ఏముంటుంది? అనేది ప్రజల సందేహం. ఇలా అర్థంతరంగా పర్యటన రద్దు చేసుకోవడం వలన జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధిపై ప్రజల్లో అనుమానాలు వస్తాయి కదా అని కూడా ప్రజలు అంటున్నారు.

23 Replies to “జాప్యం చేస్తే ఇలాగే అవుతుంది జగన్!”

  1. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే….10th క్లాస్ స్టూడెంట్ కి తెలిసిన రాజకీయం కూడా జగన్ కి గాని…ఆయన సలహా దారుడికి గాని తెలవదు….

  2. రాజకీయాలు పక్కన పెడితే, పుంగనూరు పోలిసు లు వెంటనే స్పందించి తమ వంతు ప్రయత్నం చేసారు. దురదృష్టం ఫలితం దక్కలేదు.

    1. బొ*క్కలో ప్యాలస్ పులకేశి గాడి టైమ్ లో అమర్నాథ్ అనే అబ్బాయిని నిలువునా తగలబెట్టారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు.

      అప్పుడు శాడిస్టు గాడు ప్యాలస్ లో వుండ్డి ఎగ్ పఫ్ లు మింగుత వున్నాడు.

  3. ఇలాంటి పనికిమాలినోడిని “సింగల్ సింహం” అంటూ ఎలేవేషన్స్ ఇచ్చుకొంటుంటాయి .. నీలి కుక్కలు..

    ప్రెస్ మీట్ పెట్టడానికి భయం..

    ఆంధ్ర లో ఉండటానికి భయం..

    ఓట్లేసిన జనాలను కలవడానికి భయం..

    తిరుమల కొండ ఎక్కాలన్నా భయం.. సంతకం పెట్టాలన్నా భయం..

    ప్రతిపక్ష హోదా కావాలి.. కానీ అసెంబ్లీ అంటే భయం..

    శవం కావాలి.. కానీ శవమే బెంగుళూరు పాలస్ కి నడిచి రావాలి..

    కోర్టులంటే భయం..

    జడ్జీలంటే భయం..

    శుక్రవారం అంటే భయం..

    భయం.. భయం.. భయం..

    మా ఖర్మ కొద్దీ సీఎం అయ్యి.. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు..

  4. అప్పట్లో వోదర్పు యాత్ర చేశతప్పుడు, ఒక రూమర్ వినిపించేది.

    రాష్ట్రం లో అన్ని కాటికాపరి లా ఫోన్ నంబర్ లు, అంబులెన్స్ డ్రైవర్ లా ఫోన్ నంబర్ లు ప్యాలస్ పులకేశి ఫోన్ లో.వుండేవి.

    ఎక్కడైనా కొత్త శవం వుంటే ప్యాలస్ పులకేశి కి sms చేస్తే చాలు, , వెంటనే 10 వేలు డబ్బు ఇచ్చేవాడు అంట.తర్వాత ఆ శవం బోదర్పు న్యూస్ తన టాయిలెట్ టిష్యూ పేపర్ లో వార్తా గా వచ్చేది.

  5. మా పాలనలో అయితే చంపినవాడే బాడీ డోర్ డెలివరీ చేసే సౌకర్యం ఉండేది, మీ పాలనలో అయితే పోలీసులకి కష్టంగా ఉంది, ఇదెక్కడి న్యాయం అని బాబుని కడిగెయ్యి అన్నా! అస్సలు తగ్గేదే లేదు!

  6. ఇంత దారుణమైన సలహాదారుడు ఎవరో జగన్ కి

    తిరుపతి రాంగ్ స్టెప్

    ప్రెస్ మీట్ రాంగ్ స్టెప్

    ఇప్పుడు ఇది .. ఎలా రా ఇలా అయితే ప్రతిపక్ష హోదా ?

    1. సలాహారడున్ని అనుకుంటే ఏం లాభం, ఈ దద్దమ్మ గాడు కనీసం ఆలోచించే సామర్థ్యం లేదా, ఇలాంటి వాడు నాయకుడు.

  7. నీ దగుల్బాజీ రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు

    నెస్ట్.ఎన్నికల్లో మళ్ళీ ముందుది కానీ వెనకథి కానీ లేపేయ్యటానికి సిద్ధం

Comments are closed.