స్టార్ బాయ్ తో మరో ‘విశ్వ’ప్రయత్నం

టిల్లూ స్క్వేర్ తో వంద కోట్ల హీరోగా అవతరించాడు సిద్ధు జొన్నలగడ్డ. బహుశా, ఆ సినిమా ఇచ్చిన నమ్మకంతోనే కావొచ్చు, ఈసారి మరింత పెద్ద సినిమాను ప్రకటించాడు నిర్మాత నాగవంశీ. Advertisement సితార ఎంటర్…

టిల్లూ స్క్వేర్ తో వంద కోట్ల హీరోగా అవతరించాడు సిద్ధు జొన్నలగడ్డ. బహుశా, ఆ సినిమా ఇచ్చిన నమ్మకంతోనే కావొచ్చు, ఈసారి మరింత పెద్ద సినిమాను ప్రకటించాడు నిర్మాత నాగవంశీ.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఈ సినిమా పేరు కోహినూర్. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 2 భాగాలుగా రాబోతోంది.

రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుంది. వజ్రాన్ని రాజు వెనక్కి తీసుకురాబోతున్నాడనే క్యాప్షన్ తో కోహినూర్ పార్ట్-1ను ప్రకటించారు. 2026 సంక్రాంతికి రిలీజ్ అని కూడా చెప్పుకొచ్చారు.

పోస్టర్ లో ఒక చేతిలో కత్తి, మరో చేతిలో కోహినూర్ వజ్రం పట్టుకొని డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ హీరో కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీ ఇదే. దేశం మొత్తం కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది, అందుకే దీన్ని ఇండియన్ ఫిలింగా చెబుతున్నారు మేకర్స్.

ప్రస్తుతం ‘తెలుసు కదా’ అనే సినిమా చేస్తున్నాడు సిద్ధు. ఆ మూవీ కొలిక్కి వచ్చిన తర్వాత ‘కోహినూర్’పై మరింత స్పష్టత వస్తుంది.

3 Replies to “స్టార్ బాయ్ తో మరో ‘విశ్వ’ప్రయత్నం”

Comments are closed.