వైసీపీ, జ‌న‌సేన‌, టీడీపీ మ‌ద్యం కూట‌మి

రాజ‌కీయంగా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ ఒక కూట‌మి. కానీ వ్యాపార ప‌రంగా టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీ ఒక కూట‌మి. ఆదాయం ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి అన్ని పార్టీలు ఏక‌మ‌వుతాయ‌నేందుకు తాజాగా మ‌ద్యం సిండికేట్లే నిలువెత్తు…

రాజ‌కీయంగా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ ఒక కూట‌మి. కానీ వ్యాపార ప‌రంగా టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీ ఒక కూట‌మి. ఆదాయం ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి అన్ని పార్టీలు ఏక‌మ‌వుతాయ‌నేందుకు తాజాగా మ‌ద్యం సిండికేట్లే నిలువెత్తు నిద‌ర్శ‌నం. మ‌ద్యం షాపుల‌కు సంబంధించి ప్ర‌భుత్వం ఈ నెల 14న లాటరీలు తీసింది. ఇందులో అన్ని పార్టీల వారిని అదృష్టం వ‌రించింది.

ఈ నేప‌థ్యంలో తిరుప‌తిలో వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన పూర్తిస్థాయిలో సిండికేట్‌గా ఏర్ప‌డ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తిరుప‌తిలో 32 మ‌ద్యం షాపుల‌కు టెండ‌ర్లు వేశారు. 2004 నుంచి మ‌ద్యం వ్యాపారంలో అంతా తానై న‌డిపిస్తున్న ఒక‌ప్ప‌టి కాంగ్రెస్‌, నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ నాయ‌కుడైన ఒకాయ‌న మ‌రోసారి త‌న హ‌వా కొన‌సాగించారు. ప్ర‌స్తుతం వైసీపీ అధికారంలో లేక‌పోవ‌డంతో మౌనంగా వుంటున్న‌ప్ప‌టికీ, మ‌ద్యం దుకాణాల్ని ద‌క్కించుకోవ‌డంలో ఎప్ప‌టిలాగే స‌త్తా చాటుకున్నారు.

స‌ద‌రు వైసీపీ నాయ‌కుడు మ‌రోసారి తిరుప‌తి మ‌ద్యం వ్యాపారంలో త‌న‌దైన స్టైల్‌లో అంద‌రినీ ఏకం చేశారు. 32 షాపులు ఎవ‌రికి ద‌క్కినా, ఆదాయం వ‌చ్చే స‌రికి మూడు పార్టీలు క‌లిసి పంచుకుందామ‌ని ఒప్పందం కుదిర్చారాయ‌న‌. దీంతో తిరుప‌తిలో మ‌ద్యం దుకాణాల‌పై గొడ‌వే లేకుండా పోయింది.

రాజ‌కీయంగా ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటూ, మ‌ద్యం వ్యాపారానికి వ‌చ్చే స‌రికి… తామంతా ఒక‌టేన‌ని నిరూపించుకున్నార‌ని సామాన్య ప్ర‌జానీకం చ‌ర్చించుకునే ప‌రిస్థితి.

8 Replies to “వైసీపీ, జ‌న‌సేన‌, టీడీపీ మ‌ద్యం కూట‌మి”

  1. మద్యం షాపుల దక్కించుకున్న వైసీపీ జనాలను.. పార్టీ నుండి సస్పెండ్ చేయాలని.. వైసీపీ కి ఓటేసిన 40% జనాలు కోరుకొంటున్నారు..

    వైసీపీ జనాలతో.. ఆదాయం లో కమిషన్ ఇస్తే చాలని జగన్ రెడ్డి బేరం పెట్టినట్టు.. టాక్..

  2. ప్రియమైన రాజా గారు,

    మీకు ఒక చిన్న ప్రశ్న—మీకు ఏమన్నా సిగ్గుందా, లేక అది కూడా రాజకీయ సౌకర్యాల వాయువులలో దొర్లిపోయిందా? మీ చదువుతోనూ, తర్కశక్తితోనూ, మీరు కొంచెమైనా స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిగా ఉండాలి అనుకున్నాం. కానీ, జగన్ మోహన్ రెడ్డి నాటకాలలో సూటిగా, తలుపు పెట్టిన బొమ్మలాగా తిరుగుతూ, మీ సొంత ఆలోచనలేమీ లేకుండా ప్రవర్తించడం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలగుతోంది.

    ఒక విద్యావంతుడిగా, ప్రజాస్వామ్యంలో మీరు ప్రతి పార్టీని ప్రశ్నించడం, తప్పులను ఎత్తిచూపడం, మీ సామాజిక బాధ్యత. కానీ మీరు మాత్రం ఆ ‘మేధావి’లా నటిస్తూ, మీకు ప్రజలు ఇచ్చిన సందేశాన్ని పూర్తిగా విస్మరించారు. 175 స్థానాలలో 11 మాత్రమే గెలిచినప్పుడు, ప్రజలు మీ “మేధోసామర్థ్యానికి” ఇచ్చిన రేటింగ్ అర్థమవుతున్నదా?

    ఇక మీ ఈ అజ్ఞాత భక్తికి కారణం—జగన్ మోహన్ రెడ్డి మారినందుకు? మారడం వ్యక్తిగత హక్కు. అందులో సందేహం లేదు. కానీ, కేవలం ఆ ఒక్క కారణంతో ఆయనకు అंधవిశ్వాసం చూపడం మీ లోతులేని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఏ సిద్ధాంతం లేకుండా, కేవలం మీ భక్తి వల్లే మీరు ఈ స్థితికి దిగజారారు.

    రాజా గారు, మీ పంతం పక్కనబెట్టి, ఇప్పుడైనా కొంచెం మెదడు, కొంచెం వెన్నెముక చూపించండి.

Comments are closed.