పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన మాట‌లు!

తెలంగాణ‌లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో డైలాగ్ వార్ జ‌రుగుతోంది. హైద‌రాబాద్‌లో చెరువులు, కుంట‌ల్ని ప‌రిర‌క్షించుకుని, త‌ద్వారా న‌గ‌రాన్ని వ‌ర‌దల నుంచి కాపాడుకుంటామ‌ని రేవంత్‌రెడ్డి స‌ర్కార్ చెబుతోంది. ఈ నేప‌థ్యంలో మూసీ న‌దిని…

తెలంగాణ‌లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో డైలాగ్ వార్ జ‌రుగుతోంది. హైద‌రాబాద్‌లో చెరువులు, కుంట‌ల్ని ప‌రిర‌క్షించుకుని, త‌ద్వారా న‌గ‌రాన్ని వ‌ర‌దల నుంచి కాపాడుకుంటామ‌ని రేవంత్‌రెడ్డి స‌ర్కార్ చెబుతోంది. ఈ నేప‌థ్యంలో మూసీ న‌దిని కాపాడుకోడానికి అక్క‌డి స్థానికుల్ని త‌ర‌లిస్తామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి చెప్ప‌డంపై వివాదం త‌లెత్తింది.

ఈ నేప‌థ్యంలో ఎక్స్ వేదిక‌గా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటైన విమ‌ర్శ‌ల్ని ప్ర‌భుత్వంపై సంధించారు. ఆ పోస్టు సంగ‌తేంటో చూద్దాం.

“పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన‌ మాట‌లు.. పాగ‌ల్ ప‌నులు. వెర‌సి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది

ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అన్న‌ట్లు ప‌రిపాల‌న, అభివృద్ధి చేయ‌డం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్…. త‌నకు అంటిన బుర‌ద‌ను అంద‌రికీ అంటించాల‌ని చూస్తుంది

మూసీ ప్రాజెక్టుతోనే హైద‌రాబాద్ అభివృద్ధి అవుతుంద‌న్న చేత‌కాని ద‌ద్ద‌మ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయంలో (ప‌ర్ క్యాపిటాల్‌) తెలంగాణ దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ అయింది. మూసీ ప్రాజెక్టులో 1,50,000 కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానం సాధించింది. బిల్డ‌ర్ల‌ను, రియ‌ల్ట‌ర్ల‌ను బెదిరించ‌కుండానే ఐటీ ఎగుమ‌తుల్లో బెంగ‌ళూరును హైద‌రాబాద్ దాటేసింది.

మూసీ న‌దికి అటుఇటు అభివృద్ధి, ఆకాశ హార్మ్యాలు క‌డుతున్న‌ప్పుడు మ‌రి ఫోర్త్ సిటీ ఎందుకు? మూసీ ప‌క్క‌న పెట్టుబ‌డి పెట్టేందుకు ఫోర్ బ్ర‌ద‌ర్స్ మ‌నీ స్పిన్నింగ్ కోస‌మా? ఫ్యూచర్ సిటీ అని పొంకణాలు ఎందుకు? ఎత్తైన కుర్చీలో కూర్చుంటేనో.. స‌మావేశాల్లో త‌ల కింద‌కి, మీద‌కి తిప్పితేనో అభివృద్ధి జ‌ర‌గ‌దు

ప్ర‌భుత్వ పాఠ‌శాలలో చ‌దువుకున్నా అంటూ ప్ర‌భుత్వ బ‌డి పిల్ల‌ల ఇజ్జ‌త్ తీయ‌కు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అద్భుత‌మైన ఇంగ్లిష్ మాట్లాడ‌తారు. ప్ర‌పంచ వ్యాప్తంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు” అంటూ రేవంత్‌రెడ్డికి కేటీఆర్ చుర‌క‌లు అంటించారు.

కేటీఆర్ విమ‌ర్శ‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు అప్పుడే ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కిష‌న్‌రెడ్డి , ఈటెల రాజేంద‌ర్ త‌గిన స‌ల‌హాలు ఇస్తామంటే ప్ర‌త్యేకంగా అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌ని ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు. స‌ల‌హాల సంగ‌తేమో గానీ, తీవ్ర విమ‌ర్శ‌ల‌తో ప్ర‌త్య‌ర్థులు విరుచుకుప‌డుతున్నారు.

One Reply to “పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన మాట‌లు!”

Comments are closed.