జానీ మాస్టర్ ఎమోషనల్ వీడియో

నెల రోజులకు పైగా జైళ్లో ఉండి, తాజాగా బెయిల్ పై విడుదలయ్యాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. 37 రోజుల పాటు జైళ్లో ఉన్న జానీ మాస్టర్, తన ఇంట్లో అడుగుపెట్టిన తొలి క్షణాల్ని…

నెల రోజులకు పైగా జైళ్లో ఉండి, తాజాగా బెయిల్ పై విడుదలయ్యాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. 37 రోజుల పాటు జైళ్లో ఉన్న జానీ మాస్టర్, తన ఇంట్లో అడుగుపెట్టిన తొలి క్షణాల్ని వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు.

“ఈ 37 రోజులు మా జీవితాల నుంచి చాలా తీసుకెళ్లిపోయాయి. ఈ రోజుల్లో నా కుటుంబం మొత్తం గడిపిన దుర్భర దశ నా మనసుకు నిత్యం గుచ్చుతూనే ఉంటుంది.” అంటూ ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు జానీ మాస్టర్.

ఇంట్లోకి అడుగుపెట్టకముందే పిల్లలొచ్చి తండ్రిని కౌగిలించుకోవడంతో జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. తన భార్యను పట్టుకొని ఏడ్చేశాడు. సత్యానికి అప్పుడప్పుడు గ్రహణం పడుతుందని, కానీ ఆ వెలుగు మాత్రం ఆగదని, ఏదో ఒక రోజు బయటకొస్తుందని అభిప్రాయపడ్డాడు.

కొన్ని రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకోబోతున్నాడు జానీ మాస్టర్. ఆ తర్వాత తిరిగి సెట్స్ లో అడుగుపెడతాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. ఇకపై జానీ మాస్టర్ లో మరింత ఫైర్ చూస్తారని వాళ్లు చెబుతున్నారు.

4 Replies to “జానీ మాస్టర్ ఎమోషనల్ వీడియో”

  1. ఒక rapistని ఇలా డిఫెండ్ చేస్తున్నారు అంటే మీరు ఒక rapist అవ్వాలి లేకపోతె అతను డబ్బులు ఇచ్చి ఉండాలి. మొదట కారణం నిజం అనుకుంట.

    మీ పత్రిక లో పని చేస్తున్న అమ్మాయిల ను తలుచుకుంటే బాధ వేస్తుంది

Comments are closed.