తిరుప‌తిలో భారీ దోపిడీకి ‘మాస్ట‌ర్ ప్లాన్‌’

ఆధ్యాత్మిక క్షేత్ర‌మైన తిరుప‌తిలో భారీ దోపిడీకి కూట‌మి నేత‌లు ‘మాస్ట‌ర్ ప్లాన్’ వేశారు. వైసీపీ హ‌యాంలో వేసిన మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌కు సంబంధించి స్థ‌లాలు కోల్పోయిన య‌జ‌మానుల‌కు ఇవ్వాల్సిన టీడీఆర్ (ట్రాన్సఫ‌ర‌బుల్ డెవ‌ల‌ప్‌మెంట్ రైట్‌)…

ఆధ్యాత్మిక క్షేత్ర‌మైన తిరుప‌తిలో భారీ దోపిడీకి కూట‌మి నేత‌లు ‘మాస్ట‌ర్ ప్లాన్’ వేశారు. వైసీపీ హ‌యాంలో వేసిన మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌కు సంబంధించి స్థ‌లాలు కోల్పోయిన య‌జ‌మానుల‌కు ఇవ్వాల్సిన టీడీఆర్ (ట్రాన్సఫ‌ర‌బుల్ డెవ‌ల‌ప్‌మెంట్ రైట్‌) జారీని అడ్డు పెట్టుకుని భారీ దోపిడీకి రంగం సిద్ధ‌మైంది. వైసీపీ హ‌యాంలో తిరుప‌తి రూపురేఖ‌లే మారిపోయాయి. న‌గ‌రం న‌లువైపులా మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌ను వేసిన ఘ‌న‌త వైసీపీ ప్ర‌భుత్వానికే చెల్లింది.

తిరుప‌తి టీడీఆర్ బాండ్ల‌లో అవినీతి చోటు చేసుకుంద‌ని నెల్లూరులో టీడీపీ అధికార ప్ర‌తినిధి ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి వివిధ సంద‌ర్భాల్లో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు.

‘తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో సీఎం జగన్ వాటా నిగ్గుతేల్చాలి. సుమారు రూ.పది వేల కోట్ల కుంభకోణం జ‌రిగింది.. తిరుపతిలో ఒక్క ఎకరానికి సుమారు 60 కోట్ల రూపాయలు తీసుకున్నారు. భూమికి సంబంధం లేని వారికి బాండ్లు ఇచ్చారు. తిరుపతి రూపురేఖలు మార్చేసిన ఘ‌న‌త మాకే ద‌క్కుతుంద‌ని భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఆయ‌న కుమారుడు అభిన‌య్‌రెడ్డి గొప్పలు చెప్పుకున్నారు. 18 మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌లో స‌గానికి స‌గం అవ‌క‌త‌వ‌క‌లే. మా ప్ర‌భుత్వం రాగానే ఒక్కొక్క‌రికి తాట తీస్తాం, వ‌సూలు చేస్తాం. టీడీపీ అధికారంలోకి రాగానే టీడీఆర్ బాండ్ల‌పై అన్ని విధాలా విచార‌ణ వుంటుంది’

ఇవీ నాటి ప్ర‌తిప‌క్ష హోదాలో టీడీపీ అధికార ప్ర‌తినిధి ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి నెల్లూరు కేంద్రంగా చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి ఐదు నెల‌లు కావ‌స్తోంది. తిరుప‌తిలో టీడీఆర్ బాండ్ల‌లో అవినీతి దేవుడెరుగు… వాటిని అడ్డు పెట్టుకుని భారీ మొత్తంలో దోపిడీకి మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. ఇక్క‌డ జ‌న‌సేన ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్య నాయ‌కుడి కుమారుడు, అన్న కుమారుడు చ‌క్రం తిప్పుతున్నారు.

తిరుప‌తిలో మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల కోసం మొత్తం 997 మంది నుంచి స్థ‌లాలు తీసుకున్నారు. వీరిలో 297 మందికి టీడీఆర్ బాండ్ల‌ను జారీ చేశారు. ఇంకా 700 మందికి టీడీఆర్ బాండ్లు ఇవ్వాల్సి వుంది. మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌కు స్థ‌లాలు ఇచ్చిన వాళ్లంతా టీడీఆర్ బాండ్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీన్నే అవ‌కాశం తీసుకున్న స్థానిక ప్ర‌జాప్ర‌తినిధి, చిత్తూరు నుంచి వ‌చ్చిన వ‌సూళ్ల బ్యాచ్ ..టీడీఆర్ బాండ్ల‌లో భారీ మొత్తాన్ని పిండుకునే ప‌నిలో ప‌డ్డార‌ని తెలిసింది.

మ‌రీ ముఖ్యంగా డిసెంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి రిజిస్ట్రేష‌న్ చార్జీల‌ను ప్ర‌భుత్వం పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో టీడీఆర్ బాండ్ల రేటు కూడా పెరుగుతుంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యం వ‌సూళ్ల సేన దోపిడీకి మ‌రింత క‌లిసొస్తోంది. Director country and town planning అధికారుల‌ను ప్ర‌లోభ‌పెట్టి, టీడీఆర్ బాండ్ల‌లో భారీ మొత్తంలో దండుకోడానికి మాస్ట‌ర్ ప్లాన్ వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

కూట‌మి నేత‌లు ఆదాయం కోసం ఆవురావుర‌మ‌ని ఎదురు చూస్తున్నారు. ఆదాయ వ‌న‌రులు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయా? అని వాళ్లు భూత‌ద్దం పెట్టి మ‌రీ వెతుకుతున్నారు. టీడీఆర్ బాండ్లపై క‌న్ను ప‌డింది.

ఇప్ప‌టికే కాట‌న్‌మిల్లు ద‌గ్గ‌ర రెండున్న‌ర ఎక‌రాల టీడీఆర్ బాండ్‌కు సంబంధించి రూ.10 కోట్లు అడ్వాన్స్‌గా ఇక్క‌డ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న “వ‌సూళ్ల సేన” ముఖ్య నేత అనుచ‌రులు తీసుకున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ మేర‌కు భూయ‌జ‌మాని, వ‌సూళ్ల సేన నాయ‌కుల మ‌ధ్య రూ.50 కోట్లు ఇచ్చేందుకు అవ‌గాహ‌న కూడా కుదిరిన‌ట్టు స‌మాచారం.

అలాగే తిమ్మినాయుడుపాళెంలో నాలుగు మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌ను వేశారు. ఇక్క‌డ ఒక్క చోటే రూ.400 కోట్లు దోచేందుకు వ‌సూళ్ల సేన భారీ స్కెచ్ వేసిన‌ట్టు తెలిసింది. తిమ్మినాయుడుపాళెం ప‌రిధిలో వ్య‌వ‌సాయ భూముల‌ను క‌న్వ‌ర్ష‌న్ చేయ‌కుండా, వాటి విలువ పెంచి, భూబాధితుల‌ను బెదిరించి భారీ మొత్తంలో టీడీఆర్ బాండ్ల‌లో వాటాలు పొందేందుకు వ‌సూళ్ల సేన అనుచ‌రులు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు చ‌ర్చకు తెర‌లేచింది. పార్టీ పేరు చూస్తే, జ‌నాన్ని ఉద్ద‌రించ‌డానికి అన్న‌ట్టు బిల్డ‌ప్‌, తీరు మాత్రం దోపిడీ అని తిరుప‌తి ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు.

చిత్తూరు నుంచి తిరుప‌తి వ‌చ్చినందుకు భారీ మొత్తంలో గిట్టుబాటు అవుతోంద‌ని వాళ్లంతా ఖుషీ అవుతున్నార‌ని కూట‌మిలోని భాగ‌స్వామ్య ప‌క్షాల నాయ‌కులు ఆరోపిస్తున్నారు. త‌మ‌కు మాత్రం చిల్లిగ‌వ్వ కూడా ఇవ్వ‌డం లేద‌ని వాపోతున్నారు. తిరుప‌తిలో టీడీఆర్ బాండ్ల‌లో దోపిడీపై ఇది పార్ట్-1 క‌థ‌నం.

16 Replies to “తిరుప‌తిలో భారీ దోపిడీకి ‘మాస్ట‌ర్ ప్లాన్‌’”

    1. ఇలాంటి పరమానందయ్య శిష్యుల బ్యాచులకి పచ్చ కళ్ళ పచ్చకామెర్లు కూడా నీలికమర్లు లాగా కనిపిస్తే జై కుక్క జై కమ్మ కుక్కలు జై కాపు కుక్కల సంఘం

  1. అసెంబ్లీ సమావేశాలు …

    నవంబర్ – 11 వ నెల

    తేదీ : 11 తారీకు

    సమయం : 11 గంటలకు

    ఎన్ని రోజులు : 11 రోజులు

    మరి మా జగనన్న టీమ్ 11 మంది వస్తారా ?

    అసెంబ్లీ ని ఫేస్ చేస్తారా ? నిలదీస్తారా తిరుపతి దోపిడీ గురించి ?

  2. tirupati ni ycp develop chesindante dhentho navvalo artham kavatledhu. Abinaya reddy, sajjala, pedhireddy lands chuttu roads vesukuni tirupati chuttu aneste nijam aipodhu

  3. Orey GA ga. Antha khachhitham ga cheputhunnavu kada. mundu assembly ki vachhi avanni adagamanu. Leda prathipaksha hoda ivvaledani mee jaggadu Bangalore vellipothada. Assembly ki vachhe dammu ledu kani………

Comments are closed.