కూటమి ప్రభుత్వం రెండో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. మొదటి విడతలో 21 నామినేటెట్ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే టీటీడీ పాలక మండలిని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇచ్చిన పదవులు తక్కువ, ఇవ్వాల్సినవి ఎక్కువ అని కూటమి నేతలు అంటున్నారు.
ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన కసరత్తు చేశారు. ఈ దఫా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధులు పట్టాభి, జీవీరెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమా తదితర ముఖ్య నేతలకు పదవులు దక్కుతాయా? లేదా? అనే చర్చకు తెరలేచింది. వైసీపీ పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పింది తామే అని జీవీరెడ్డి, దేవినేని, పట్టాభి తదితరుల అభిప్రాయం.
మొదటి విడతలోనే తమకు పదవులు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అనుకూల మీడియా వేదికగా జీవీరెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు. ఇక పట్టాభి విషయానికి వస్తే, భార్యతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి రచ్చ చేశారు. ఒక దశలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని పట్టాభి దంపతులు అనుకున్నారు. పార్టీ పెద్దలు మందలించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దేవినేని ఉమా కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
వైసీపీ నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కోసం సీటును త్యాగం చేసిన తనకు మొదటి జాబితాలో చోటు లేకపోవడం ఏంటనే ఆవేదనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో భర్తీ చేయనున్న నామినేటెడ్ పోస్టుల్లో వీళ్లకు చోటు దక్కుతుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది.
Call boy works 9989793850
నీకు చాల బాధగా ఉ0ది GA,
ఒక్కసారి పట్టాభి bose D K అంటేనే జగ్లక్ ఇప్పటికీ ఏడుస్తున్నాడు…ఇప్పుడు మళ్ళి మీ అన్నను మళ్ళి తిట్టించడానికే కదా ఈ ఆర్టికల్ !!
vc available 9380537747