మ‌ళ్లీ ఐ- ప్యాక్ టీమ్ వ‌స్తోంది!

వైసీపీకి సేవ‌లందించ‌డానికి ఐ-ప్యాక్ టీమ్ మ‌ళ్లీ వ‌స్తోంది. ఇప్ప‌టికే చిన్న‌చిన్న ప‌నుల్ని ఆ సంస్థ వైసీపీకి చేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు కోసం ఐ-ప్యాక్ టీమ్ ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే…

వైసీపీకి సేవ‌లందించ‌డానికి ఐ-ప్యాక్ టీమ్ మ‌ళ్లీ వ‌స్తోంది. ఇప్ప‌టికే చిన్న‌చిన్న ప‌నుల్ని ఆ సంస్థ వైసీపీకి చేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు కోసం ఐ-ప్యాక్ టీమ్ ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్నిక‌ల్లో వైసీపీ బొక్క బోర్లా ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఐ-ప్యాక్ టీమ్ చాప చుట్టేస్తుంద‌ని, ఇక ఆంధ్రా వైపు రాద‌ని అంతా అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌డం లేదు. త్వ‌ర‌లో ఐ ప్యాక్ టీమ్ పూర్తిస్థాయిలో వైసీపీ త‌ర‌పున రంగంలోకి దిగ‌నుంది.

ఇప్ప‌టికే వైసీపీ నిర్మాణంలో అధ్య‌క్షుడికి స‌ల‌హాదారుడిగా ఆళ్ల మోహ‌న్‌సాయిద‌త్ నియ‌మితులైన సంగ‌తి తెలిసిందే. అధికారంలో ఉన్నంత కాలం పార్టీని జ‌గ‌న్ గాలికి వ‌దిలేశారు. స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌కు అనుసంధానంగా నియ‌మించుకున్న వ‌లంటీర్లే త‌న‌కు ఎన్నిక‌ల్లో ప‌ని చేసి పెడ‌తార‌ని జ‌గ‌న్ ఆశించారు. జ‌గ‌న్ అన‌కున్న‌వేవీ ఎన్నిక‌ల్లో ప‌ని చేయ‌లేదు. తాను అధికారంలోకి వ‌స్తే వ‌లంటీర్ల‌కు రూ.10 వేలు ఇస్తాన‌ని చంద్ర‌బాబు ఉగాది ప‌ర్వ‌దినం నాడు ప్ర‌క‌టించారు. దీంతో వ‌లంటీర్లలో చాలా మంది అటు వైపు మొగ్గు చూపారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వ‌లంటీర్ల ప‌రిస్థితి ఏంటో అంద‌రికీ తెలుసు. అస‌లు వాళ్ల గురించి ప‌ట్టించుకునే పాల‌కులే లేరు. రాజ‌కీయంగా వలంటీర్ల‌తో వైసీపీ దెబ్బ‌తిన్న‌ద‌ని, అలాంటి వాళ్లు త‌మ‌కెందుకు? అని కూట‌మి నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి హామీ ఇచ్చారు క‌దా అని ప్ర‌శ్నిస్తే… ఎన్నిక‌ల్లో ఎన్నెన్నో చెబుతుంటాం, అవ‌న్నీ అమ‌ల‌వుతాయ‌ని ఎలా అనుకుంటార‌ని ఎదురు ప్రశ్న వేస్తున్నారు.

వ‌లంటీర్ల‌తో జ‌నానికి మంచి సంగ‌తి ప‌క్క‌న పెడితే, తాము రాజ‌కీయంగా దెబ్బ‌తిన్నామ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. క్షేత్ర‌స్థాయిలో వైసీపీ నిర్మాణం లేకుండా పోయింది. ఇప్ప‌టికీ వైసీపీ స‌భ్య‌త్వంపై దృష్టి పెట్ట‌లేదు. ఈ నేప‌థ్యంలో ఐ-ప్యాక్ టీమ్ మ‌ళ్లీ వైసీపీ త‌ర‌పున ప‌ని చేయ‌డానికి వ‌స్తోంది. గ‌త ఐదేళ్ల‌లో ఐ-ప్యాక్ చెప్పింది ఏదీ జ‌ర‌గ‌లేద‌ని తెలుసు. అయిన‌ప్ప‌టికీ ఏమి ఆశించి ఆ టీమ్‌ను మ‌ళ్లీ తెప్పించుకుంటున్నారో జ‌గ‌న్‌కే తెలియాలి.

16 Replies to “మ‌ళ్లీ ఐ- ప్యాక్ టీమ్ వ‌స్తోంది!”

  1. జగన్ అనే సన్నాసి కేవలం సోషల్ మీడియా లో అబద్ధాలు ప్రచారం చేస్తే చాలు అనే భ్రమ లో బతుకుతున్నాడు మొన్న మోహనా ఊసి మూలన కూర్చోబెట్టిన ఇంకా సిగ్గు రాలేదు

    1. Why do you think Jagan got 40% of votes. It’s not a small number. It’s the 2nd largest party, if you go by this number.

      Out system is wrong. With 40% of votes, ycp did not get a chance to represent 40% of people in assembly, because have only 5% of seats. This shows lacunae in our system. The people are at loss. This should be corrected at constitution level.

  2. IPAC కాకపోతే ZPAC వచ్చిన..గత 5 సంవత్సరాలు తిరిగ్ని రోడ్ లు నీ…టీవీ ఆన్ చేస్తే బూతు మంత్రులు గోల..దొర్జన్యాలు…నీరిద్యగలు… జె బ్రాండ్ . గంజయ, బ్యాచ్ లు , చెత్ పన్నులు…చెప్పుకుంటే పోతే ఎన్నో…ఎవరు.మరిచిపో

    రు..

  3. మీకు పండగ ఎందుకు అంటే వాళ్ళు పుట్టించే అబద్ధాలను మీరు బాగా ప్రచారం చెయ్యివచ్చు.

Comments are closed.