పేరు బాబుది.. పాల‌న ఆయ‌న‌ది కాదు!

చంద్ర‌బాబునాయుడి పాల‌న‌కు ఒక బ్రాండ్ వుంది. చ‌ట్టం అంటే భ‌య‌భ‌క్తుల‌తో చంద్ర‌బాబు న‌డుచుకుంటార‌నే పేరు వుంది. చంద్ర‌బాబు పాల‌న‌లో అడ్మినిస్ట్రేష‌న్ బాగుంటుంద‌ని ప్ర‌త్య‌ర్థులు కూడా ఒప్పుకుంటారు. అయితే 2024లో నాలుగో సారి సీఎంగా బాధ్య‌త‌లు…

చంద్ర‌బాబునాయుడి పాల‌న‌కు ఒక బ్రాండ్ వుంది. చ‌ట్టం అంటే భ‌య‌భ‌క్తుల‌తో చంద్ర‌బాబు న‌డుచుకుంటార‌నే పేరు వుంది. చంద్ర‌బాబు పాల‌న‌లో అడ్మినిస్ట్రేష‌న్ బాగుంటుంద‌ని ప్ర‌త్య‌ర్థులు కూడా ఒప్పుకుంటారు. అయితే 2024లో నాలుగో సారి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబునాయుడు… త‌న మార్క్ పాల‌న చూప‌లేక‌పోతున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

చంద్ర‌బాబు సీఎం ప‌ద‌విలో ఉన్న‌ప్ప‌టికీ, ప‌రిపాల‌న మాత్రం మ‌రెవ‌రో చేస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. మ‌రీ ముఖ్యంగా లోకేశ్ అన్నీ తానై పాల‌న‌లో చ‌క్రం తిప్పుతున్నార‌ని టీడీపీ నాయ‌కులు కూడా ఒప్పుకునే వాస్త‌వం. ఇప్పుడు తానేం త‌క్కువ అంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా అధికారం చెలాయించ‌డానికి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

తాజాగా సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్‌ల వెనుక ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను సంతృప్తిప‌ర‌చ‌డానికే అని టీడీపీ నేత‌లు అంటున్నారు. ఎందుకో గానీ చంద్ర‌బాబు త‌న ఆలోచ‌న‌ల ప్ర‌కారం ప‌రిపాల‌న చేయ‌లేకుండా, ఏవేవో దుష్ట శ‌క్తులు అడ్డుప‌డుతున్నాయ‌ని సొంత పార్టీ నాయ‌కులు వాపోతున్నారు. అందుకే గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా కేవ‌లం ఐదు నెల‌ల్లోనే కూట‌మికి చెడ్డ పేరు వ‌చ్చింద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు త‌న ముద్ర వేసేలా ప‌రిపాల‌న‌ను సాగించాల‌ని జ‌నం కోరుకుంటున్నారు. మొహ‌మాటానికి పోయి, ఆలోచ‌న లేకుండా నిర్ణ‌యాలు తీసుకుంటే, ఏమ‌వుతుందో తాజాగా హైకోర్టులో ఎదురైన చుక్కెదురును టీడీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు.

19 Replies to “పేరు బాబుది.. పాల‌న ఆయ‌న‌ది కాదు!”

  1. పవన్ కల్యాణ్ తో పొత్తు ఉంటే చాలు ఇంకేమి చెయ్యక్కర్లేదు అని అనుకుంటన్నటున్నారు మన బాబు గారు. ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళ ఇంట్లో వాళ్ళని సోషల్ మీడియాలో ఏమీ అనకుండా చూసుకోవడమే కూటమి మొదటి ప్రాధాన్యం అని ఈ మధ్యే జరిగిన పరిణామాలు చూశాం. రాష్ట్రం లో ఆడవాళ్ళ మీద జరిగిన అరాచకాలు ఏమీ పట్టించుకోకుండా డబ్బులు విదిల్చి చేతులు దులుపుకుంటున్నారు.

  2. ప్రభుత్వం మీద వ్యతిరేకత నిజమైతే మీరు మ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి షర్మిల కాంగ్రెస్ కన్నా జగన్ గారి బొమ్మపెట్టి ఎక్కువ ఓట్లు తెచ్చుకోండి కనీసం 25 % ఓట్లు కూడా రావు కూటమి అభ్యర్థులకు 60 % ఓట్లు వస్తాయి

    1. ఎమ్మెల్సీ ఎన్నిక అనేది సహజంగా అభ్యర్థిని బట్టే ఉంటుంది. అవి మొత్తం రాష్ట్రం ప్రజల మూడ్ ని ప్రతిబింబించే ఎన్నికలు కావు సార్

  3. ఓ రే. బ్రో క ర్. …. అ డ్డ వా ళ్లు. అ నే తే డా లే కుం డా బూ తు లు. తి ట్టే వై సి పి

    కు క్క లు కే సు లు పె ట్ట కుం డా వ ది లే యా లా. రా గు ట్లే

Comments are closed.