ప్ర‌వ‌చ‌న‌కారులకూ రాజ‌కీయాశీస్సులు అవ‌స‌ర‌మేనా!

సినిమా, సీరియ‌ల్, ఆట‌, పాట‌.. తెలుగునాట ఏదీ రాజ‌కీయానికి అన‌ర్హం కాదు. దీనికి ప్ర‌వ‌చ‌న‌కారులు కూడా అతీతం కాద‌ని ఇంకోసారి క్లారిటీ వ‌చ్చింది. పీఠాధిప‌తులు, స్వామీజీలు ఏదో ఒక రాజ‌కీయ పార్టీకి అనుకూలంగా ఉండ‌టం…

సినిమా, సీరియ‌ల్, ఆట‌, పాట‌.. తెలుగునాట ఏదీ రాజ‌కీయానికి అన‌ర్హం కాదు. దీనికి ప్ర‌వ‌చ‌న‌కారులు కూడా అతీతం కాద‌ని ఇంకోసారి క్లారిటీ వ‌చ్చింది. పీఠాధిప‌తులు, స్వామీజీలు ఏదో ఒక రాజ‌కీయ పార్టీకి అనుకూలంగా ఉండ‌టం గ‌తంలోంచి కొన‌సాగుతున్న‌దే! ఇప్పుడు టీవీ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించి, సోష‌ల్ మీడియాలో దూసుకుపోతున్న ప్ర‌వ‌చ‌న‌కారుల ఇమేజ్ కూడా ఇప్పుడు రాజ‌కీయ పార్టీలకు అవ‌స‌రంగా మారింది. రాజ‌కీయ పార్టీల ద‌య‌తో ద‌క్కే నామినేటెడ్, కేబినెట్ హోదాల‌పై ప్ర‌వ‌చ‌న‌కారుల‌కూ మ‌న‌సవుతోంది!

ప్రవ‌చ‌న‌కారులు సోష‌ల్ మీడియాలో స‌రంజామాగా మారారు. వారికీ ఫ్యాన్సున్నారు. మ‌రి అలాంటి వ‌ర్గాల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డం కూడా ఒక‌ర‌క‌మైన రాజ‌కీయ వ్యూహ‌మే! ఏదో ఒక హోదా! పోయేదేముంది! స‌చిన్ కు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని ఇచ్చారు, మ‌రి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా స‌చిన్ సాధించిందేమిటి అంటే అబాసుపాల‌వ్వ‌డ‌మే! అలాగ‌ని ఎవ‌రైనా నిల‌దీయ‌రు క‌దా! ప్రవ‌చ‌న కారుల ప‌నే ప్ర‌వచ‌నాలు చెప్ప‌డం, అదే పనికి ఇప్పుడు రాజ‌కీయంతో ద‌క్కుతున్న హోదా!

అయితే స‌ద‌రు ప్ర‌వ‌చ‌న‌కారులు కూడా త‌మ ప్ర‌సంగాల్లో అప్ర‌స్తుతంగా అయినా రాజ‌కీయాల‌ను ప్ర‌స్తావించుకొచ్చారు! తాము ఏ పార్టీని, ఏ నాయ‌కుడిని స‌మ‌ర్థిస్తున్న‌ది చెప్పుకొచ్చారు. స‌ట‌ల్ గా ప్ర‌చారం చేసి పెట్టారు, అందుకు ఇప్పుడు ప్ర‌తిగా ప‌ద‌వులు ద‌క్కుతున్నాయ‌ని ప్రవ‌చ‌నాల‌ను వినే వారు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ మ‌ధ్య‌నే నార్త్ లో బాగా పాపుల‌ర్ అయిన జ‌య‌కిషోరి త‌న ఖ‌రీదైన హ్యాండ్ బ్యాగ్ తో వైర‌ల్ అయ్యింది. ఈమె హిందీ సోష‌ల్ మీడియా జ‌నాల‌కు బాగా తెలుసు. పరిత్యాగం గురించి ఆమె ప్ర‌వ‌చిస్తూ ఉంటారు. అయితే ఆమె వాడే హ్యాండ్ బ్యాగ్ ధ‌ర ల‌క్ష‌ల రూపాయ‌ల్లో ఉంద‌ట‌, దాంతోనే ఆమె ఖ‌రీదైన లైఫ్ స్టైల్ తెలుస్తూ ఉంది. దీంతో నెటిజ‌న్లు రెచ్చిపోయారు! ఒక‌వైపు కోరిక‌ల‌ను చంపుకోవాలి, మోక్షం పొందాలి, ప‌రిత్యాగం చేయాలి అని చెబుతూ ఇదేంటంటూ విరుచుకుప‌డ్డారు. దీంతో ఆమె కౌంట‌ర్ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది!

త‌ను వ‌స్తువుల‌ను వాడొద్ద‌ని చెప్పలేదంది! వ‌స్తు వ్యామోహం కూడ‌ద‌నేది హైంద‌వ ప్ర‌వ‌చ‌నాల్లో ముందుగా చెప్పే విష‌యం. అలాగే ఇన్నాళ్లూ స్వామీజీల రాజ‌కీయాల‌పై కూడా ప్ర‌వ‌చ‌న‌కారులు చ‌తుర్లు వేసేవారు. ఇప్పుడు ప్రవ‌చ‌న‌కారులే రాజ‌కీయ ప‌ద‌వులు పొందుతున్నారు! ఏముంది స‌మ‌ర్థిస్తూ ప్రవ‌చ‌నం చెబితే పోదా!

3 Replies to “ప్ర‌వ‌చ‌న‌కారులకూ రాజ‌కీయాశీస్సులు అవ‌స‌ర‌మేనా!”

  1. తీర్ధమో స్వార్ధమో! ఏదైనా పర్వాలేదు, చాగంటి లాంటి వారికి ఏ పోస్ట్ ఇచ్చినా సమర్ధంగా నిర్వహిస్తారు, హిందూ మతానికి మంచిదే.

Comments are closed.