పరారీలో సీనియర్ నటి

తన నోటి దురుసుతో పోలీసు కేసుల వరకు వివాదాన్ని తెచ్చుకున్న సీనియర్ నటి కస్తూరి పరారైంది. ప్రస్తుతం చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. అంతేకాదు, ఆమె ఫోన్…

తన నోటి దురుసుతో పోలీసు కేసుల వరకు వివాదాన్ని తెచ్చుకున్న సీనియర్ నటి కస్తూరి పరారైంది. ప్రస్తుతం చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. అంతేకాదు, ఆమె ఫోన్ కూడా స్విచాఫ్ లో ఉంది.

అంతఃపురంలో ఉన్న రాణులకు సేవలు చేసేందుకు 300 ఏళ్ల కిందట తెలుగు ప్రజలు తమిళనాడు వచ్చారు.. వాళ్లంతా తమది తమిళజాతి అని చెప్పుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కస్తూరీ. దీంతో తెలుగు సమాజం భగ్గుమంది.

తన వాగుడులో తప్పు గ్రహించిన కస్తూరీ ఆ వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు. డీఎంకేపై నెపం నెట్టే ప్రయత్నం చేశారు. తమ మాటల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికీ వేడి చల్లారకపోవడంతో భేషరతుగా క్షమాపణలు చెప్పారు.

తన క్షమాపణల ప్రకటనతో అంతా సద్దుమణుగుతుందని అనుకుంది కస్తూరీ. కానీ ఆమెపై ఎగ్మూర్, టీ.నగర్ పోలీస్ స్టేషన్లతో పాటు.. మధురై లాంటి ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెకు నోటీసులిచ్చేందుకు పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు.

అయితే అప్పటికే కస్తూరీ పరారైంది. ఆమె ఎక్కడికి వెళ్లిందనేది ఎవ్వరికీ తెలియదు. ఆమె ఫోన్ కూడా స్విచాఫ్ లో ఉంది. పోలీస్ కేసుల నుంచి తప్పించుకునేందుకు, అరెస్ట్ నుంచి బయటపడేందుకు ఆమె ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.

8 Replies to “పరారీలో సీనియర్ నటి”

  1. అమె కరునానిది ఫ్యామిలి ని ద్రుష్టిలొ పెట్టుకొని చెప్పె క్రమం లొ మొత్తం అందరు తెలుగొల్లను కలిపెసింది..

    ఇప్పుడు దూల తిరిపొయింది

    మకు ఇక్కడ గత అయిదెల్లుగా ఒ లం….జ అరిచి అరిచి ఇప్పుడు హెరిటెజ్ నొట్లొ పెట్టారు ..

Comments are closed.