సాయిపల్లవి అతిపెద్ద భయం ఇదే

జీవితంలో ప్రతి ఒక్కరికి భయాలుంటాయి. కొన్ని ఫోబియోలు కూడా ఉంటాయి. దీనికి హీరోహీరోయిన్లు కూడా అతీతం కాదు. నటి సాయిపల్లవికి కూడా అలాంటి ఓ భయం ఉంది. తను పెద్ద హీరోయిన్ అనే గర్వం…

జీవితంలో ప్రతి ఒక్కరికి భయాలుంటాయి. కొన్ని ఫోబియోలు కూడా ఉంటాయి. దీనికి హీరోహీరోయిన్లు కూడా అతీతం కాదు. నటి సాయిపల్లవికి కూడా అలాంటి ఓ భయం ఉంది. తను పెద్ద హీరోయిన్ అనే గర్వం తలకెక్కుతుందేమో అనేది ఈమెకున్న అతిపెద్ద భయం.

“వాస్తవికత మిస్సవుతానేమోనని భయం. ఇండస్ట్రీలో మనల్ని పొగిడేవాళ్లు చాలామంది ఉంటారు. మనల్ని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెడతారు. కానీ ప్రతిసారి నిల్చున్న నేలను గుర్తుచేసుకోవాలి. వాస్తవంగా మనం ఎక్కడున్నామో గ్రహించాలి. రియాలిటీ తెలుసుకొని, మనం కూడా సాధారణ ప్రజలమేనని గుర్తుపెట్టుకోవాలి. ఈ రియాలిటీని ఎక్కడ మరిచిపోతానేమో అని నా భయం.”

ఈమధ్య తండేల్ సినిమాకు సంబంధించి ఫంక్షన్ పెట్టారు. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. అందులో అంతా సాయిపల్లవిని బాక్సాపీస్ క్వీన్ గా చెప్పుకొచ్చారు. ఈ ట్యాగ్ లైన్ పై స్పందించిన సాయిపల్లవి, అదంతా తన గొప్పదనం కాదంటూనే.. విజయ గర్వం ఉండకూడదంటూ పై విధంగా స్పందించింది.

ఆమె నటించిన ‘అమరన్’ సినిమా తాజాగా థియేటర్లలోకొచ్చి హిట్టయింది. రిలీజైన 3 రోజుల్లోనే వంద కోట్లు ఆర్జించి, శివ కార్తికేయన్ ను ఎలైట్ క్లబ్ లోకి చేర్చింది. ఆమె నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుంది.

2 Replies to “సాయిపల్లవి అతిపెద్ద భయం ఇదే”

Comments are closed.