ఒకవైపు తెలుగు స్టార్ హీరోలు ఫార్ములాలు, పడికట్టు సినిమాలతో కొనసాగుతూ ఉన్నారు. 40 యేళ్లలో ఉన్న హీరోలు అయినా అరవై యేళ్ల వయసు హీరోలైనా.. తాము నమ్ముకున్న కమర్షియల్ తంత్రానికే కట్టుబడి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు! మరోవైపు ప్రేక్షకులేమో ఓటీటీల మీద పడ్డారు. ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం దాదాపు ఆపేశారు! సినిమా వినోదం మీద ఎంత ఇష్టం ఉన్నా.. థియేటర్లలో కన్నా ఓటీటీల్లోనే వారికి మంచి వినోదం లభిస్తూ ఉంది. ఇంట్లో ఒక పెద్ద టీవీని ఫిట్ చేసుకుని, ఒక రూమ్ ను అందుకు కేటాయించుకుని థియేటరికల్ ఎక్స్ పీరియన్స్ ను సెట్ చేసుకుని, ఓటీటీ సబ్ స్క్రిప్షన్లతో వారు మంచి వినోదాన్ని పొందుతూ ఉన్నారు!
దశాబ్దాల కిందటి క్లాసిక్స్ తో మొదలుపెడితే, విదేశీ సినిమా, పక్క భాషల సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులకు చేరువ అయ్యాయి. ఎన్ని రోజుల తరబడి చూసినా .. ఇంకా చూడటానికి బోలెడంత కంటెంట్ ఉంది ఓటీటీల్లో! కావాల్సింది వినోదం అయినప్పుడు ఏ భాష అయితేనేం, ఏ హీరో అయితేనేం! కేవలం వీరాభిమాన వర్గాలే ఇప్పుడు థియేటర్ల వైపు వెళ్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఏడాదికి ఒకసారి కూడా థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.
అంతగా తెలుగు సినిమా చూడాలన్నా.. ఎలాగూ విడుదల అయిన వారం పది రోజులకో, కనీసం పక్షం రోజుల్లోపో, అదీ కాదంటే నెలకు అయినా ఓటీటీలోకి వచ్చేస్తుంది అనే భావన ఏర్పడింది. దీంతో ప్రేక్షకులకు ఏవేవో కబుర్లను చెప్పి థియేటర్లకు రప్పించడం దర్శక, నిర్మాతలకు కూడా సాధ్యం కావడం లేదు.
ఇలాంటి నేపథ్యంలో ఓటీటీల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన వారితో సినిమాలు చేయడమే పరిష్కార మార్గం అని సినీనిర్మాతలు, రూపకర్తలు భావిస్తున్నట్టుగా ఉన్నారు! తెలుగు సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలను పక్క భాషల నటీనటులతో చేయించడం కొత్త కాదు. దశాబ్దాల నుంచి ఇది జరుగుతున్నదే! అయితే ఇప్పుడు కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లు, హీరోయిన్లే కాదు.. హీరో పాత్రలకూ ఇప్పుడు పక్క భాషల నటులే అవసరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకించి ఓటీటీల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మలయాళీ, తమిళ నటులే ప్రధాన పాత్రల్లో నటిస్తూ సినిమాలు వస్తూ ఉన్నాయి!
మమ్ముట్టీ తనయుడు దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగునాట హీరోగా దాదాపు సెటిల్ అయినట్టే! దాదాపు పదేళ్ల కిందట అనువాదం అయిన మణిరత్నం సినిమా ఓకే బంగారంతో దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ఇప్పుడు అతడే లీడ్ రోల్ లో సినిమాలు చేసే వరకూ వచ్చింది. విభిన్నమైన కథలను చెప్పాలనే ఆలోచనతో ఉన్న దర్శకులకు, రచయితలకు ఇప్పుడు దుల్కర్ ఒక మంచి ఎంపిక అవుతున్నాడు.
ఇప్పుడు దుల్కర్ చేతిలో మలయాళ సినిమాలు ఎన్ని ఉన్నాయో కానీ, తెలుగు సినిమాలు అయితే రెండు మూడు ఉన్నాయి! అవన్నీ వరసగా విడుదల కావడంతో పాటు ఇతడు మలయాళంలో చేసే సినిమాలు ఇకపై వరసగా అనువాదాలతో డైరెక్ట్ రిలీజ్ లు అయ్యే అవకాశాలు పెరిగాయి. ఇప్పటికే దుల్కర్ చేసిన పలు అనువాద సినిమాలు యూట్యూబ్ లో, ఓటీటీల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. ఇకపై అది మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలుగు దర్శకులు, నిర్మాతలే వెళ్లి డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయడానికి కోరేంత డిమాండ్ ను దుల్కర్ సంపాదించుకున్నాడు!
ఇక మరోవైపు కాంతార హీరో రిషబ్ షెట్టితో తెలుగు డైరెక్ట్ సినిమాకు ఒప్పించుకున్నారట! ఎలాగూ దాన్ని కన్నడలోకి అనువాదమో, లేదా డైరెక్ట్ మేకింగ్ చేసుకునే అవకాశాలుంటాయి. ఇక ధనుష్ ను కూడా ఒక తెలుగు హీరో తరహాలోనే సినిమా మేకర్లు భావిస్తున్నారు. అతడి సినిమాలు అనువాదాలే కాకుండా, తెలుగు సినిమాలు కూడా వస్తున్నాయి! వీరే కాదు పృథ్విరాజ్, ఫహవాద్ ఫాజిల్ లాంటి వాళ్లు ప్రధాన పాత్రలు చేసే తెలుగు సినిమాలు వరసగా రాబోతున్నాయి.
ఓటీటీల ద్వారా దగ్గరైన వారు ఇప్పుడు తెలుగులో ప్రధాన పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. వీటి వెనుక టాలీవుడ్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, దర్శకులు ఉన్నారు! వారే ఇలా ఇతర భాషల నటుల సినిమాలను సమర్పించుకుంటూ ఉన్నారు! మరి ఇందుకు కారణం ఏమిటి అంటే.. నిస్సందేహంగా తెలుగు సినిమా హీరోలు, రూపకర్తలే అని చెప్పవచ్చు.
రొటీన్ కథలతో తెలుగు సినిమా హీరోలతో సినిమాలు చేసి, చేసీ జనాలను విసిగించారు. కొందరు హీరోలు ఎందుకు సినిమాలు చేస్తున్నారో వారికే అంతుబట్టని పరిస్థితి. రెమ్యూనిరేషనే పరమావధిగా వారు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అలా తెలుగు హీరోలు తమ తీరు మార్చుకోలేదు, బహుశా మార్చుకోరు కూడా! ఇలాంటి నేపథ్యంలో వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలు అంటే ఇప్పుడు పక్క భాషల నుంచి హీరోలను కూడా తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది!
ఇది వరకూ అనువాదాలు మాత్రమే, ఇప్పుడు డైరెక్ట్ సినిమాల్లో హీరోల పాత్రల్లో కూడా ఇతర భాషల నటులే దూసుకుపోతున్నారు. తెలుగు హీరోలు మాత్రం తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తం అయిపోయిందని, తామే చేశామని, వందల కోట్లు అని డప్పులు కొట్టుకునే పనిలో ఉన్నారు. చాపకింద నీరులా ఇప్పుడు హీరోల పాత్రలకూ పక్కభాషల నటులే చేరిపోతూ ఉన్నారు! ఇదీ ఒకందుకు మంచిదేనేమో!
టాలెంట్ ఉంటే ఏ భాష వాళ్ళు ఐతే ఏంటి? అల్లు అర్జున్ కి మలయాళం లో ఫాలోయింగ్ ఉంది.
GA …. Telugu industry mida ni kullu kana paduthundi …..! Inka cinema poruginti pulla kura manollaki Baga istam …..!
Prabhas, allu arjun movies vere Industry lo Baga aadutunnay. Vallu poriginti pullagoora anatledu kada brother. Ultimate content manchiga undali
హీరో ఎవడైతే నాకేంటి.. నేను పెట్టిన డబ్బులకి నాకు తగినంత వినోదం దొరికిందా లేదా? అదే ఇంపార్టెంట్. నచ్చకపోతే 2 mins లోపే ఉండే రీల్ నే తిరస్కరిస్తున్నాం. అదీ ఫ్రీగా దొరికే దానిని. 2 + అవర్స్ థియేటర్ లో చూడాలి అంటే అది ఇంకెంత బాగుండాలి. కల్కి థియేటర్ లో చూశా… థియేట్రికల్ experience కోసం… ప్రభాస్ కోసం కాదు. అదే ఆదిపురుష్.. సలార్… రాదేశ్యాం థియేటర్ లో చూడలేదు.. సినిమాలు బాగోలేవని… థియేటర్ లో చూసే సరుకు కాదని. అందుకని .. all makers .. pls focus on content. Not on hero/ cast/ combo.
vc available 9380537747
pi mugguru budabukkalodi la unnaru
ప్రేక్షకులేమో ఓటీటీల మీద పడ్డారు. ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం దాదాపు ఆపేశారు! సినిమా వినోదం మీద ఎంత ఇష్టం ఉన్నా.. థియేటర్లలో కన్నా ఓటీటీల్లోనే వారికి మంచి వినోదం లభిస్తూ ఉంది. ఇంట్లో ఒక పెద్ద టీవీని ఫిట్ చేసుకుని, ఒక రూమ్ ను అందుకు కేటాయించుకుని థియేటరికల్ ఎక్స్ పీరియన్స్ ను సెట్ చేసుకుని, ఓటీటీ సబ్ స్క్రిప్షన్లతో వారు మంచి వినోదాన్ని పొందుతూ ఉన్నారు!
అంతగా సినిమా చూడాలన్నా.. ఎలాగూ విడుదల అయిన వారం పది రోజులకో, కనీసం పక్షం రోజుల్లోపో, అదీ కాదంటే నెలకు అయినా ఓటీటీలోకి వచ్చేస్తుంది అనే భావన ఏర్పడింది.
should AVOID ARAVA HERO’s entry to Tollywood
Why? You’re paying money for entertainment? Whoever gives it take it. How does omit matter what language they talk . If you don’t like them don’t watch it . after globalization no more languages, race , west , east, just enjoy the content
Enjoy yourselves…
You can’t argue with my perspective about Arvara propaganda.
నాకు మాత్రం కమ్మని లంజ, కొజ్జా రెడ్డి , తాడు తెగిన కాపు హీరోలే కావాలి
langu doesn’t matter. We all enjoyed English/ Hindi / Tamil/ Malayalam: Telugu movies. Doesn’t matter whether they came from.?