పాన్ ఇండియా అనే పదం చుట్టూ తిరుగుతున్న టాలీవుడ్, ఈ క్రమంలో కథా వస్తువుల ఎంపికలో పూర్తిగా కొత్త పంథా అనుసరిస్తోంది. ఫిక్షన్ థ్రిల్లర్లు, మైథలాజికల్ థ్రిల్లర్, ఫాంటసీ యాక్షన్, పీరియాడిక్ కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి కథల కోసం భారీగా సెట్స్ నిర్మిస్తోంది. చివరికి పరిస్థితి ఎలా మారిందంటే, పెద్ద సినిమాలకు భారీ సెట్ లేకపోతే పని జరగడం లేదిప్పుడు.
ప్రభాస్ సినిమాల్ని తీసుకుంటే, ఇతడు నటిస్తున్న/నటించబోతున్న ప్రతి సినిమాకు భారీ సెట్ అవసరం. రాజాసాబ్ చేస్తున్నాడు. దీని కోసం దేశంలోనే అతిపెద్ద ఇండోర్ సెట్ నిర్మించారు. ఫౌజీ సెట్స్ పై ఉంది. ఈ పీరియాడిక్ కథ కోసం వందేళ్ల నాటి హైదరాబాద్ ను రీ-క్రియేట్ చేస్తున్నారు. ఇక సలార్-2 కోసం ఖాన్సార్, కల్కి-2 కోసం శంభాలా మరోసారి రెడీ కాబోతున్నాయి.
త్రివిక్రమ్-బన్నీ సినిమా కోసం కూడా భారీ సెట్స్ రాబోతున్నాయి. ఈ సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారట త్రివిక్రమ్. ఇప్పటివరకు రాజమౌళి కూడా చూపించని/చేయని ప్రయత్నంగా దీన్ని అభివర్ణిస్తున్నాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఓ ప్రోమోతో జనవరిలో ఎనౌన్స్ మెంట్ ఉంటుంది. మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్తారు. ఇండియాలోనే ఇప్పటివరకు ఎవ్వరు చూడని విజువల్ వండర్ గా ఈ సినిమా రాబోతోంది.
రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా కోసం కూడా భారీ సెట్ సిద్ధమౌతోంది. మొదటి షెడ్యూల్ ను ఈ నెల్లోనే మైసూర్ లో మొదలుపెడతారు. ఆ తర్వాత షెడ్యూల్ భారీ సెట్ లోకి మారుతుంది. సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ఈ సెట్ లోనే ఉంటుంది. దీని కోసం ఓ ఫిక్షన్ విలేజ్ ను సృష్టించే పనిలో ఉన్నారు.
విశ్వంభర సినిమా కోసం కూడా భారీ సెట్స్ వేశారు. దాదాపు 90 శాతం షూటింగ్ ను ఆ సెట్స్ లోనే పూర్తి చేశారు. అటు రిలీజ్ కు రెడీ అయిన పుష్ప-2 కోసం ఎన్నో సెట్స్ వేశారు. ప్రస్తుతం నడుస్తున్న ఐటెంసాంగ్ షూటింగ్ కోసం కూడా ఫిలింసిటీలో పెద్ద సెట్ వేశారు.
ఇలా పెద్ద హీరోల సినిమాలకే కాదు.. మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఇప్పుడు భారీ సెట్స్ వేయడం కామన్ అయిపోయింది. మట్కా కోసం వింటేజ్ విశాఖను తీర్చిదిద్దారు. 1989 కాలాన్ని ప్రతిబింబించేలా 10 ఎకరాల విస్తీర్ణంలో పూర్ణా మార్కెట్ సెట్ వేశారు. ఇందులో 250 షాపులు.. ఫిష్ మార్కెట్ కింద మరో 150 షాపులు.. ఇంకొన్ని మాంసం దుకాణాలు నిర్మించారు. మార్కెట్ చుట్టూ 4 వీధులు ఏర్పాటుచేశారు. వాటిలో మరో 800 షాపులు.. ఇవన్నీ కలిపి ఓవరాల్ గా 1400 షాపులతో ఈ సరికొత్త ప్రపంచం వెలసింది.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ కోసం ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించారు. నిఖిల్ స్వయంభూ, తేజ సజ్జా మిరాయి, సిద్ధు జొన్నలగడ్డ కోహినూర్ సినిమాలతో పాటు.. సాయిదుర్గతేజ్, విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీస్ కోసం భారీ సెట్స్ వెలుస్తున్నాయి. ఇలా టాలీవుడ్ లో మీడియం నుంచి హెవీ బడ్జెట్ సినిమాల వరకు అన్నీ భారీ సెట్స్ లోనే నడుస్తున్నాయి.
Vishwambhara movie hit avthundhi, pushpa 2 hit
పొలిటికల్ కంటెంట్ లేకపోవడంతో రోజు రోజుకి సొల్లు ఆర్టికల్స్ ఎక్కువవుతున్నాయి….
Call boy jobs available 9989793850