అనుష్క శెట్టి.. మొన్ననే 44వ ఏట అడుగుపెట్టింది. త్రిష.. మొన్న వేసవికి 41 ఏళ్లు పూర్తి చేసుకుంది. సదా.. రీసెంట్ గా 40 క్రాస్ అయింది..
ఓవైపు హీరోయిన్లంతా 30 ఏళ్లకు అటుఇటుగా పెళ్లి చేసుకొని, మరోవైపు కెరీర్ కూడా కొనసాగిస్తుంటే.. వీళ్లు మాత్రం 40 దాటినా ఇంకా పెళ్లి ఊసెత్తడం లేదు. ఇది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం. కాబట్టి వాళ్లెందుకు ఇప్పటివరకు పెళ్లిళ్లు చేసుకోలేదనేది రహస్యం. అయితే బయటకు వినిపించే కథనాలు మాత్రం చాలానే ఉన్నాయి.
అనుష్క శెట్టినే తీసుకుంటే.. ఈ ముద్దుగుమ్మపై చాలా ఏళ్ల కిందటే డేటింగ్ పుకార్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా ప్రభాస్ తో ఈమె ప్రేమలో ఉందంటూ ఏళ్లుగా ప్రచారం నడిచింది. ఒకదశలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారంతా. కానీ తామిద్దరం స్నేహితులం మాత్రమేనని విడివిడిగా ప్రకటించింది ఈ జంట.
ఇక రీసెంట్ గా అనుష్క పెళ్లిపై మరో పుకారు కూడా వచ్చింది. దర్శకుడు క్రిష్ ను ఆమె వివాహం చేసుకోబోతున్నట్టు పుకార్లు రేగాయి. దీనిపై కొన్ని రోజుల కిందట అనుష్క క్లారిటీ ఇచ్చింది. క్రిష్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని ప్రకటించింది.
అటు క్రిష్ కూడా త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. తన కమ్యూనిటీకే చెందిన ఓ డాక్టర్ ను అతడు వివాహం చేసుకోబోతున్నాడు. అయితే అనుష్క ఎందుకు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదనేది ఆమెకు మాత్రమే తెలుసు.
త్రిష సంగతి సరేసరి. దశాబ్దానికి పైగా ఈమె పెళ్లిపై రూమర్లు వస్తూనే ఉన్నాయి. గతంలో రానాతో డేటింగ్ అన్నారు. ఆ తర్వాత ఓ తమిళ హీరో పేరు చెప్పారు. మధ్యలో దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి అంటూ కథనాలొచ్చాయి. ఇలా ఎన్ని పుకార్లు రేగినా, తన బ్యాచిలర్ లైఫ్ ను ఆమె సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూనే ఉంది. కొన్ని నెలల కిందట ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “అసలు పెళ్లెందుకు” అంటూ త్రిష ప్రశ్నించడం అనుమానాలకు తావిచ్చింది.
సదా కూడా తన పెళ్లిపై రీసెంట్ గా క్లారిటీ ఇచ్చింది. పెళ్లికి తను వ్యతిరేకం కాదంటూనే, మనసుకు నచ్చిన వాడు దొరకలేదంటోంది. 40 ఏళ్లొచ్చినా పెళ్లిపై తనకు ఎలాంటి ఆలోచనల్లేవని, ప్రస్తుతం లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తున్నానని తెలిపింది. ఇప్పుడున్న స్టేజ్ లో తను హ్యాపీగా ఉన్నానని, పెళ్లి చేసుకుంటే ఇంకాస్త ఎక్కువ సంతోషం దక్కుతుందనే గ్యారెంటీ లేదంటోంది.
ఇలా చెప్పుకుంటూపోతే ఇండస్ట్రీలో 40 ఏళ్లు దాటినా పెళ్లికి దూరంగా ఉన్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కిరణ్ రాథోడ్ (43), టబు (53), నగ్మా (49) లాంటి తారలు ఇంకా పెళ్లిళ్లు చేసుకోలేదు. వీళ్లలో టబు, నగ్మా పెళ్లిపై తమ విముఖతను ఇప్పటికే బయటపెట్టిన సంగతి తెలిసిందే.
Don’t go by wikipedia. Anushka is 48 now. Her real YOB is 1976.
Unmarried women are not called bachelors. Usually referred to as Spinster.
Spinsters
Kontha mandhi yekkuva kalam movie industry lo continue avadam kosam heroines avakasam kosam pelli chesukoru
మన లేడీ సూపర్ స్టార్ పెళ్ళి విషయాన్ని మీడియా ఎంతగానో దాచి పెట్టింది.ఇప్పటికీ ఆమె కుమారి అనే రాస్తుంటుంది. హత విధి!
ippudendi.. nuvvu tagulukuntava?