వీళ్లు ఐపీఎస్‌, ఐఏఎస్‌లు కాదా ప‌వ‌న్‌?

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌లు చ‌క్క‌గా చెబుతుంటారు. ప‌వ‌న్ నీతి సూక్తులు వింటే, విన‌డానికి ఎంత బాగుంటాయో! త‌మ కార్య‌క‌ర్త‌ల‌పై కూట‌మి స‌ర్కార్ కేసులు పెడుతుంటే, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇటీవ‌ల ఘాటుగా స్పందించారు. అన్యాయంగా…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌లు చ‌క్క‌గా చెబుతుంటారు. ప‌వ‌న్ నీతి సూక్తులు వింటే, విన‌డానికి ఎంత బాగుంటాయో! త‌మ కార్య‌క‌ర్త‌ల‌పై కూట‌మి స‌ర్కార్ కేసులు పెడుతుంటే, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇటీవ‌ల ఘాటుగా స్పందించారు. అన్యాయంగా కేసులు పెట్టే ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టేది లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న‌దైన స్టైల్‌లో స్పందించారు.

ప‌వ‌న్ ఏమ‌న్నారంటే…

“తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడు స‌ప్త స‌ముద్రాల ఆవ‌త‌ల ఉన్నా వ‌ద‌ల‌మ‌ని జ‌గ‌న్ అంటున్నారు. డీజీపీ రిటైర్ అయినా వ‌దిల‌పెట్ట‌బోమ‌ని బెదిరింపు ధోర‌ణిలో మాట్లాడుతున్నారు. అధికారుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం అని విధాలా అండ‌గా వుంటుంది. మ‌రోసారి హెచ్చ‌రిక‌లు వంటివి చేస్తే సుమోటోగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. అధికారుల‌పై ఈగ వాలినా వారే బాధ్య‌త వ‌హించాల్సి వుంటుంద‌ని హెచ్చ‌రించారు”

ఇక్క‌డ ప‌వ‌న్ గుర్తించుకోవాల్సిన విష‌యం ఒక‌టుంది. గ‌తంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాసిన లేఖ‌లో 27 మంది ఐఏఎస్‌లు, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వ‌కుండా ప‌క్క‌న పెట్టార‌ని పేర్కొన్నారు. మ‌రి వీళ్ల గురించి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ప‌ట్ట‌దా? వైసీపీ స‌ర్కార్‌తో అంట‌కాగార‌నే కార‌ణంతో ఇంత మంది ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌ను ప‌క్క‌న పెట్ట‌డం ప‌వ‌న్‌కు మంచి నిర్ణ‌యంగా అనిపిస్తోందా?

రాష్ట్రంలో స‌మ‌ర్థ‌వంత‌మైన అధికారుల్ని పెట్టుకుని, ప‌క్క రాష్ట్రాల నుంచి ఎందుకు తెచ్చుకోవాల్సి వ‌చ్చిందో ప‌వ‌న్ స‌మాధానం చెప్పాలి. పోస్టింగ్‌లు ఇవ్వ‌కుండా ప్ర‌భుత్వం ప‌క్క‌న పెట్ట‌డం వేధింపుల కిందికి రాదా? ఏదో ఒక‌టి విమ‌ర్శ చేయాల‌నే అత్యుత్సాహం త‌ప్పిదే, త‌మ ప్ర‌భుత్వం చేస్తున్న‌ది ఏ మాత్రం స‌రైందో ప‌వ‌న్ ఒక్క‌సారి ఆలోచిస్తే మంచిది.

24 Replies to “వీళ్లు ఐపీఎస్‌, ఐఏఎస్‌లు కాదా ప‌వ‌న్‌?”

  1. నువ్వు రాసిన రోత రాతలు చదువుతుంటే.. ఏ బి వెంకటేశ్వర్ రావు గుర్తొచ్చాడు..

    జగన్ రెడ్డి చేసిన పాపాలు మర్చిపోతే ఎలా వెంకటి..

    1. అస్సలు నీ సమస్య ఏంటి ,Pawan kalyan మాట్లాడితే చాలు వెంటనే రియాక్ట్ అవుతావు, జగన్ మాట్లాడితే సపోర్ట్ చేస్తావ్

      1. మీరేమి చెప్పదలచుకొన్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు..

        జగన్ రెడ్డి కి నా జన్మలో సపోర్ట్ చేయను.. నేను సచ్చిపోతాను గాని.. జగన్ రెడ్డి వెనక అస్సలు నిలబడను ..

        పవన్ కళ్యాణ్ కి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.. నేను టీడీపీ మనిషినే కానీ.. పవన్ కళ్యాణ్ ని ఒక వ్యక్తిగా ఇష్టపడతాను..

  2. ఒరేయ్ గూట్లే …జగన్ రాసేవి నమ్ముతున్నావా. అప్పట్లో32 కమ్మ డీస్పీ అన్నాడు. ఎక్కడ ఉన్నారు ఆ 32 మంది?

  3. ఏం చెప్పారండీ… గనుల డైరెక్టర్, లిక్కర్, టీటీడీ, మున్సిపల్ ఇవన్నీ మీ ప్రభుత్వంలో పక్క రాష్ట్రాల అధికారుల్ని తెచ్చుకున్నారు…

  4. షర్మిల, విజయమ్మని కూడా వదలకుండా బూ.-.తు.-.లు రాసిన భా.-.ర.-.తి పీఏ వర్రా రవీంద్రనాద్ రెడ్ది అర్రెస్త్! ఈ వార్త ఎది GA?

  5. ఏరా మీరు అధికారంలో వున్నపుడు గుడిలో పూజాలేమైనా చేసారా టీడీపీ/jsp కార్యకర్తల మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టారో మర్చిపోయావా. ప్రశ్నించ్చినందుకు కే సులు పెట్టారు వాట్సాప్ మెసేజ్ షేర్ చేసినందుకు కే సులు పెట్టడం మర్చిపోయామనుకుంటావా

  6. సప్త సముద్రాలు దాటినా వదలం – జగన్ రెడ్డి సప్త సముద్రాలు పక్కనపెట్టు

    , నువ్వు ఒక సముద్రం దాటాలంటే కోర్ట్ స్టే తెచ్చుకోవాలి. అసీంబ్లీకి రావాలంటే ప్రతిపక్చ హోదా కావాలి.. సీఎం అవ్వాలంటే ఎవరినో ఒకర్ని చంపాలి.. ఇంకా నువ్వు ఏంది చేసేది జగన్ రెడ్డి? ఎవరు నీ మేకపోతు గాంబీర్యంకి బయపడేది.. 3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ అన్నావ్, ఫస్ట్ దాని సంగతి చూడు .

  7. నువ్వు మారవా రా, ఎప్పుడు మారుతావ్ రా……. జనానికి పనికొచ్చే న్యూస్ ఎప్పుడైనా రాస్తావని చూస్తున్నా కానీ ఈజన్మ కి నువ్వు రాసేటట్టుగాలేవు.

Comments are closed.