పుష్ప 2.. రన్.. రన్.. రన్

కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నట్లు వుంది పుష్ప 2 పరిస్థితి. విడుదల తేదీ 20 రోజుల్లోకి వచ్చేసింది. కానీ చివరి అయిదు రోజులు లెక్కలోకి తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఓవర్ సీస్ కు కంటెంట్…

కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నట్లు వుంది పుష్ప 2 పరిస్థితి. విడుదల తేదీ 20 రోజుల్లోకి వచ్చేసింది. కానీ చివరి అయిదు రోజులు లెక్కలోకి తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఓవర్ సీస్ కు కంటెంట్ లోడ్ చేసి పంపడం వంటి వ్యవహారాలు వుంటాయి. అంటే మిగిలింది 15 రోజులే. కానీ డే అండ్ నైట్ మూడు యూనిట్ లు ఇంకా షూటింగ్ జ‌రుపుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క లాక్ చేసిన తొలి సగం రీ రికార్డింగ్ పని జ‌రుగుతోంది.

సినిమా ట్రయిలర్ డేట్ ఇచ్చారు. ఇక సుడిగాలి పర్యటన మాదిరిగా హీరో అల్లు అర్జున్ దేశం అంతటా కీలక పట్టణాల్లో తిరిగి సినిమాకు ప్రచారం చేయడానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అదే మంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే సినిమాకు ఇప్పటికే ఇనఫ్ బజ్ వుంది. జ‌స్ట్ జ‌నాలకు సినిమా వస్తోందని తెలిస్తే చాలు. కానీ హీరో కు ఓ పర్సనల్ ఇమేజ్ వుంటుంది. ఇమేజ్ బిల్డింగ్ వుంటుంది కనుక, పాన్ ఇండియా సినిమా కనుక అన్ని చోట్లకు వెళ్లి రావాల్సిందే.

ఈసారి కూడా దర్శకుడు సుకుమార్ సినిమా ప్రచారానికి దూరం అనే అనుకోవాలి. ఎందుకంటే ఇంకా ఫైనల్ కాపీ లాక్ చేయడం, చేసిన అర్అర్ ను చూసుకోవడం, సరిపోని చోట మళ్లీ చేయించుకోవడం, ఫైనల్ కరెక్షన్, మిక్సింగ్, అన్ని భాషల డబ్బింగ్ ఇలా చాలా పనులు వున్నాయి. ఇవన్నీ ఉరుకులు పరుగులు పెడుతూ చేయాల్సిందే. అందువల్ల సుకుమార్ పెద్దగా ప్రీ పబ్లిసిటీలో కనిపించే అవకాశాలు తక్కువే.

నిర్మాతలు కూడా 600 కోట్ల థియేటర్ మార్కెట్ అంతా చూసుకోవాలి. పేమెంట్లు, సెటిల్ మెంట్లు, అన్నీ చూసుకోవాలి. అందువల్ల వారికి కూడా అంత తీరుబాటు కష్టమే. 17 పాట్నాతో బన్నీ టూర్ ప్రారంభం అవుతుంది. అంటే 17 లోపు బన్నీ వర్క్ అంతా క్లోజ్ చేయాలి. అక్కడి నుంచి రెండు వారాల పాటు బన్నీ సినిమా పబ్లిసిటీ మీదే వుండాల్సి వుంటుంది.

8 Replies to “పుష్ప 2.. రన్.. రన్.. రన్”

Comments are closed.