ప్రభాస్- మారుతి- పీపుల్స్ మీడియా కాంబినేషన్ భారీ సినిమా ‘రాజా సాబ్’. ఈ సినిమా విడుదల డేట్ అయితే ఏప్రిల్ 10 అని ఇప్పటికే ప్రకటించేసారు. సినిమా షూట్ చాలా వరకు జరిగింది, జరుగుతోంది. ఎప్పటికప్పుడు ప్రభాస్ లేని సీన్లు తీసుకుంటూ వెళ్లిపోతున్నారు. ప్రభాస్ డేట్ లు దొరికినపుడు అతని సీన్లు తీస్తున్నారు. మొత్తం మీద షూటింగ్ మాత్రం ‘కంఫర్టబుల్’ గా జరుగుతోంది. అ విధంగా చూసుకుంటే సినిమా విడుదల డేట్ మారే అవకాశం లేదు. అ టెన్షన్ కూడా లేదు.
కానీ సినిమా అనుకున్న డేట్ కు రాదని టాలీవుడ్ లో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డేట్ తెలిసి కూడా మరికొన్ని సినిమాలు డేట్ లు వేస్తున్నాయి. అంతగా ప్రభాస్ సినిమా వస్తే అప్పుడు చూసుకుందాం అనే అలోచనతో కూడా డేట్ లు వేస్తున్నాయి.
ఇదిలా వుంటే రాజా సాబ్ సినిమాలో రెండు పెద్ద ఎపిసోడ్ లకు సిజి వర్క్ చాలా వుంది. అసలు అ మాటకు వస్తే సినిమాలో అధికభాగం సిజి అవసరం అయినదే. ఇప్పుడు కీలకమైన ఈ రెండు ఎపిసోడ్ ల సిజి పనులు ఇంకా మొదలు కాలేదని తెలుస్తోంది. మరి ఈ పనులు పీపుల్స్ మీడియా అనుబంధ సంస్థ పీపుల్ టెక్ చేస్తుందా? లేక వేరే వాళ్లకు ఇస్తారా అన్నది డిసైడ్ కావాల్సి వుందని తెలుస్తోంది.
కీలకమైన ఎపిసోడ్ లు, క్వాలిటీ బాగా వచ్చి తీరాలి కనుక, అ రంగంలో అనుభవం బాగా వున్న పెద్ద సంస్థకు ఇవ్వాలన్నది హీరో ప్రభాస్ సూచన అని తెలుస్తోంది. రెండు సీన్ల సిజి వర్క్ లు ఏదో ఒక సంస్థకు ఇవ్వాలి. వాళ్లు చేసిన తరువాత ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్ చేసుకోవాలి. అప్పుడు ఓ క్లారిటీ వస్తుంది ఇదంతా అయిదు నెలల్లో జరగదా అనే వారు టాలీవుడ్ లో వున్నారు. జరగడం కష్టం అనే వారు వున్నారు.
vc estanu 9380537747
Call boy jobs available 9989793850
రాలేకపోతే ఓటిటిలో అప్ లోడ్ చెయ్యండి