వ‌చ్చే ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీ!

కూట‌మి స‌ర్కార్ కొలువుదీరిన త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 16 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీ చేప‌ట్టేందుకు ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ కూడా ఇచ్చింది. ఇటీవ‌లే…

కూట‌మి స‌ర్కార్ కొలువుదీరిన త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 16 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీ చేప‌ట్టేందుకు ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ కూడా ఇచ్చింది. ఇటీవ‌లే ప్ర‌భుత్వం టెట్ ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించింది. డీఎస్సీ ప‌రీక్ష‌ల కోసం నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌పై స‌భ్యులు ప్ర‌శ్న‌లడిగారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స‌మాధానం ఇస్తూ… టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత 11 డీఎస్సీలు నిర్వ‌హించార‌న్నారు. సుమారు 1.50 ల‌క్ష‌ల ఉపాధ్యాయుల‌ను నియ‌మించామ‌న్నారు. సీఎంగా చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడు 9 డీఎస్సీలు నిర్వ‌హించార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక టెట్ త‌ర్వాత డీఎస్సీ నిర్వ‌హించాల‌ని అనుకున్న‌ట్టు లోకేశ్ తెలిపారు. ముందే ప్ర‌క‌టించిన‌ట్టుగా 16 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు భ‌ర్తీ చేస్తామ‌ని మంత్రి తెలిపారు.

గ‌తంలో డీఎస్సీపై కొన్ని కోర్టు కేసులున్న‌ట్టు మంత్రి తెలిపారు. ఆ కేసుల గురించి అధ్య‌య‌నం చేయాల‌ని అధికారుల్ని ఆదేశించిన‌ట్టు మంత్రి తెలిపారు. ఇందుకు కొంత స‌మ‌యం కావాల‌ని అధికారులు త‌న‌ను అడిగిన‌ట్టు మంత్రి చెప్పారు. వ‌చ్చే ఏడాది ఉపాధ్యాయ పోస్టుల‌న్నీ భ‌ర్తీ చేస్తామ‌ని లోకేశ్ తెలిపారు.

4 Replies to “వ‌చ్చే ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీ!”

  1. మొదటి సంతకం మెగా DSC కూడా వాయిదా వాయిదా మంగళం … దీన్ని కూడా next year కు సాగతీత… Objection ఉంటే court stay order ద్వారా ఆపుతారు.. ఇక్కడ govt ఎందుకు postpone chestundi.. Should have continued the jagan govt. Dsc notification by this time many could have got jobs..

Comments are closed.