మ‌రో అల్ప‌పీడ‌నం.. రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు!

బంగాళాఖాతంలో అల్ప పీడ‌న ప్ర‌భావంతో తిరుప‌తి, నెల్లూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. మంగ‌ళ‌వారం నుంచే వ‌ర్షాలు ప‌డుతున్నాయి. అల్ప పీడ‌నం ముందుకు క‌దులుతున్న కొద్దీ మ‌రో మూడు రోజులు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం…

బంగాళాఖాతంలో అల్ప పీడ‌న ప్ర‌భావంతో తిరుప‌తి, నెల్లూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. మంగ‌ళ‌వారం నుంచే వ‌ర్షాలు ప‌డుతున్నాయి. అల్ప పీడ‌నం ముందుకు క‌దులుతున్న కొద్దీ మ‌రో మూడు రోజులు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం వుంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది.

ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో 12 జిల్లాల్లో అల్ప పీడ‌న ప్ర‌భావంతో వ‌ర్షాలు ప‌డుతున్నాయి. తిరుప‌తి, తిరుమ‌ల‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో కూడా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండంగా మారితే వ‌ర్ష ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండొచ్చ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది.

వాతావ‌ర‌ణ‌శాఖ నివేదిక ప్ర‌కారం మ‌రో మూడు రోజుల పాటు రాయ‌ల‌సీమ‌, ద‌క్షిణ కోస్తా జిల్లాల్లో వ‌ర్షాలు ప‌డొచ్చు. భారీ వ‌ర్షాల‌కు ఎలాంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. రాయ‌ల‌సీమ‌లో కొన్ని పంట‌ల‌కు ఈ వ‌ర్షం ఎంతో అవ‌స‌రం అని రైతులు చెబుతున్నారు. మ‌రోవైపు వ‌ర్షానికి వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి.

ఇదే రీతిలో వ‌ర్షాలు కొన‌సాగితే, ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా అధికారులు ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మ‌త్స్య‌కారుల్ని వేట‌కు వెళ్లొద్ద‌ని అధికారులు హెచ్చ‌రించారు.

6 Replies to “మ‌రో అల్ప‌పీడ‌నం.. రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు!”

Comments are closed.