ఎందుకు తెగాయి.. ఎందుకు తెగడం లేదు?

ప్రేక్షకులు చిత్రంగా వున్నారు. ఏ సినిమాను చూస్తారో, ఏ సినిమాను చూడరో అన్నది మేకర్లకు అంతు పట్టడం లేదు.

ప్రేక్షకులు చిత్రంగా వున్నారు. ఏ సినిమాను చూస్తారో, ఏ సినిమాను చూడరో అన్నది మేకర్లకు అంతు పట్టడం లేదు. టీజర్ వచ్చినపుడు ఎందుకు డిసైడ్ అవుతున్నాడో ప్రేక్షకుడు అన్నది అంతు పట్టడం లేదు. రొటీన్, రొట్ట సినిమాలు ఇష్టపడడం లేదు. అది వాస్తవం. ఓకె, మరి డిఫరెంట్ మూవీలు వస్తుంటే పరుగెత్తుకు వెళ్తున్నాడా? అంటే అదీ లేదు. పెద్ద హీరో అయినా బచ్చన్ సినిమా పక్కన పెట్టారు.. సరే రొటీన్ రొట్ట సినిమా అని. అమరన్, లక్కీ భాస్కర్ కు మంచి డబ్బులు ఇచ్చారు. క సినిమాను దాని లెక్కల మేరకు చూసుకుంటే మంచిగానే ఆదరించారు.

గమ్మత్తేమిటంటే అమరన్ కు మంచి ఓపెనింగ్, క, లక్కీ భాస్కర్ కు డీసెంట్ ఓపెనింగ్ ఇచ్చారు. క సినిమా మిస్టిక్ థ్రిల్లర్ జానర్ కనుక ఆ మాత్రం ఓపెనింగ్ ఇచ్చారు అనుకుందాం. దుల్కర్, మీనాక్షి కోసం లక్కీ భాస్కర్ కు, సాయిపల్లవి కోసం అమరన్ కు కాస్త మంచి ఓపెనింగ్ ఇచ్చారనుకుందాం.

మరి కంగువ సినిమా సంగతి ఏమిటి? దానికి మంచి బజ్ నే వుంది. సూర్య అంటే మన వాళ్లకు మంచి అభిమానం వుంది, పైగా భారీ సినిమా, వైవిధ్యమైన సబ్జెక్ట్ మరి దాని వైపు ఎందుకు అంతలా తొంగి చూడడం లేదు?

మట్కా సినిమా వస్తోంది. పక్కా వైవిధ్యమైన సినిమా, పీరియాడిక్ సబ్జెక్ట్, మెగా హీరో, ఇంతో అంతో తెలిసిన దర్శకుడు. పబ్లిసిటీకి లోటు లేదు. మరి ఎందుకు జనం కాస్త తక్కువగానే టికెట్ విండో కి రియాక్ట్ అవుతున్నారు?

కల్కి వచ్చిన వెంటనే వచ్చిన సినిమాలకు రాలేదు అంటే పెద్ద సినిమాలకు డబ్బులు పెట్టేసారు కదా అనే ఆన్సర్ వుంది. దేవర తరువాత కాస్త గ్యాపే వున్నా జనం వచ్చారు. ఇప్పుడు ఏమని అనుకోవాలి అంటే, జనం రాబోయే పుష్ప 2 సినిమా కోసం డబ్బులు దాచుకుంటున్నారేమో అనుకోవాలి.

మరి ఒక వేళ మట్కా, కంగువ సినిమాలకు మంచి మౌత్ టాక్ వస్తే.. అప్పుడు థియేటర్ వైపు వస్తారేమో? తరువాత రావడం సంగతి అలా వుంచితే ముందు ఎందుకు టర్న్ అవడం లేదు? ఎన్ని ఈక్వేషన్లు చూడాలి ఇలా అయితే. బ్యానర్.. కాస్టింగ్.. దర్శకుడు.. జానర్.. ఇలా అన్నీ కలిపి సినిమా చేయాలంటే ఇక అందరి వల్లా అవుతుందా?

టాలీవుడ్ ఎటు వెళ్తోంది అన్నది కాదు క్వశ్చను. జనాల మైండ్ సెట్ ఎలా రీడ్ చేయాలి అన్నదే అతి పెద్ద పజిల్.

18 Replies to “ఎందుకు తెగాయి.. ఎందుకు తెగడం లేదు?”

  1. కంగువ ఏమిటి, ఈమధ్య తమిళ సినిమాలు దేని వైపు చూడడంలేదు. అదేదో మణిరత్నం సినిమా, మోహనలాల్ సినిమాలు పెద్దగా మెప్పించలేదు, అది కూడా కారణం అయి ఉండొచ్చు!

  2. Amaran is Tamil film, not telugu film. KA is average film. Climax is good. Mature family audience does not go to films just for good climax. Youth audience saw the film. It became success because of its low budget, huge promotions, sympathy factor on Kiran Abbavaram and long weekend. Same film will not break even for a big hero with big break even number.

  3. మట్కా అంటేనే ఫామిలీ ఆడియన్సు దూరం. పేరు లోనే అంత వుంది. కంగువా ఎదో కండువా ల పేరు బాలే, తెలుగు పేరు పెట్టాల్సింది. మౌత్ టాక్ ని బట్టి పిక్ అవ్వొచ్చు.

  4. దీపావళికి వచ్చిన మూడు సినిమాలు హిట్. వాటిని జనం ఒకదాని తర్వాత మరొకటి చూసేశారు. సినిమాలు బాగున్నాయనే టాక్ తో. రెండు వారాల్లోనే సో… కొంత గ్యాప్ తీసుకుంటే తప్ప చూడటం కష్టం. మరీ అమోఘంగానే ఉందంటే తప్ప. కంగువా, మట్కా సినిమాలకు డివైడ్ టాక్ దెబ్బకొట్టేసింది.

Comments are closed.