వారానికి ఎంత తాగొచ్చంటే.. వైద్య ప‌రిశోధ‌న మాట‌!

తాగుడు నిస్సందేహంగా ఆరోగ్యానికి హానిక‌రం. అనేక మంది వైద్యులు చెప్పే మాట‌. ప్ర‌భుత్వాలు కూడా చెప్పే మాట‌. అయితే ప్ర‌భుత్వాలుకు ఇప్పుడు తాగుడే ఆదాయం. ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం అమ్మినా, టెండ‌ర్లు పిలిచినా, ప్ర‌భుత్వాల‌ను న‌డిపే…

తాగుడు నిస్సందేహంగా ఆరోగ్యానికి హానిక‌రం. అనేక మంది వైద్యులు చెప్పే మాట‌. ప్ర‌భుత్వాలు కూడా చెప్పే మాట‌. అయితే ప్ర‌భుత్వాలుకు ఇప్పుడు తాగుడే ఆదాయం. ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం అమ్మినా, టెండ‌ర్లు పిలిచినా, ప్ర‌భుత్వాల‌ను న‌డిపే ఇంధ‌నం ప్ర‌జ‌ల తాగుడు వ్య‌స‌న‌మే! ప్ర‌త్యేకించి ద‌క్షిణాది రాష్ట్రాలు క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌లో ప్ర‌భుత్వాల‌కు ప్ర‌జ‌లు తాగి ఊగితేనే, గ‌ల్లా పెట్టె నిండేది! అలా వ‌చ్చిన డ‌బ్బుతోనే సంక్షేమం అయినా, మ‌రోటి అయినా!

ఆ సంగ‌త‌లా ఉంటే.. వీధి వీధికీ ఒక బెల్ట్ షాపు వ‌చ్చేసింద‌ని, 24 గంట‌లూ మ‌ద్యం దొరుకుతోంద‌ని, ఆఖ‌రికి కూల్ డ్రింక్ షాపుల్లో కూడా బీర్ ల‌ను పెట్టి అమ్ముతున్నార‌ని.. ఎడా పెడా తాగేయ‌కండి అంటున్నాయి ప‌రిశోధ‌న‌లు. అంత‌గా తాగాల‌నిపిస్తే తాగండి కానీ, హ‌ద్దులు పెట్టుకోవాల‌నేది ఆ ప‌రిశోధ‌న‌ల స‌ల‌హా. కొంద‌రు డాక్ట‌ర్ల‌ను అడిగితే.. అది ఒక పెగ్ కాదు, రెండు పెగ్ లు కాదు.. ఎంతైనా మ‌ద్య‌పానం హానిక‌ర‌మే అంటారు. అందులో మ‌రో మాటే లేదంటారు. అయితే మందుబాబుల‌కు కాదు కానీ, కాస్తంత తాగాల‌నే వారికి ఊర‌ట‌ను ఇచ్చే ప‌రిశోధ‌న మాట ఇది. మ‌ద్య‌పానం ప‌రిమిత మోతాదులో అయితే మ‌రీ చేటు చేయ‌ద‌ని నేష‌న‌ల్ హెల్త్ స‌ర్వీస్ వారి ప‌రిశోధ‌న ఒక‌టి చెబుతూ ఉంది.

దాని ప్ర‌కారం.. మ‌నిషికి లింగ‌బేధాల్లేకుండా మ‌ద్యాన్ని జీర్ణించుకునే శ‌క్తి ఎంతో కొంత ఉంటుంద‌ట‌. అంటే.. మ‌నిషి శ‌రీరానికి, ఆడ‌- మ‌గ తేడా లేకుండా ఒక గంట‌లో ఒక యూనిట్ మ‌ద్యాన్ని జీర్ణించుకునే శ‌క్తి ఉంటుంద‌ట‌. ఒక యూనిట్ అంటే, అటు ఇటుగా 10 మిల్లీలీట‌ర్ల ఆల్కాహాల్. ఇలా ఒక వారంలో 14 యూనిట్ల ఆల్కాహాల్ వ‌ర‌కూ మ‌నిషి శ‌రీరానికి ఏం పెద్ద ఇబ్బంది కాద‌ట‌, వారానికి 14 యూనిట్ల ఆల్కాహాల్ అనేది మ‌నిషి శ‌రీరం పూర్తి స్థాయి సామ‌ర్థ్యం అని, అంత‌కు మించి అయితే అది ప్ర‌మాదకరం అని ఎన్ హెచ్ ఎస్ చెబుతూ ఉంది!

మ‌రి 14 యూనిట్ల ఆల్కాహాల్ అంటే 140 మిల్లీలీట‌ర్ల ఆల్కాహాల్. లీట‌ర్ బీర్ ను తీసుకుంటే.. అందులో క‌నీసం ఆరు శాతం ఆల్కాహాల్ ఉంటుంది. అంటే లీట‌ర్ కు 60 మిల్లీలీట‌ర్లు. అంటే అటు ఇటుగా రెండున్న‌ర లీట‌ర్ల‌కు కాస్త త‌క్కువ‌ బీర్ లోనే 140 మిల్లీలీట‌ర్ల ఆల్కాహాల్ ఉంటుంది. అంటే.. వారానికి రెండు లీట‌ర్ల బీరుతో శ‌రీరంలోకి చేరే ఆల్కాహాల్ మ‌నిషి శ‌రీర సామార్థ్యానికి స‌మానం!

ఇంత‌కు మించిందంటే మాత్రం ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని తాగుడు విష‌యంలో సానుకూలమైన విష‌యాల‌ను చెబుతున్న ఈ ప‌రిశోధ‌న చెబుతూ ఉంది. తాగండి కానీ, ఇంత‌కు మించ‌వ‌ద్దు అనేది ఈ ప‌రిశోధ‌న స‌ల‌హా. అలాగే నిదానంగా తాగ‌డం, తాగుడుతో పాలు ఆహారాన్ని తీసుకోవ‌డం కూడా ఈ అధ్య‌య‌నం చెబుతున్న ముఖ్య‌మైన స‌ల‌హాలు!

16 Replies to “వారానికి ఎంత తాగొచ్చంటే.. వైద్య ప‌రిశోధ‌న మాట‌!”

Comments are closed.