ఒక‌నాటి గ్లామ‌ర్ క్వీన్.. 49 ఏజ్ లో కొత్త ల‌వ్ స్టోరీ!

ఒకానొక ద‌శ‌లో దేశం అటెన్ష‌న్ మొత్తం గ్రాబ్ చేసిన హీరోయిన్ల‌లో ఒక‌రు అమీషా ప‌టేల్. నార్త్, సౌత్ అనే తేడాల్లేకుండా ఈమె క్యూట్ నెస్ కు సిని అభిమానులు ఫిదా అయిపోయారు. అలా స్టార్…

ఒకానొక ద‌శ‌లో దేశం అటెన్ష‌న్ మొత్తం గ్రాబ్ చేసిన హీరోయిన్ల‌లో ఒక‌రు అమీషా ప‌టేల్. నార్త్, సౌత్ అనే తేడాల్లేకుండా ఈమె క్యూట్ నెస్ కు సిని అభిమానులు ఫిదా అయిపోయారు. అలా స్టార్ డ‌మ్ ను తెచ్చుకున్నా, దీర్ఘ‌కాలం పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగొంద‌లేక‌పోయింది కానీ, సినిమాల‌తో అయితే బిజీగానే గ‌డిపింది. దానికి తోడు అప్ప‌ట్లో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ భ‌ట్ తో అమీషా ప్రేమాయ‌ణం బాగా వార్త‌ల్లో వ‌చ్చేది.

అధికారికంగా అత‌డి ప్రేయ‌సిగా అమీషా వ్య‌వ‌హ‌రించింది. అయితే ఐదారేళ్లకు వీరి ప్రేమ క‌థ‌కు బ్రేక‌ప్ త‌ప్ప‌లేదు. ఆ త‌ర్వాత అమీషా ప‌టేల్ మ‌రో ఎన్ఆర్ఐతో ప్రేమాయాణాన్ని సాగించింది.

ఇప్పుడు ఆమె వ‌య‌సు 49 యేళ్లు! అయితే ఇప్ప‌టికీ పెళ్లి ఊసు ఏమీ లేదు. తాజాగా ఓ ముప్పై యేళ్ల యువ‌కుడితో దుబాయ్ లో విహ‌రిస్తూ ఆమె ఫొటోల‌ను పోస్టు చేసింది. అత‌డి కౌగిలిలో ఈమె ఒదిగిపోతూ త‌న ప‌ర‌వ‌శాన్ని ఇన్ స్టాగ్ర‌మ్ పోస్టుగా రాసుకొచ్చింది.

ఏకంగా 19 యేళ్ల వ‌య‌సు వ్య‌త్యాసం ఉంది వీరి మ‌ధ్య‌న‌. అత‌డి వ‌య‌సు ముప్పై అయితే ఈమె 49! ఏదో వ్యాపార కుటుంబానికి చెందిన అత‌డి పేరు నీర‌వ్ బిర్లా అట‌. మ‌రి వ్యాపారం చేస్తే వ‌చ్చే పేరు క‌న్నా అమీషాతో డేటింగ్ తో ఎక్కువ గుర్తింపు ద‌క్కుతున్నాడ‌నుకున్నాడేమో కుర్రాడు! అయితే మ‌రీ ఈ ఏజ్ గ్యాప్ అటు ఇటుగా ఇర‌వై ఏళ్లుగా ఉండ‌టంతో ఈ వ‌య‌సులో కూడా కుర్రాళ్ల‌ను మాయ చేసే స‌మ్మోహ‌నం అమీషాకు ఉందేమో అని కామెంట్లు చేసే వాళ్లు చేస్తూ ఉన్నారు!

2 Replies to “ఒక‌నాటి గ్లామ‌ర్ క్వీన్.. 49 ఏజ్ లో కొత్త ల‌వ్ స్టోరీ!”

Comments are closed.