ర‌ఘురామ గాయాల‌ను గుర్తు చేసిన చంద్ర‌బాబు

ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు ప‌ద‌వి లేద‌నే కొర‌త తీరింది. డిప్యూటీ స్పీక‌ర్ స్థానంలో ఆయ‌న్ను కూచోపెట్టారు. అయితే ప్ర‌తిప‌క్షం వైసీపీ అసెంబ్లీకి వెళ్ల‌క‌పోవ‌డంతో స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్ల‌కు పెద్ద‌గా ప‌ని కూడా ఉండే అవ‌కాశం…

ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు ప‌ద‌వి లేద‌నే కొర‌త తీరింది. డిప్యూటీ స్పీక‌ర్ స్థానంలో ఆయ‌న్ను కూచోపెట్టారు. అయితే ప్ర‌తిప‌క్షం వైసీపీ అసెంబ్లీకి వెళ్ల‌క‌పోవ‌డంతో స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్ల‌కు పెద్ద‌గా ప‌ని కూడా ఉండే అవ‌కాశం లేదు. కూట‌మి నేత‌ల్నే వాళ్లు కంట్రోల్ చేయాల్సి వుంటుంది.

డిప్యూటీ స్పీక‌ర్‌గా ర‌ఘురామ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘురామ‌పై అభినంద‌న‌లు వెల్లువెత్తాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు త‌న‌దైన శైలిలో ర‌ఘురామ‌పై అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇదే సంద‌ర్భంలో డిప్యూటీ స్పీక‌ర్ పాత గాయాల్ని చంద్ర‌బాబు గుర్తు చేశారు.

పోలీస్ క‌స్ట‌డీలో ఉన్న ర‌ఘురామ‌ను కొట్ట‌డం దారుణ‌మ‌ని చంద్ర‌బాబు ఆవేద‌న వ్యక్తం చేశారు. ర‌ఘురామ‌ను లాఠీలు, ర‌బ్బ‌రు బెల్టుల‌తో అరికాళ్ల‌పై కొట్టార‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. ర‌ఘురామ‌ను పోలీసుల‌తో కొట్టించి, ఆ దృశ్యాల‌ను సెల్‌ఫోన్‌లో చూసి పైశాచిక ఆనందం పొందార‌ని బాబు ఆరోపించారు. ఒక‌వేళ కొట్టిన‌ట్టు న్యాయ స్థానంలో జ‌డ్జీల‌కు చెబితే, క‌స్ట‌డీలో చంపుతామ‌ని బెదిరించార‌ని చంద్ర‌బాబు చెప్పారు. ర‌ఘురామ‌ను ప్రైవేట్ ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌కుండా నివేదిక‌ను తారుమారు చేసిన‌ట్టు చంద్ర‌బాబు ఆరోపించారు.

వైద్య ప‌రీక్ష‌ల నివేదిక కోర్టులో స‌మ‌ర్పించ‌కుండా జాప్యం చేశార‌ని ఆయ‌న అన్నారు. పోరాట యోధుడిగా గెలిచిన ర‌ఘురామ‌ను అభినందిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు.

8 Replies to “ర‌ఘురామ గాయాల‌ను గుర్తు చేసిన చంద్ర‌బాబు”

  1. తమని రాష్ట్రానికి రానివ్వం అన్నవాళ్ళు …తమ ముందు సభకు వచ్చే ధైర్యం కూడా లేదు అని కూడా అన్నారు ర గూట్లే

  2. సొంత తల్లి, చెల్లిని బండబూతులు తిట్టిన వైసీపీ సోషల్ మీడియా కూలీలను చిన్న పిల్లలుగా చూస్తున్న మానవతామూర్తి మా జగన్ రెడ్డన్న..

    అలాంటి దైవస్వరూపం తన సొంత ఎంపీ ని కస్టడీ లో చిత్రహింసలు చేసాడని అంటుంటే .. నమ్మబుద్ధి కావడం లేదు..

  3. అలుగుటయే యెరుంగని సీబీఎన్ లాంటి అజాతశెత్రుడే

    అలిగిననాడు సాగరముల్లన్ని ఏకముగాకపోవు వైసీపీ మూకలు పది వేవురైనను నొత్తురు సత్తురు రాజరాజా నా

    పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావుమెల్లరన్.…

    .

    మా పలుకులు విశ్వసింపుము..

  4. ఇప్పుడు సుద్దులు చెపుతున్న GA, అప్పట్లొ RRR థ‌ర్డ్ డిగ్రీ గురించి చాలా వ్యంగ్యంగా GA రాసినా ఆర్టికల్!

    .

    నాపై థ‌ర్డ్ డిగ్రీ…ఆర్తనాదాలు చేశాః ర‌ఘురామ

    telugu.greatandhra.com/politics/raghurama-comments-on-police-123094.html

    .

    RRR ఆర్తనాదాలు పెట్టాను అని చెపుతుంటె…..ఆ కిక్కె వేరబ్బా అని Y.-.C.-.P శ్రెణులు అంటున్నాయి అంట!

    RRR ఆర్తనాదాలు తప్పకుండా శ్రవనానందం కలిగిస్తాయి అంట!

    థ‌ర్డ్ డిగ్రీ వళ్ళ Jagan ప్రబుత్వానికి ఎమి కాదు, RRR పరువె పొతుంది అని రాసాడు.

    1. ఆనాడు దారుణం గా మనవ హక్కుల ఉల్లంగన జరిగినా GA కి మాత్రం చీమకుట్టినట్తు కూడా లెదు. పైగా Y.-.C.-.P శ్రెణులకి ఆ కిక్కె వేరబ్బా అని రాసాడు!

      1. ఇండివిడ్యుయల్ జర్నలిస్టులు అలాగే రాస్తారు..

        ఇలాంటి పతివ్రతలు కన్నా.. శ్రీరెడ్డి లాంటి లంజలే నయం..

Comments are closed.