సీనియర్ నటి అరెస్ట్ తప్పదా..?

తమిళనాట స్థిరపడిన తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని కోర్టు కూడా కనికరించలేదు. ఆమె పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను మద్రాసు హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ కొట్టేసింది. దీంతో…

తమిళనాట స్థిరపడిన తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని కోర్టు కూడా కనికరించలేదు. ఆమె పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను మద్రాసు హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ కొట్టేసింది. దీంతో ఏ క్షణానైనా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు.

తమిళ రాజుల అంతఃపురాల్లో సేవలు చేసేందుకు వచ్చిన తెలుగువాళ్లు, తమనుతాము తమిళ జాతిగా చెప్పుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కస్తూరి. దీనిపై నాయుడు మహాజన సంఘం ఫిర్యాదు చేయడంతో, తిరునగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు కస్తూరి. ఆమె వ్యాఖ్యపై కోర్టు కూడా అభ్యంతరం తెలిపింది. క్షణికావేశంలో కూడా కస్తూరి అలాంటి కామెంట్స్ చేయకూడదని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు, ఆమె చెప్పిన క్షమాపణల్లో కూడా మహిళలపై చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించలేదని కోర్టు అభిప్రాయపడింది.

కస్తూరికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలను బలంగా వినిపించారు. ప్రస్తుతం తమిళనాడుకు, కేరళ-కర్నాటకతో మంచి సంబంధాల్లేవని.. కస్తూరి లాంటి వాళ్లకు ముందస్తు బెయిల్ ఇస్తే ఆంధ్ర-తెలంగాణతో కూడా సంబంధాలు దెబ్బతింటాయని వాదించారు.

ఈ విషయంపై పూర్తిస్థాయిలో ఇంటరాగేషన్ అవసరం కాబట్టి, ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన జడ్జి, కస్తూరికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆమెను పోలీసులు ఏ క్షణానైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

11 Replies to “సీనియర్ నటి అరెస్ట్ తప్పదా..?”

  1. ఆలమట్టి ఎత్తు పెంచినా ఆంధ్రాకు- కర్ణాటకు సంబంధాలు దెబ్బతినలేదు. కానీ ఈవిడ వ్యాఖ్యలకు తమిళనాడుతో సంబంధాలు తెగిపోతాయని వాదించడం, అవతలి వాఱుగంగిరెద్దులా తలాడించాం చక చక జరిగిపోతాయి.

    1. రాజకీయ/ప్రంతీయ అవసరాలకొసం ఆలమట్టి ఎత్తు పెంచడానికీ, ఒక జాతి ప్రజల చరిత్రను నీఛంగా వక్రీకరించడానికీ ఉన్న తెడా తెలుసుకొ

    2. తెలుగు ప్రజలు జాతి సంఘీభావంతో కలసి అడుగువేయడమే గొప్ప మార్పు, దాన్ని నీరుగార్చవద్దండీ. ఖచ్చితంగా ఆమె చేసిన వ్యాఖ్యలు తప్పు.

  2. చెప్పాలనుకున్న ది, చెప్పే విధానం లో తప్పు చెప్పింది. బుక్ అయింది.

    ఆంధ్ర లో ఒంగోలు నుండి 200 ఏళ్ల క్రితం ఇప్పటి తమిళ సిఎం స్టాలిన్ ముత్తాత లు ఆరవ దేశం కి వలస వెళ్ళారు. అక్కడ జమీందారీ లా ఇళ్లలో పనిలో చేరి మెల్లగా తర్వాత తరం కరుణానిధి టైమ్ లో పైకి ఎదిగారు. పెరియార్ హిందూ మతము వ్యతిరేఖ ఉద్యమంలో చేరి పేరు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తామే అసలు తమిళ వాళ్ళం అనట్లు చెబుతున్నారు అని ఆమె భావం.

    నేరుగా స్టాలిన అని అనేబాదులు తెలుగు వాళ్ళు అని అనవడం వాళ్ళ బుక్ అయింది.

    1. ఈమె ఆన్న మాట కంటే పెద్ద మాట అన్నాడు

      వాటికన్ గొర్రె బిడ్డ ఉదయనిధి , హిందూ మతాన్ని అంతమ్ము చేస్తాను అని. మరి అతన్ని ఏమో చేయలేదు, అధికారం వింది కాబట్టి.

  3. అమెరికా లో అసలు సిసలు అమెరికా వాళ్ళు లేనిట్లు,

    తమిళ నాడు లో ప్రచారం వున్న వాళ్ళలో అసలియన్ తమిళ వాళ్ళు ఎవరు లేరు, నిజానికి.

    రజనీ కాంత్- మరాఠా, కన్నడ మూలాలు

    కరుణ నిది, స్టాలిన్ – తెలుగు మూలాలు

    దివంగత కెప్టెన్ ప్రభాకర – తెలుగు

    జయలలిత – కన్నడ మూలాలు

    సినీ నటులు అజిత్,రవి, రాధికా – తెలుగు మూలాలు

    అసలు చెన్నై పేరే తెలుగు జమీందారీ పేరు మీద వచ్చింది.

Comments are closed.