విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని ఏపీ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నికను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. విజయనగరం వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగా చిన్న అప్పలనాయుడి పేరును వైఎస్ జగన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
వెలమ సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడి అభ్యర్థిత్వం పార్టీకి కలిసొస్తుందని ఉత్తరాంధ్ర నాయకుల అభిప్రాయం మేరకు జగన్ ఖరారు చేశారు. అయితే వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా రఘురాజు గతంలో ఎన్నికయ్యారు. కానీ ఎన్నికల ముందు ఆయన పార్టీ మారారు. దీంతో ఆయనపై వైసీపీ ఫిర్యాదు మేరకు అనర్హత వేటును మండలి చైర్మన్ మోషెన్ రాజు వేశారు.
రఘురాజు కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే అప్పటికే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. కానీ హైకోర్టులో ఎమ్మెల్సీ రఘురాజుకు అనుకూలంగా తీర్పు రావడంతో నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను ఈసీ రద్దు చేయడం గమనార్హం. దీంతో ఉప ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది.
party marina vallaki suspension ivadu ana court ni em anodu,english medium vodu ana court ni em anodu..ala chese troll chesinatla