మేనేజింగ్ ఓకే.. మ్యాజిక్ జరుగుతుందా?

నార్త్ లో సభ సక్సెస్ చేయడం అన్నది మేనేజ్ మెంట్. నార్త్ బెల్ట్ లో సినిమా హిట్ కావడం అన్నది మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ ఇప్పుడు రెండో సారి రిపీట్ అవుతుందా?

పుష్ప 2 సినిమా ఫంక్షన్ అద్భుతమైన సక్సెస్. అందులో అణుమాత్రం సందేహం లేదు. ఇది మేనేజ్ మెంట్. కానీ పుష్ప వన్ సినిమా ఓ మ్యాజిక్. ఈ సినిమా తెలుగునాట ఎలా ఆడింది అన్నది పక్కన పెడితే నార్త్ బెల్ట్ లో హిట్ అన్నది పక్కా మ్యాజిక్. నార్త్ లో సభ సక్సెస్ చేయడం అన్నది మేనేజ్ మెంట్. నార్త్ బెల్ట్ లో సినిమా హిట్ కావడం అన్నది మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ ఇప్పుడు రెండో సారి రిపీట్ అవుతుందా? అన్నది అతి పెద్ద ప్రశ్న.

అన్నీ పక్కన పెట్టి నార్త్ బెల్ట్ లో పుష్ప సినిమా ఎందుకు పెద్ద హిట్ అయిందో కారణాలు వెదికితే, ముందుగా నిలబడే కారణం సమంత చేసిన డ్యాన్స్, దేవీ ఇచ్చిన పాట.. ’ఊ అంటావా..మామా ఊఊ అంటావా?’. రెండో ప్లస్ పాయింట్ రష్మిక.. ఆమె చేసి సామీ.. రారా సామీ పాట. ఆ తరువాత తగ్గేదేలే అంటూ బన్నీ చేసిన సిగ్నేచర్ మూమెంట్స్, ఫైట్లు. కంటెంట్ అన్నది వాటన్నింటి తరువాతే. కొసమెరుపు ఫాహిద్ ఫాజిల్.

ఇప్పుడు పుష్ప 2 ఈ పాయింట్లు అన్నీ చూసుకోవాలి. పాటలు పెద్ద హిట్ కావాలి. ముఖ్యంగా ఐటమ్ సాంగ్. అది ఇంకా రాలేదు కనుక ఎలా వుండబోతోందో అన్నది తెలియదు. ఇప్పటికి వచ్చిన పాటలు ఎర్లీగా విడుదల చేసారు, రీల్స్ వగైరా అన్నీ మామూలే కానీ, ఇప్పుడు అయితే వైరల్ కావడం లేదు. సినిమా విడుదల అయిన తరవాత మళ్లీ వైరల్ ప్లాట్ ఫారమ్ మీదకు వస్తాయేమో చూడాలి.

ట్రయిలర్ చూస్తే బన్నీ కొత్త సిగ్నేచర్ మూమెంట్స్ ఏమీ చూపించలేదు. పార్ట్ వన్ లో చూపించినవే. పైగా ఒకసారి పుష్ప అంటే ఫైర్ అంటే బాగుంటుంది. కానీ ఒకసారి పుష్ప అంటే వైల్డ్ ఫైర్, మరోసారి పుష్ప అంటే బ్రాండ్, ఇలా పదే పదే వేరు వేరుగా అంటే అంత క్లిక్ పాయింట్లుగా కనిపించడం లేదు. ఈసారి ట్రయిలర్ ను హీరో సెంట్రిక్ గా కట్ చేసారు. మిగిలిన పాత్రలను చూపించారంతే. పరిచయం కూడా చేయలేదు. ఫాహిద్ పాత్రను జస్ట్ వాటికంటే కాస్త బెటర్ గా మాత్రం చూపించారు.

చూస్తుంటే పుష్ప వన్ పెద్ద హిట్ అయిన తరువాత ముందు అనుకున్న స్క్రిప్ట్ లో మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. బన్నీ క్రేజ్ కు అనుగుణంగా మార్చారేమో? మన రెగ్యులర్ పాట్రన్ సినిమాల మాదిరిగా విలన్ ను బపూన్ ను చేస్తే కిక్ రాదు. పుష్ప వన్ లో ప్రతి పాత్ర పండింది. పుష్ప 2లో కూడా అదే తరహాగా వుండాలి. ట్రయిలర్ లో పడిన డైలాగులు ఏవీ పెద్దగా క్లిక్ కాలేదనే చెప్పాలి. పార్ట్ వన్ లో.. నా కాలు నాదే… పార్టీ లేదా పుష్పా.. ఒకటి తక్కువైంది పుష్ప ఇలాంటి డైలాగ్ మ్యాజిక్ లు చాలా వున్నాయి. పార్ట్ టూ లో కూడా అలాంటివి, అంతకు మించి వుండాలి. అప్పుడే మ్యాజిక్ పాజిబుల్ అవుతుంది.

పుష్ప 2 ట్రయిలర్ కట్ ఎలా వుంటేనేమి. సినిమాలో కంటెంట్ పెర్ ఫెక్ట్ గా వుండాలి. పుష్ప వన్ సక్సెస్, పుష్ప 2 క్రేజ్ చూసి భారీ రేట్లు చెబుతున్నారు. భారీ టికెట్ రేట్లు పెడతారు. అంతవరకు ఓకె. కానీ కంటెంట్ ఏమాత్రం అసంతృప్తి అనిపించినా మ్యాజిక్ జరగదు. అలాంటి మ్యాజిక్ జరుగుతుందనే ఆశిద్దాం.

15 Replies to “మేనేజింగ్ ఓకే.. మ్యాజిక్ జరుగుతుందా?”

  1. ఇది మేనేజ్మెంట్ అని తెలిసికూడా ట్రూ పాన్ ఇండియా ఈవెంట్ అని ఆర్టికల్ ఎందుకు వదిలారు?

  2. “మన రెగ్యులర్ పాట్రన్ సినిమాల మాదిరిగా విలన్ ను బపూన్ ను చేస్తే కిక్ రాదు.”

    that is why jagapati is there, who did crash course in Ameerpet on villainy

Comments are closed.