సాంబార్‌లో కప్ప.. లోకేష్ కీల‌క ఆదేశాలు

నిన్న మధ్యాహ్నం సాంబార్‌లో కప్ప వచ్చిందని భోజనం మానేసి, రాత్రి అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేసిన నాగార్జున యూనివర్సిటీ విద్యార్థుల బాధను అర్థం చేసుకుని మంత్రి నారా లోకేష్ కీలక…

నిన్న మధ్యాహ్నం సాంబార్‌లో కప్ప వచ్చిందని భోజనం మానేసి, రాత్రి అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేసిన నాగార్జున యూనివర్సిటీ విద్యార్థుల బాధను అర్థం చేసుకుని మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఘటనకు సంబంధించి వసతి గృహ వార్డెన్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు.

శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేస్తుండగా సాంబార్‌లో కప్ప కనిపించిందని, భోజనం వదిలేసి వెళ్లారని తెలుస్తోంది. అధికారులు ఈ ఘటనపై చర్యలు తీసుకోవడం మానేసి, విషయం బయటకు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలియ‌డంతో.. విద్యార్థులు రాత్రి భోజనం మానేసి ఆందోళనకు దిగారు. విద్యార్థినుల ఆందోళన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, మంత్రి నారా లోకేష్ స్పందించి ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణలో కలుషిత ఆహారం తిని ఓ విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఆహార కల్తీ ఘటనల‌ వెనుక మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఉన్నారని తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఏదేమైనా, ప్రభుత్వ విద్యాసంస్థల్లో జరిగే ఆహార కల్తీని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

12 Replies to “సాంబార్‌లో కప్ప.. లోకేష్ కీల‌క ఆదేశాలు”

  1. “అధికారులు ఈ ఘటనపై చర్యలు తీసుకోవడం మానేసి, విషయం బయటకు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలియ‌డంతో.. విద్యార్థులు రాత్రి భోజనం మానేసి ఆందోళనకు దిగారు.”

    అధికారులంతా ఇలా తీవ్ర ఏకాగ్రతతో, సమిష్టిగా కలసి ఉంటే ఒక రితేశ్వరి, ఒక RRR , ఒక కలకత్తా ఘటన మరెన్నో కప్పిపుచ్చేయొచ్చు. అసలే అరకొర జీతాలతో, జీవితాన్తమ్ వెట్టి చాకిరీ చేసినందుకు తాము retirement అయ్యేలోగా నాలుగు కొండలు వెనకేశుండామనుకుంటే ఇలాంటి చవకబారు విషయాల్లో తమను బాధ్యులను చేయాలని చూసినందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు…అంతే!

  2. Just suspend ee kada andukey chestaru .em undi again they rejoin kada ela aina ..adey dismiss cheyachu kada.inka mana great hyd lo aitey just fine vesraru antey hotels vallu people ki chapina nonproblem just fine antey em chesina fine antey

Comments are closed.