ఐదు త‌ర్వాత పోలింగ్ ప‌ర్సెంటేజ్ ఎలా పెరుగుతోంది?

గ‌తంలో పోలింగ్ ప‌ర్సెంటేజ్ ప్ర‌క‌ట‌న‌ల్లో స‌వ‌ర‌ణ రెండు మూడు శాతం ఉంటే, ఇప్పుడు ఏకంగా అది ప‌దుల శాతాల్లోకి వెళ్తోంది.

అస‌లు ఎన్నిక‌ల్లో పోలింగ్ శాతాన్ని ఎలా లెక్కిస్తారంటే, పోలింగ్ ఏర్పాట్ల‌లో భాగంగానే ఓట‌ర్ లిస్టును బూత్ ల‌లోని అధికారుల‌కు, ప్ర‌ధాన పార్టీల ఏజెంట్ల‌కు అందజేస్తారు. పోలింగ్ కు కొన్ని రోజుల ముందే కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేస్తుంది. ఆ ఓట‌ర్ల జాబితాను ను బూత్ ల వారీగా విభ‌జించుకుంటారు. పార్టీల వాళ్లు ఓట‌ర్ల‌కు స్లిప్ ల‌ను అందిస్తుంటారు. మీ ఓటు ఫ‌లానా పోలింగ్ బూత్ ప‌రిధిలో ఉంటుంది అక్క‌డ‌కు వెళ్లండ‌ని స్లిప్ లు పంపిణీ చేసుకుంటారు, ఇది అన‌ధికారిక ప‌ని.

ఒక్క‌సారి ఓట‌ర్ బూత్ లోకి వెళ్లి త‌న ఓటు హ‌క్కును వినియోగించుకోగానే… పార్టీల ఏజెంట్లు, బూత్ అధికారులు ఓట‌ర్ లిస్ట్ లో అత‌డి పేరు, ఫొటో ఉన్న చోటుకు టిక్ పెట్టేసుకుంటారు. బూత్ కు ఐదారు వంద‌ల నుంచి వెయ్యి ఉన్నా.. ఆ జాబితాలో వారి పేరుకు టిక్ పెట్టుకోవ‌డానికి వీలైనంత స‌మ‌యం ఉంటుంది వారికి. ఇలా టిక్ లు పెట్టుకోవ‌డంతోనే ఎంత‌మంది ఓటు హ‌క్కును వినియోగించుకున్నార‌నే అంశంపై స్ప‌ష్ట‌త వ‌స్తుంది. తొలి గంట‌లో ఎంత‌మంది, రెండో గంట‌లో ఎంత‌మంది, మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ ఎంత‌మంది అంటూ మీడియా ఇచ్చే రిపోర్ట్ కూడా ఇలా త‌యార‌య్యేదే. అక్క‌డ మీడియా సొంతంగా ఈ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌దు. ప్ర‌తి గంట‌కూ ఎన్నిక‌ల సంఘానికి బూత్ అధికారులు రిపోర్ట్ చేయాలి. అది కూడా నియ‌మ‌మే!

తొలి గంట‌లో ఎంత‌మంది ఓటు హ‌క్కును వినియోగించుకున్నారో, బూత్ నుంచి పై స్థాయికి స‌మాచారం వెళ్లిపోతుంది. ఇది నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఉండే కేంద్రానికి చేరుతుంది. అక్క‌డ నుంచి రాష్ట్ర స్థాయి కేంద్రానికి స‌మాచారం అందుతుంది. ఇదంతా చాలా సంవ‌త్స‌రాలుగా ఉన్న విధాన‌మే. ఎల‌క్ట్రిక్ మీడియా విస్తృతం అయిన‌ద‌గ్గ‌ర నుంచి మీడియా ద్వారా ఎన్నిక‌ల సంఘం పోలింగ్ శాతాన్ని గంట‌గంట‌కూ విడుద‌ల చేస్తూ వ‌స్తోంది. దీంతో మీడియాలో ఉద‌యం తొలి గంట పోలింగ్ పూర్త‌యిన ద‌గ్గ‌ర నుంచి శాతాల వారీగా ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తూ ఉంటాయి.

పోలింగ్ మంద‌కొడిగా ఉంద‌ని, వేగంగా సాగుతూ ఉంద‌ని, ఓట‌ర్ల ముందుకు రావ‌డం లేద‌ని, ఓట‌ర్ మేలుకోవాల‌ని ర‌క‌ర‌కాల స్లోగ‌న్లు టీవీల్లో వినిపించ‌డం వెనుక బూత్ లో పెట్టుకునే టిక్కుల లెక్కే కీల‌కం! గంట‌గంట‌కూ పోలింగ్ శాతాన్ని లెక్క‌బెట్ట‌డం అనేది క‌ష్ట‌సాధ్య‌మే అయినా, బూత్ కు ఐదారు వంద‌ల స్థాయి ఓట్లే ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి.. ఇది ఆచ‌ర‌ణ సాధ్యం అవుతూ ఉంది!

ఈ పోలింగ్ శాతం గురించి పోలింగ్ రోజున సాయంత్రం ఐదు గంట‌ల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప్రెస్ మీట్ పెట్టి ప్ర‌క‌ట‌న చేస్తూ ఉంటారు. ఐదింటికి చేసే ప్ర‌క‌ట‌న చాలా వ‌ర‌కూ కీల‌కం ఉంటుంది మీడియాలో. కొన్ని చోట్ల ఐదింటి త‌ర్వాత కూడా జ‌నాలు క్యూల్లో ఉంటారు, ఆ విష‌యాన్ని కూడా అప్పుడు చెబుతూ ఉంటారు! అయితే 2024 ఎన్నిక‌ల‌కుముందు వ‌ర‌కూ కూడా.. ఎన్నిక‌ల అధికారులు పోలింగ్ ముగింపు ద‌శ‌లో చెప్పే పోలింగ్ శాతానికి, అంతిమంగా ప్ర‌క‌టించే పోలింగ్ శాతానికి వ్య‌త్యాసం చాలా చాలా త‌క్కువ‌గా ఉండేది! మ‌హా అంటే ఒక‌టీ రెండు శాతం వ్య‌త్యాసం కూడా ఉండేది కాదు.

టీవీల ద్వారా పోలింగ్ శాతం గ‌ట్టిగా ప్ర‌క‌టించ‌బ‌డుతున్న‌ది 2004 ఎన్నిక‌ల నుంచి అనుకుంటే, అప్పుడే ఈవీఎంలు వ‌చ్చాయి, 24 గంట‌ల వార్తా చాన‌ళ్లూ పెరిగాయి. ఆ స‌మ‌యం నుంచి లోక్ స‌భ ఎన్నిక‌ల విష‌యంలో అయినా, రాష్ట్రాల‌ శాస‌న‌స‌భ ఎన్నిక‌లు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల వంటి వాటి విష‌యంలో అయినా.. ఇలా ప్ర‌తి ఎన్నిక‌ల విష‌యంలోనూ గంట‌గంట‌కూ పోలింగ్ శాతం చెప్ప‌డం, సాయంత్రానికి పోల్ అయిన ఓట్ల శాతం ఎంతో చెప్ప‌డం, మ‌రుస‌టి రోజుకు స‌వ‌రింపులో ఒక‌టీ రెండు శాతం పెర‌గ‌డం జ‌రుగుతూ వ‌స్తోంది. ఆ ఒక‌టీ రెండు శాతం మార్పు ఎందుకంటే.. మిస్ క‌మ్యూనికేష‌న్ ఎక్క‌డైనా జ‌రిగి ఉండ‌టం, లేదా సాయంత్రం ఐదు త‌ర్వాత క్యూల‌లో ఉన్న వాళ్లు ఓటేయ‌డం వంటి కార‌ణాల‌ను సీఈసీ చెబుతూ వ‌చ్చింది.

ఒక‌టీ రెండు శాతం తేడాలు పెద్ద విష‌యం కాదు అనుకుంటే, 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల ద‌గ్గ‌ర నుంచి ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది! సాయంత్రం వ‌ర‌కూ న‌మోద‌య్యే పోలింగ్ ప‌ర్సెంటేజ్ కూ, మ‌రుస‌టి రోజు ప్ర‌క‌టిస్తున్న ప‌ర్సెంటేజ్ కు సంబంధ‌మే లేకుండా పోయింది!

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ నే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటే.. పోలింగ్ రోజు రాత్రి ఎనిమిది గంట‌ల‌కు న‌మోదైన పోలింగ్ శాతం 68 అని ప్ర‌క‌టించారు. అదే రోజు రాత్రి 11 గంట‌ల‌కు ఆ శాతం ఏకంగా 76కు పెరిగింది. ఇంత‌క‌న్నా చోద్యం ఏమిటంటే.. మ‌రుస‌టి రోజు ఎన్నిక‌ల క‌మిష‌న్ తేల్చిన లెక్క 80.66 అని! అంటే రాత్రి ఎనిమిది గంట‌ల స‌మ‌యంలో 68 శాతంగా ఉన్న పోలింగ్ ప‌ర్సెంటేజ్ తెల్లారేస‌రికి 80కు దాటేసింది! అలా అని ప‌గ‌లంతా ఎక్క‌డైనా ఈవీఎంలు మొరాయించి, రాత్రంతా పోలింగ్ నిర్వ‌హించారా అంటే అది కూడా లేదు!

2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో చాలా చోట్ల రాత్రి పోలింగ్ జ‌రిగింది. ప‌గ‌లు మిష‌న్ల మొరాయింపుతో సాయంత్రం క్యూల్లో ఉన్న వారికి అవ‌కాశం క‌ల్పించిన‌ట్టుగా అప్పుడు ఈసీ ప్ర‌క‌టించింది. దానిపై చంద్ర‌బాబు నానా ర‌చ్చ చేశారు. అప్పుడు స్టేట్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ను క‌లిసి ఆయ‌న‌పై ఎగిరెగిరిప‌డ్డారు. క్యూల‌లో ఉన్న ఓట‌ర్ల‌కు టీ ఇవ్వ‌లేద‌ని, బిస్కెట్ ఇవ్వ‌లేద‌ని లోకేష్ ర‌గ‌డ చేసింది కూడా అప్పుడే! 2019 ఎన్నిక‌ల‌తో పోలిస్తే.. 2024 ఎన్నిక‌ల్లో అలాంటి దృశ్యాలు లేవు! సాయంత్రంఐదారుకే చాలా చోట్ల పోలింగ్ అయిపోయింది, అయితే పోలింగ్ ప‌ర్సెంటేజ్ లెక్క‌లు సాయంత్రం వ‌ర‌కూ ఒక‌లా ఆ త‌ర్వాత మ‌రోలా మారాయి. 68 శాతం పోలింగ్ ఏకంగా 80కు వెళ్లిపోయింది.

పోలింగ్ బూత్ ల‌లో టిక్కులు పెట్టుకోవ‌డంలో ఏవైనా చిన్న చిన్న తేడాలుంటే, అంతిమ ప్ర‌క‌ట‌న‌లో ఒక‌టీ రెండు శాతం తేడాలు ఉండ‌టం అంత వ‌ర‌కూ స‌హ‌జ‌మే అయితే, ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ కు సంబంధించి పోలింగ్ శాతంలో వ్య‌త్యాసం 12 శాతం! అంత‌వ‌ర‌కూ ఎన్న‌డూ చూడ‌ని దృశ్యం అది. జ‌నాలు చీక‌టి ప‌డ్డాకా కూడా క్యూల్లో ఉండి ఓటేసిన 2019 ఎన్నిక‌ల్లోనేమో పోలింగ్ రోజు ప్ర‌క‌ట‌న‌కూ, మ‌రుస‌టి రోజు ప్ర‌క‌ట‌న‌కూ పెద్ద తేడా లేదు! అయితే అలాంటి సీన్ లేద‌ని 2024 ఎన్నిక‌ల విష‌యంలో మాత్రం ఐదు గంట‌ల స‌మ‌యంలో వ‌చ్చిన ప్ర‌క‌ట‌న‌కూ, మ‌రుస‌టి రోజు వ‌చ్చిన ప్ర‌క‌ట‌న‌కూ తేడా 12 శాతం!

క‌ట్ చేస్తే.. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇలాంటి దృశ్య‌మే చోటు చేసుకుంది కూడా! మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ విష‌యంలో కూడా సాయంత్రం వ‌ర‌కూ ప్ర‌క‌టించిన పోలింగ్ శాతానికి, అంతిమంగా ప్ర‌కటించిన పోలింగ్ శాతానికి సంబంధం లేదు! సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కూ మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో న‌మోదైన పోలింగ్ శాతం 55 అని ఎన్నిక‌ల సంఘ‌మే ప్ర‌క‌టించింది. అయితే ఐదు త‌ర్వాత మొత్తం పోలింగ్ శాతం 66 అని ప్ర‌క‌టించారు! అంటే ఐదు త‌ర్వాత ఏకంగా 11 శాతం పోలింగ్ ప‌ర్సెంటేజ్ ఎలా పెరిగిందంటూ టీవీ చాన‌ళ్లు కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాయి!

అంటే మ‌హారాష్ట్ర‌లో ఓటేసిన ప్ర‌తి ఆరుగురిలో ఒక‌రు సాయంత్రం ఐదు త‌ర్వాత వెళ్లి ఓటేశారా! ఐదింటికి క్యూల‌లో ఉన్న వారికే క‌దా ఓటేసే అవ‌కాశం ఇస్తారు, అంటే.. ఏకంగా కొన్ని ల‌క్ష‌ల మంది ఐదు త‌ర్వాత క్యూల‌లో బార్లు తీరారా? ప్ర‌తి ఆరు మందిలో ఒక‌రు ఐదు త‌ర్వాత ఓటేయ‌డం అంటే మాట‌లు కాదు!

గ‌తంలో పోలింగ్ ప‌ర్సెంటేజ్ ప్ర‌క‌ట‌న‌ల్లో స‌వ‌ర‌ణ రెండు మూడు శాతం ఉంటే, ఇప్పుడు ఏకంగా అది ప‌దుల శాతాల్లోకి వెళ్తోంది. ఏపీలో 12 శాతం, మ‌హారాష్ట్ర‌లో 11 శాతం అధిక పోలింగ్ ప‌ర్సెంటేజ్ ప్ర‌క‌ట‌న‌లు ఎలా వ‌చ్చాయో ఎన్నిక‌ల క‌మిష‌న్ చెప్ప‌డం లేదు. దీనిపై మాజీ సీఈసీలు కూడా స్పందిస్తున్నారు. ఇలాంటి వ్య‌త్యాస‌పు ప్ర‌క‌ట‌న వ‌ల్ల ప్ర‌జ‌ల్లో అనుమానాలు క‌లుగుతాయ‌ని, ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై అనుమానాలు రేగుతాయ‌ని, ఇలాంటి విష‌యాల్లో సీఈసీ స్పందించాల‌ని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు!

36 Replies to “ఐదు త‌ర్వాత పోలింగ్ ప‌ర్సెంటేజ్ ఎలా పెరుగుతోంది?”

  1. కెంద్ర ఎన్నికల సంగం 8 గంటలకి పొల్లింగ్ శాతం ప్రకటిస్తె, అది ఆ రాష్ట్రం లొ 8 గంటలకి పూర్తి అయిన పొలింగ్ అని కాదు!

    .

    కొంచం తెలుసుకొని రాయి!!

  2. వోటింగ్ బూత్ లో కూర్చున్న అన్న బ్యాచ్ నిద్రపోతూ ఉన్నారు

    అంటున్నవ్ లేక మా అన్న లాగా అమాయకులు అంటున్నావా ?,

    మాములుగా ఎక్కువ శాతం ప్రజలు పగలు ఎండా లో కన్నా ఈవెనింగ్ 4 తర్వాత వచ్చి వోట్ వేయడానికి సుముఖత చూపిస్తారు, అది ఇప్పుడు బీజేపీ వచ్చాక కాదు స్టార్టింగ్ నుంచి అదే జరుగుతోంది…

    మాములుగ అన్న బ్యాచ్ సాయంత్రం బాగా ఓట్లు గుద్దతారు, దానివల్ల కూడా పెరిగుండొచ్చు, మల్లి 40% ఓట్లు ఆలా గుద్దటం వాళ్ళ వచ్చిందా, ఏమో తెలియది మరి

  3. వోటింగ్ బూత్ లో కూర్చున్న అన్న బ్యాచ్ నిద్రపోతూ ఉన్నారు

    అంటున్నవ లేక మా అన్న లాగా అమాయకులు అంటున్నావా ?,

    మాములుగా ఎక్కువ శాతం ప్రజలు పగలు ఎండ లో కన్నా ఈవెనింగ్ 4 తర్వాత వచ్చి వోట్ వేయడానికి సుముఖత చూపిస్తారు, అది ఇప్పుడు బీజేపీ వచ్చాక కాదు స్టార్టింగ్ నుంచి అదే జరుగుతోంది…

    మాములుగ అన్న బ్యాచ్ సాయంత్రం బాగా ఓట్లు గుద్దతారు, దానివల్ల కూడా పెరిగుండొచ్చు, మల్లి 40% ఓట్లు ఆలా గుద్దటం వాళ్ళ వచ్చిందా, ఏమో తెలియది మరి

  4. పిచ్చెక్కుతుందా GA….NEXT పోలింగ్ బూత్ ఏజెంట్స్ మీద కూడా ఏదోకటి వదులు….నమ్ముతారేమో జనం….😂😂…పోలింగ్ ఏజెంట్స్ తలలు పగలగొట్టిన మీ రాక్షస మంద ను అడిగితే చెప్తారు కదా GA ఏమయ్యిందో….

  5. అంటే మోసం జరిగింది అన్నమాట. మరి 2019 లో రాత్రి 10 వరకూ జరిగిన ఓటింగ్ లో జగన్ గెలిచినప్పుడు ఈ సందేహం ఎందుకు రాలేదు?

    రాష్ట్రం మొత్తం మూల మూలల నుండి జరిగిన ఓటింగ్ లెక్కలు క్రొడికరించుకుని గదా ఫైనల్ అంకె చెప్పేది. 5 గంటల వరకూ అంటే అప్పటి వరకూ EC దగ్గర అందుబాటులో ఉన్న గణాంకాలే ఇస్తారా? లేకపోతే 5 వరకూ ఓటేసిన నిక్కచ్చి గణాంకాలు ఇచ్చేస్తారని చెబుతున్నావా?

    ఇంత సోది దేనికి, పోలింగ్ ఏజెంట్ల దగ్గర ప్రతి బూతులో జరిగిన ఓటింగ్ ఫిగర్స్ ఫారం 17 లో ఇచ్చినవి ఉంటాయిగా. వాటిని లెక్కవేసి ఏ నియోజకవర్గంలో ఓట్లు ఎక్కువ పడ్డాయని EC మభ్యపెడుతున్నదో బయటపెట్టి మోడీ తాట తీయవచ్చుగా.

    చెప్పింది ఎవరు? పాత CEC ఖురేషి కదా. మరీ ఖురేషి కి ఈ విషయాలు తెలియవా లేక ఖురేషి కాబట్టి ఆయన ఎయిమ్ అలా అలా ఉంటుందా?

  6. ఈ సౌకర్యం ఉపయోగించుకుని మోడీ 2024 లో 400 గెలవకుండా VP లాగా 240 దగ్గరే ఆగిపోయి, చంద్రబాబు నితీష్ లాంటి వాళ్ళ మీద ఆధారపడే ఖర్మ ఎందుకు కొనితెచ్చుకున్నాడు?

    1. వినే వెంగళప్పలు ఉన్నంతవరకు ఈ చెవిలో పూలు పెట్టే బ్యాచ్ వర్ధిల్లుతూనే ఉంటుంది

  7. వినే వెంగళప్పలు ఉన్నంతవరకు ఈ చెవిలో పూలు పెట్టే బ్యాచ్ వర్ధిల్లుతూనే ఉంటుంది

  8. ఐదు గంటల వరకు అయింది 58.22%, ఫైనల్ turn out 65.02%. మీరు ముందుది 55% చేసి తర్వాత ది 66% చేసి eco సిస్టం లో గోల్డ్ మెడల్ రేస్ లో ఉన్నారు.

  9. మాజీ..CEC..నే..చెబుతున్నాడు, 5PM..తరువాత..వోటింగ్..శాతము..12%-15%..ఎలా..పెరుగుతోంది ..అని, ఇక్కడ..EVM..లు..మారుస్తున్నారు..అని ..అనుమానాలు..వస్తున్నాయి , అత్యంత..ప్రమాదకరమయిన. EVM..టాంపరింగ్..ఇష్యూ..మా..పరిధిలోనిది..కాదు, EC..ఏమిచేసినా..ప్రశ్నించక..పోయడము.ఏ..దేశములోని..కోర్ట్..చెయ్యదు, అందరు..దొంగలే..ఇండియాలో , ఎందుకు..పనికిరాని..బంగ్లాదేశ్లో..కూడా..వాళ్ళ..వున్నత..న్యాయస్థానం..EVM..లను..రద్దు..చేసింది.పెద్ద..ప్రజాస్వామ్యము..అని..గొప్పలు..చెప్పుకొనే..మన..దేశ..పాలకులు..EVM..టాంపరింగ్..చేస్తూ..ప్రజాస్వామ్యాన్ని..ఖూనీ..చేస్తున్నారు. అయినా..కోర్టులు ..పట్టిచ్చుకోరు , ఎందుకంటే..రిటైర్మెంట్..తరువాత..పదవులు..కావాలి..వీళ్లకు . EVM..మోసాలగురించి..ఇది..చూడండి.,-https://votefordemocracy.org.in/

    1. నీత్యానంద స్వామీ కి ప్రత్యేక దేశం ఉంది అంట అక్కడికి వెళ్లి మీ అన్నని పోటీ చేయమని చెప్పు, అక్కడ కోర్టులు ఉండవు, ఎలెక్షన్ కమిషన్ ఉండదు, స్వామి చెప్పిందే రాజ్యాంగం, అక్కడికి వెళ్ళండి ఎందుకంటే ఇక్కడి న్యాయవ్యవస్థ మీద కానీ ఇతర వ్యవస్థల మీద కానీ మీకు నమ్మకం లేదు.

    2. మరి పోలింగ్జ తర్వాత బూత్ వారీగా పోలైన ఓట్ల వివరాలు ఫారం 17 లో పోలింగ్ ఎజెంట్లకు ఇస్తారు. మరి వాటిని, కౌంటింగ్ నాడు లెక్క వేసిన ఓట్ల సంఖ్యతో పోల్చి, ఎక్కడ తేడా వచ్చిందో నిగ్గాది్యవచ్చుగా. మరి ఒక్క నియోజకవర్గం లో కూడా అలా ఎందుకు చేయలేదు. ఊరికే గాలి ఆరోపణలు చేసి ఉపయోగం ఏమిటి? బుర్ర తక్కువగాళ్ళను నమ్మిస్తానీకా?

      బాలట్ అయితే మోసాలు జరగవని గారంటీ ఉందా? లోగడ మాస్ రిగ్గింగ్ జరిగేది. అది కరెక్టనా

      1. మాజీ CEC ఖురేషి. అలాగే చెప్తాడు. మరి తన హయాంలో ఈ..,.వీ…..ఎం లు బాగా పనిచేయిస్తే ఇప్పుడు పాడై పోయిందా? ఖురేషి ఖురేషియే పైగా కాంగ్రెస్ వాడూ

      2. చదువుకున్నోళ్లకంటే..చాకలి..వాళ్ళు..మేలు..అంటారు, దానికి..నీలాంటి..వాళ్ళే..ఉదాహరణ. ఈ..వెబ్సైటు..చూసి..బాగా..అర్థం..చేసుకో.–https://votefordemocracy.org.in/

    3. పర్లేదు బాసు nangiri gandira రాజేబు time లో జి..హా…దీ ద…గా..ల దగ్గర ఇది ఎంత చెప్పు…v want HINDHU DESH thats it

  10. 100 % evm ల మో*సం జరిగింది ప్రజలు ఓటు వేసింది ఒకళ్ళకి గెలిచింది ఇంకొకళ్ళు. అందుకే గెలిచిన వాళ్ళు అంత ఉగ్రరూపం ల ఉన్నారు. నిజంగా గెలిచి ఉంటే వాళ్ళ కు ప్రజల మీద అంత కోపం ఉండదు.

  11. 100 % e*v*m ల మో*సం జరిగింది ప్రజలు ఓ*టు వేసింది ఒకళ్ళకి గెలిచింది ఇంకొకళ్ళు. అందుకే గెలిచిన వాళ్ళు అంత ఉ*గ్ర రూపం ల ఉన్నారు. నిజంగా గెలిచి ఉంటే వాళ్ళ కు ప్రజల మీద అంత కో*పం ఉండదు.

Comments are closed.