విశాఖలో దారుణం…. మహిళలపై యాసిడ్ దాడి!

మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, వారికి ఎదురవుతున్న దాడులు మాత్రం ఆగడం లేదు. నిన్న రాత్రి విశాఖపట్నంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై…

మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, వారికి ఎదురవుతున్న దాడులు మాత్రం ఆగడం లేదు. నిన్న రాత్రి విశాఖపట్నంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు మహిళలకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటన విశాఖ ఐటీఐ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. రాత్రి బస్సు ప్రయాణం చేస్తుండగా, ఒక గుర్తు తెలియని వ్యక్తి బస్సుపై యాసిడ్ బాటిల్ విసిరాడు. యాసిడ్ కిటికీ పక్కన కూర్చున్న మహిళలపై పడటంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే బస్సు ఆపి పోలీసులకు సమాచారం అందించాడు. యాసిడ్ ప్రధానంగా బస్సు అద్దాలపై పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్, బాధితులు అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు ఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. యాసిడ్ దాడి మ‌హిళ‌లే లక్ష్యంగా చేశారా లేదా అజ్ఞాత వ్యక్తి అకతాయి పని చేశాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

కాగా కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్పటి నుండి మహిళలపై దాడుల సంఖ్య పెరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఘటన సంచలనం రేపుతోంది. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

5 Replies to “విశాఖలో దారుణం…. మహిళలపై యాసిడ్ దాడి!”

  1. Ivi anni tdp govt lo news kaadu le.. Bongu lodi arachi gola chesina vijayawada call money scam laa ayipothubdi…appudu Ramana load ethadu high court CJ gaa undi..

    ippudu kuda edo maya chestharu..just wait for 3 days after that news chudu..

    pk gaadu address care of cinema sets

Comments are closed.