కోరి పిలిచి తమన్ ను అవమానించారా?

సామ్ సీఎస్ స్టేట్ మెంట్ ప్రకారం చూసుకుంటే, తమన్ వర్క్ ను దర్శకుడు సుకుమార్ పూర్తిగా పక్కనపెట్టినట్టు స్పష్టమైంది.

పుష్ప-2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ కు తీరని అన్యాయం జరిగిందని, ఘోర అవమానం జరిగిందని ఇప్పటికే చాలా కథనాలు చదువుకున్నాం. అతడి స్థానంలో తమన్ తో పాటు మరో ఇద్దరు సంగీత దర్శకుల్ని తీసుకున్నట్టు ప్రచారం జరిగింది.

కట్ చేస్తే, ఇప్పుడు అవమానం జరిగింది దేవిశ్రీకి కాదు, తమన్ కే పెద్ద పరాభవం జరిగినట్టు కనిపిస్తోంది. పుష్ప-2 కోసం తమన్ ను తీసుకొచ్చి, ఆ తర్వాత అతడి వర్క్ ను పక్కనపెట్టారు. తాజాగా సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో పాటు, సినిమా టైటిల్స్ తో ఇది క్లియర్ అయింది.

పుష్ప-2 రిలీజైన సందర్భంగా సామ్ సీఎస్ స్పందించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాకు 90 శాతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తనే అందించానని ప్రకటించాడు. దేవిశ్రీ ప్రసాద్ అప్పటికే క్రియేట్ చేసిన కొన్ని సౌండింగ్స్ ను వాడుకుంటూనే, మిగతా పనిని తాను పూర్తి చేశానని, మరీ ముఖ్యంగా క్లయిమాక్స్ ఫైట్ లో వచ్చే బీజీఎం కూడా తనదేనని అన్నాడు.

దీంతో పుష్ప-2 సినిమాకు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను ఎక్కడా వాడలేదనే విషయం స్పష్టమైంది. ఇది నిజంగా తమన్ కు ఘోర అవమానం.

పుష్ప-2 సినిమాకు తను వర్క్ చేసినట్టు స్వయంగా తమన్ ప్రకటించాడు. “కేవలం 15 రోజులు మాత్రమే టైమ్ ఉండడంతో, నేను ఒక పార్ట్ మాత్రమే చేయగలిగాను. నా వల్ల చేయగలిగినంత నేను చేశాను. అది చూసి దర్శకుడు, హీరో చాలా హ్యాపీ.” అంటూ గతంలో స్టేట్ మెంట్ ఇచ్చాడు.

సామ్ సీఎస్ స్టేట్ మెంట్ ప్రకారం చూసుకుంటే, తమన్ వర్క్ ను దర్శకుడు సుకుమార్ పూర్తిగా పక్కనపెట్టినట్టు స్పష్టమైంది. అంతేకాదు, పుష్ప-2 సినిమా టైటిల్ క్రెడిట్స్ లో కూడా ఈ విషయం తెలిపోయింది.

సినిమా టైటిల్స్ లో మ్యూజిక్ అండ్ ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కింద దేవిశ్రీ ప్రసాద్ పేరు వేశారు. ఇక అడిషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో సామ్ సీఎస్ పేరు వేశారు. టైటిల్స్ లో తమన్ పేరు లేదు. ఇప్పుడు చెప్పండి అసలైన అవమానం ఎవరికి..?

5 Replies to “కోరి పిలిచి తమన్ ను అవమానించారా?”

Comments are closed.