పూరి.. కేవలం ప్రవచనాలు మాత్రమే

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయని అన్నాడు ఆత్రేయ. దర్శకుడు పూరి జగన్నాధ్ సంగతి అలాగే వుంది.

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయని అన్నాడు ఆత్రేయ. దర్శకుడు పూరి జగన్నాధ్ సంగతి అలాగే వుంది. ఆయన సినిమాల వల్ల కొనుగోలు చేసిన బయ్యర్లు నానా బాధలు పడి, బజారున పడినా, కన్నీళ్లు పెట్టుకున్నా, పూరి-చార్మిల మనసు మాత్రం కరగదు. పూరి-చార్మిల మాటల మ్యాజిక్‌లో పడి, బిజినెస్ కట్ చూసి, డబుల్ ఇస్మార్ట్ సినిమాను భారీ మొత్తానికి కొనేశారు నిరంజన్ రెడ్డి-చైతన్య రెడ్డి.

పూరి ట్రాక్ రికార్డ్ తెలిసి, సినిమాల ఫ్లాపుల పరంపర తెలిసి, డబ్బుల వెనక్కి ఇవ్వడంలో చార్మిపై ఉన్న విమర్శల సంగతి తెలిసీ బిజినెస్‌లోకి దిగిపోయారు. అప్పటికే వరంగల్ శ్రీను ఎలాంటి బాధలు పడుతున్నాడు, ఎగ్జిబిటర్లు ఎలా తంటాలు పడుతున్నారు అన్నీ తెలిసి కూడా దిగిపోయారు. సన్నిహితులు అనేక మంది “వద్దు.. వద్దు” అని వారించినా, వారు పట్టించుకోకుండా బిజినెస్‌లోకి వెళ్లారు. ఫలితంగా కోట్లకు కోట్లు నష్టపోయారు.

ఇప్పుడు పూరి-చార్మిల అసలైన రూపం తమకు తెలిసి వస్తోందని బాధపడుతున్నారు. డబ్బులు వెనక్కి ఎలాగూ ఇవ్వరు, సినిమా చేస్తామని చెబుతారట కానీ, నెలనెలా ఖర్చులకు ఇంత అమౌంట్ ఇవ్వాలని అడుగుతారట. అంతేకాదు, మళ్లీ లాభాల్లో సగం వాటా ఇవ్వాలట. అంటే ఇంతకీ ఎలాంటి సాయం అందిస్తున్నారో అర్థం కావడం లేదు. డబ్బులు లేవు కావాలంటే తమ పాత సినిమాలు తీసుకుని, వాటిని రీరిలీజ్ చేసుకుని వచ్చిన ఆదాయంలో సగం తీసుకోవాలని చెబుతారట. రీరిలీజ్ లో ఏం వస్తుంది? అందులో మళ్లీ సగం వెనక్కు ఇవ్వమనడం?

ఎంత దారుణం అంటే, డబుల్ ఇస్మార్ట్ సమయంలో పేమెంట్ కట్టినప్పుడు టిడిఎస్ కట్ చేయకుండా పే చేసారట. ఇప్పుడు టిడిఎస్ మొత్తాలు చెల్లించాలంటూ అడిగితే రెస్పాన్స్ లేదట. టిడిఎస్ అన్నది చట్టప్రకారం చెల్లించాల్సిందే కదా అని ప్రశ్నించినా సమాధానం లేదట.

ఇంత దారుణంగా మోసపోతామని తాము అనుకోలేదని, సినిమా తీసుకునే ముందు చెప్పిన మాటలు, ప్రవర్తన, సినిమా విడుదల తరువాత మాటతీరుకు, ప్రవర్తనకు చాలా తేడా ఉందని చెబుతున్నారు. కొందరు మధ్యవర్తుల మాటలు నమ్మి, మాయలో పడి సర్వం కోల్పోయామని, ఇప్పుడు సన్నిహితుల దగ్గర బాధపడుతున్నారని చెబుతున్నారు చైతన్య రెడ్డి-నిరంజన్ రెడ్డి.

10 Replies to “పూరి.. కేవలం ప్రవచనాలు మాత్రమే”

  1. ఆర్జీవీ శిష్యుడు.. ఎక్స్ వైసీపీ ఎమ్మెల్యే బ్రదర్.. బుద్ధులు ఎక్కడ పోతాయి..

    అంతా ఆ తాను ముక్కలే..

  2. ఒక చదువుకున్న వాడు మంచి సౌశ్రుతి లో ఉన్న వాడు సినిమా తీస్తే అది మణిరత్నం సినిమా అంటారు.
    ఒక చదువు సంధ్య లేని వాడు కూడా డైరెక్టర్ కావచ్చు అదే మన దౌర్బాగ్యం వాడు ఆడ వాళ్ళని చెడుగా చిత్రించి డబ్బు చేసుకుంటాడు.
    ప్రవచనాలు మాత్రమే ప్రజల కి
    Even Ramgopal varama movies doesnot have voulger thainks becz of education

Comments are closed.